S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/08/2017 - 22:21

హైదరాబాదీ భామ టబు తెలుగులో కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఓ సమయంలో టాప్ హీరోయిన్ రేంజ్‌లో హవా నడిపించిన ఈమె, హీరోయిన్‌గా క్రేజ్ తగ్గడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా వుంది. ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయి చాలాకాలం అవుతున్నా కూడా ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

07/08/2017 - 22:21

బెబోగా బాలీవుడ్‌లో తనదైన గ్లామర్‌తో క్రేజ్ తెచ్చుకున్న కరీనాకపూర్, మళ్లీ హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. సైఫ్ అలీఖాన్‌ను పెళ్లిచేసుకున్న తరువాత ఈమధ్యే కరీనా ఓ బిడ్డకు తల్లి అయింది. ఆరునెలలు గడిచేసరికి మళ్లీ తిరిగి తన పూర్వపు రూపాన్ని సంతరించుకుని అందంతో షాకిస్తోంది. తాజాగా ఈమె ఓ ఈవెంట్‌లో పాల్గొనడం చూసి అందరూ షాకయ్యారు.

07/08/2017 - 22:20

నయనతార ప్రధాన పాత్రలో ఎ.కె.సజన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రాన్ని తెలుగులో ‘వాసుకి’ పేరుతో విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సినిమాస్ పతాకంపై ఎస్.ఆర్.మోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 14న విడుదలవుతున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో రాజ్ కందుకూరి మాట్లాడుతూ- ‘సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార, ఇలాంటి ఇష్యూపై రూపొందిన సినిమాలో నటించడం మంచి విషయం.

07/08/2017 - 22:20

బొమ్మరిల్లు తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిత్రం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు భాస్కర్. ఈ సినిమా తరువాత ‘బొమ్మరిల్లు భాస్కర్’గా పేరు తెచ్చుకున్న ఆయన, ఆ తరువాత చేసిన సినిమాలతో వరుస పరాజయాలు అందుకున్నాడు. చరణ్‌తో ఆరెంజ్, రామ్‌తో ఒంగోలు గిత్త సినిమాలు భారీ పరాజయం పాలవ్వడంతో ఆ తరువాత భాస్కర్ ఎక్కడా కనిపించలేదు.

07/07/2017 - 21:31

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో శ్రీకాంత్ హీరోగా, నాజియా నాయికగా నటిస్తున్న చిత్రం రా.రా.. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక గీతాన్ని రేడియో మిర్చి కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్‌తోపాటు చిత్ర సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్, నిర్మాత విజయ్ తదితరులు పాల్గొన్నారు.

07/07/2017 - 21:30

ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవకుశ’ సినిమా టీజర్ విడుదలై 24 గంటలు కూడా గడవకముందే సంచలనం సృష్టించింది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసిన ఈ టీజర్ ఇప్పటికా 7 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించింది. పరిశ్రమలో టీజర్ వ్యూస్ పరంగా ఇదొక కొత్త రికార్డ్ అని చెప్పొచ్చు.

07/07/2017 - 21:28

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగఅశ్విన్ తెరకెక్కిస్తున్న బయోపిక్ ‘మహానటి’. స్వప్న సినిమా పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, మరొక పాత్రలో సమంత నటిస్తున్నారు. హీరో దుల్కర్ సల్మాన్ సావిత్ర భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండడం విశేషం.

07/07/2017 - 21:26

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ విడుదలకు సిద్ధం అయింది. దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రానికి ‘్భరత్ అను నేను’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన అసెంబ్లీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక సాంగ్‌ను ప్లాన్ చేశాడట కొరటాల.

07/07/2017 - 21:25

‘నటశేఖర’ కృష్ణ 75 సంవత్సరాల జీవితాన్ని అవలోకిస్తూ రచయిత్రి గుమ్మడి ఝాన్సీలక్ష్మి రచించిన సూపర్‌స్టార్ బ75 పుస్తకాన్ని హైదరాబాద్ విజయనిర్మల స్వగృహంలో ఆవిష్కరించారు.

07/07/2017 - 21:23

రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’పై ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి ఘనవిజయం తర్వాత రానా చేసిన మొదటి సినిమా కావడంతో అందరూ ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. తాజాగా ఈసినిమా విడుదల తేదీని నిర్ణయించారు నిర్మాతలు. ఆగస్టు 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Pages