S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/06/2017 - 20:54

సుకుమార్ దర్శకత్వంలో భిన్నమైన సినిమాగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985 చిత్రంలో నటిస్తున్నాడు రామ్‌చరణ్. ఇందులో ఆయన గెటప్ కొత్తగా వుంది. 80వ దశకంలోని కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తిచేసుకుంది. ఈ సినిమా తరువాత ఆయన మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ మహేష్ బాబుతో స్పైడర్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

07/06/2017 - 20:52

గోపీచంద్, హన్సిక, కేథరిన్ హీరో హీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.్భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న చిత్రం ‘గౌతమ్‌నంద’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 28న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- ‘ఈ చిత్రాన్ని రెండోవారంలోనే విడుదల చేయాలనుకున్నాం. కానీ సిజి వర్క్ కారణంగా ఆలస్యమైంది.

07/06/2017 - 20:50

నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్‌బాబు, ఆది హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘శమంతకమణి’. ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు..
కారు చుట్టూ

07/06/2017 - 20:48

శ్యామ్, షరీఫ్, అమృత, మీతా ప్రధాన తారాగణంగా మేఘాంశ్ మూవీస్ పతాకంపై ఎస్.రాజా దర్శకత్వంలో బి.ఎస్.ప్రసాద్ తెలుగులో అందిస్తున్న చిత్రం ‘ది లాస్ట్ హారర్’ (దెయ్యాల ఆట మొదలైంది). బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువాద కార్యక్రమాలు పూర్తిచేశారు.

07/06/2017 - 20:46

గ్లామర్ భామ నయనతార ఈమధ్య సెలెక్టివ్‌గా సినిమాల్ని చేస్తోంది. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంటూనే మరోవైపు స్టార్ హీరోలు, చిన్న హీరోలు అని చూడకుండా మంచి పాత్ర వచ్చిందంటే ‘సై’ అంటోంది. ఇప్పటికీ కోలీవుడ్‌లో ఈమెకున్న క్రేజ్ మరెవరికీ లేదు. తాజాగా మరో సినిమాలో నటించేందుకు ఓకె చెప్పిందట. అది కూడా పాంచాలి పాత్ర అని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.

07/06/2017 - 00:16

ఒకప్పుడు సౌత్‌లో ఇలియానాకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పోకిరి’ సంచలనం తరువాత కొనే్నళ్లపాటు సౌత్‌లో ఇలియానా టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. ఆ తరువాత ఈ నడుము సుందరి బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ అవకాశం వచ్చినపుడల్లా బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ మధ్యమధ్యలో హాట్ హాట్ ఫొటో షూట్‌లతో కుర్రకారు హృదయాల్లో కాక రేపుతోంది.

07/06/2017 - 00:15

ప్రస్తుతం సినిమాలు ప్రేక్షకులను ఎమోషన్‌గా కనెక్ట్ చేసే విషయంలో పంథా మారింది. ఎంతసేపూ ఎంటర్‌టైన్ చేయడమే పనిగా సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఈమధ్య సినిమాల వసూళ్ల గురించి మాట్లాడుతూ సినిమాలోని ఫీల్‌ని మిస్ అవుతున్నారని అంటున్నాడు యువ హీరో నాని. ఆయన తాజాగా డి.వి.వి.ఎంట్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి, కోన ఫిలిం కార్పొరేషన్ పతాకాలపై శివ నిర్వాణ దర్శకత్వంలో ‘నిన్ను కోరి’ చిత్రంలో నటిస్తున్నాడు.

07/06/2017 - 00:15

ప్రస్తుతం భిన్నమైన సినిమాగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్నాడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. ఇప్పటికే ఈ సినిమాలోని చరణ్ స్టిల్స్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 1985 నాటి కథ అంటూ సాగుతున్న ఈ సినిమాలో చరణ్ చెవిటివాడిగా నటిస్తున్నాడని, రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలుపెట్టనుంది.

07/06/2017 - 00:14

వరుణ్‌తేజ్, సాయి పల్లవి జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందించిన చిత్రం ‘్ఫదా’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈనెల 10న ఆడియో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామన్నారు.

07/06/2017 - 00:14

వారాహి చలన చిత్రం సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘రెండు రెళ్ళ ఆరు’. నూతన దర్శకుడు నందు మల్లెల డైరెక్ట్ చేశారు. శుక్రవారం ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా నందు చెప్పిన విశేషాలు..
భిన్నమైన కథనం

Pages