S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/02/2017 - 21:21

ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా వికెఎ ఫిలింస్ పతాకంపై ఆర్.వి.సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో కెఆర్ విజయ్‌కరణ్, కెఆర్ కౌశల్‌కరణ్, కెఆర్ అనిల్‌కరణ్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఇగో’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోలో జరిగింది. తొలి సన్నివేశంపై సంగీత దర్శకుడు సాయి కార్తీక్ క్లాప్ ఇవ్వగా, శ్రీనివాస్ గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

07/02/2017 - 21:19

‘మల్లీశ్వరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కత్రినా కైఫ్‌ను అంత త్వరగా మరిచిపోలేం. బాలీవుడ్‌లో హిట్‌మీద హిట్‌లు ఇస్తూ టాప్‌స్టార్‌గా ఎదిగిన కత్రినా ఆ తర్వాత దక్షిణాదివైపు కనె్నత్తి చూడలేదు. తాజాగా ఆమె నటించిన ‘జగ్గా జాసూస్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో కత్రినా కైఫ్ బిజీగా పాల్గొంటోంది.

07/02/2017 - 21:18

సహజంగా అమ్మాయిలు తమకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతారు. మరికొందరు ఊహల్లో మునిగి బయటకు చెప్పడానికి ఇష్టపడరు. కానీ హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసి ప్రస్తుతం అవకాశాలు లేక సతమతమవుతున్న హీరోయిన్ పూనమ్ కౌర్ తనకు అచ్చం పవన్‌కల్యాణ్ లాంటి భర్త కావాలంటూ స్టేట్‌మంట్ ఇచ్చింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఒక ‘విచిత్రం’ సినిమాతో హీరోయిన్‌గా మెరిసిన పూనమ్ కౌర్ ఆ తర్వాత అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది.

07/02/2017 - 21:17

‘కత్తిరెడ్డి’ అనే టైటిల్ వింటేనే విచిత్రంగా ఉంది కదూ. ఇంతకీ ఈ రెడ్డిగారు అంటే బ్రహ్మానందం. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. ‘ఎత్తితే దించడు’ అనే టాగ్‌లైన్‌కూడా ఈ సినిమాకు ఉంది. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ‘జబర్దస్త్’ ఫేమ్ రచ్చరవి కూడా నటిస్తున్న ఈ చిత్రానికి రవివర్మ దర్శకత్వంలో నిర్మించనున్నారు.

07/02/2017 - 21:15

‘వైశాఖం చిత్రంలో ప్రతి పాటా వైవిధ్యంగా ఉంటుంది. దర్శకురాలు జయకు మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది. ఈ సినిమాలో అన్ని పాటలకు కొరియోగ్రఫీ చేయడం మరిచిపోలేని అనుభవం’ అని డాన్స్ మాస్టర్ శేఖర్ విజె తెలిపారు. ఆర్‌జె సినిమాస్ పతాకంపై జయ.బి దర్శకత్వంలో బి.ఎ.రాజు రూపొందించిన చిత్రం వైశాఖం. హరీష్, అవంతిక జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ట్రైలర్లకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది.

07/02/2017 - 21:14

జగపతిబాబు కధానాయకుడిగా మళ్లీ ప్రేక్షకులను అలరించనున్నారు. కారెక్టర్ ఆర్టిస్టుగా విలన్‌గా నటిస్తున్న ఆయన తిరిగి హీరోగా నటిస్తున్న చిత్రం ‘పటేల్ సార్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. వారాహి చలనచిత్రం పతాకంపై వాసు పరిమి దర్శకత్వంలో రజని కొర్రపాటి రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ కానె్సప్ట్ టీజర్‌కు 2.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

07/02/2017 - 21:12

సంపూర్ణేశ్ బాబు. గీతా షా జంటగా ఎస్‌ఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన వైరస్ చిత్రం ఇటీవల విడుదలై హిట్ టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా ఆదివారం ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో పాల్గొన్న యూనిట్ సభ్యులు

07/02/2017 - 21:11

నయనతార ప్రధాన పాత్రలో మలయాళంలో రూపొందిన చిత్రం ‘పుదియ నియమం’ ఈ చిత్రాన్ని తెలుగులో వాసుకిగా అనువదిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నటనకు నయనతారకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు రావడం విశేషం. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఓ స్ర్తి కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

07/01/2017 - 21:23

బాహుబలితో జాతీయ హీరోగా మారిన ప్రభాస్‌తో నటించేందుకు ఏ హీరోయిన్ మాత్రం ఓకే అనదు చెప్పండి. అలాంటి అవకాశం వస్తే ఈ భామ మాత్రం ‘సారీ.. చెయ్యలేను’ అని చెప్పిందట. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే.. బాలీవుడ్ సెక్సీభామ సోనమ్ కపూర్! ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమా కోసం మొదట్లో ఈ భామను అడిగారట! స్క్రిప్ట్ కూడా నచ్చడంతో సానుకూలంగా స్పందించింది.

07/01/2017 - 21:21

ఆర్.జె. సినిమాస్ అంటేనే ఓ మంచి సంస్థ. ఇప్పుడు రూపొందించిన 3వైశాఖం2 మంచి సినిగా రూపొందిందని నమ్ముతాను. విజువల్‌గా చాలా బ్యూటీతో మంచి మ్యూజిక్‌తో రూపొందించారు. హరీశ్, అవంతిక లుక్స్ సూపర్. మంచి కంటెంట్ వుంటే జయ, బి.ఎ.రాజు సంస్థలో మంచి చిత్రాన్ని చేయడానికి నేను సిద్ధం2 అని హీరో నాగచైతన్య తెలిపారు.

Pages