S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/07/2017 - 21:22

యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి. పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘లై’ (లవ్ ఇంటిలిజెన్స్ ఎనిమిటీ). ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అర్జున్ ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావచ్చింది.

07/07/2017 - 21:21

ప్రస్తుతం అక్కినేని నాగార్జున మంచి జోరుమీదున్నాడు. తాను హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు.. తన ఇద్దరు తనయులకు మంచి కమర్షియల్ సక్సెస్ అందించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇప్పటికే నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తీసిన నాగ్, అఖిల్ కోసం విక్రమ్‌కుమార్‌తో సినిమా చేస్తున్నాడు. నాగార్జున ప్రస్తుతం రాజుగారి గది-2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

07/07/2017 - 21:19

కైలాష్, అభిషేక్, చంద్రశేఖర్ ప్రధాన తారాగణంగా క్రియేటివ్ మైండ్ ప్రొడక్షన్, శ్రావణి మీడియా కమ్యూనికేషన్స్ పతాకాలపై వెంకట్ నారాయణ దర్శకత్వంలో చంద్రనాగ్ చెంగల రూపొందించిన చిత్రం మూడు వందల ముప్ఫై నాలుగో కథ.

07/07/2017 - 21:17

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది గ్లామర్ భామ రకుల్‌ప్రీత్ సింగ్. ఇప్పటికే అటు స్టార్ హీరోలు, ఇటు యువ హీరోలను కవర్ చేసేసింది. మరోవైపు కోలీవుడ్‌లో కూడా అదే క్రేజ్‌ని కంటిన్యూ చేస్తూ దూసుకుపోతున్న ఈ భామ ప్రస్తుతం ఇదివరకు పెట్టుకున్న కండిషన్స్‌ను తప్పించేసింది. ఇకపై గ్లామర్‌గా కనిపించడంతోపాటు బికినీకి కూడా సై అందట! అంతే కాదు.. లిప్‌లాక్‌కు కూడా సిద్ధమని చెప్పేసిందట!

07/07/2017 - 21:16

చంద్ర బాలాజీ ఫిలింస్ పతాకంపై అశోక్‌కుమార్, ప్రియావర్మ జంటగా సాయికృష్ణ కె.వి. దర్శకత్వంలో కె.చంద్రరావు రూపొందిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక ఊళ్ళో’. దీని ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో నటుడు బెనర్జి విడుదల చేశారు.

07/06/2017 - 21:43

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్దదిక్కులా వెలిగిన దివంగత సినీ దర్శకుడు దాసరి నారాయణరావు మృతి పరిశ్రమకు తీరని లోటుగానే మిగిలింది. సాధారణ స్థాయి నుంచి ఎదిగిన దాసరి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ఆయన జీవితం చాలామందికి తెలియదు. దాసరి బతికున్నప్పుడు తన జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకొస్తానని పలుమార్లు ప్రస్తావించేవారు. కానీ అది తీరకుండానే ఆయన మృతి చెందారు.

07/06/2017 - 21:41

వంద సినిమాల తరువాత వేగం పెంచాడు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయన తాజాగా నటిస్తున్న 101వ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పైసావసూల్ అనే టైటిల్ నిర్ణయించారు. దసరా సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా తరువాత ఆయన ఇప్పటికే 102వ చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

07/06/2017 - 20:58

కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్, సాయిధరమ్‌తేజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్ ముఖ్యపాత్రల్లో శ్రీచక్ర మీడియా సారథ్యంలో బుట్టబొమ్మ క్రియేషన్స్ పతాకంపై వేణుగోపాల్, సంజు నిర్మిస్తున్న నక్షత్రం చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఆడియో సీడీలను సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్‌లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కె.వి.వి.సత్యనారాయణ, విజయకుమార్, సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.

07/06/2017 - 20:57

హీరోయిన్‌గా తెలుగు తెరపై అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న కేథరీన్‌కు మొదట్లో అన్ని పరాజయాలే దక్కాయి. పైసా, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలు కూడా ఈమెకు కమర్షియల్‌గా విజయాన్ని అందించలేకపోయాయి. దాంతో తమిళంలో సినిమాలు చేసి అక్కడ క్రేజ్ తెచ్చుకుంది. ఈమధ్యే అల్లు అర్జున్ సరసన సరైనోడులో నటించిన కేథరిన్‌కు ఆ సినిమాతో మంచి ఇమేజ్ దక్కింది.

07/06/2017 - 20:56

భారతీయ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా నిక్కీ గల్రాని హీరోయిన్‌గా సురేష్ గోవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టీమ్ 5. అన్ని కార్యక్రమాలు ప పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ- ‘ట్రైలర్ భిన్నంగా వుంది. 5 నెంబర్ చాలా పాజిటివ్. పంచాక్షరి, పంచముఖి, ఇప్పుడు టీమ్ 5 కుదిరింది.

Pages