S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/09/2017 - 21:03

సీనియర్ హీరోల్లో నాగార్జున మంచి ఊపుమీదున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త పంథాతో చిత్రాలను రూపొందిస్తూనే, హీరోగానూ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘మనం’ చిత్రం తరువాత సెలెక్టెడ్ సినిమాలతో స్టార్ ఇమేజ్ మరింత పెరిగింది. అక్కినేని చివరి సినిమా ‘మనం’ విడుదలకు ముందు, సినిమా సూపర్‌హిట్ అని ప్రకటించి మరీ హిట్టందుకున్నాడు. గత ఏడాది సోగ్గాడే చిన్నినాయన చిత్రానికీ అదే రిపీట్ అయ్యింది.

06/09/2017 - 21:00

సూరజ్, రవీంద్రతేజ, సోనియా, ఫరా హీరో హీరోయిన్లుగా జిఎల్‌బి శ్రీనివాస్ దర్శకత్వంలో అనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై ముళ్లగూరు అనంతరాముడు, ముళ్లగూరు రమేష్‌నాయుడు నిర్మిస్తున్న ‘టూ ఫ్రెండ్స్’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే గాంధీ క్లాప్‌నివ్వగా, నటుడు విజయ్‌చందర్ స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సాయిప్రకాష్ గౌరవ దర్శకత్వం వహించారు.

06/09/2017 - 20:58

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాణి జంటగా రిషి మీడియా, శ్రీచక్ర ఇన్నోవేషన్స్ పతాకంపై ఎ.ఆర్.శరవణన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మరకతమణి’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 16న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

06/09/2017 - 20:57

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్ ప్రధాన తారాగణంగా ఎస్.బి.కె ఫిలింస్ పతాకంపై సి.వి.కుమార్ దర్శకత్వంలో ఎస్.కె.కరీమున్నీసా రూపొందించిన చిత్రం ప్రాజెక్ట్ జెడ్. తమిళంలో విజయవంతమైన మాయావన్ చిత్రానికి అనువాద చిత్రం ఇది. ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

06/09/2017 - 20:55

ఈమధ్య హీరోయిన్లు కేవలం గ్లామర్ డాల్స్‌గానే మిగిలిపోకుండా తమకంటూ ప్రత్యేకత సంతరించుకునేలా పాత్రల్ని ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆసక్తిచూపే హీరోయిన్లు ఎక్కువవుతున్నారు. పాత్ర బావుంటే చాలు దేనికైనారెడీ అనే తరహాలో దూసుకుపోతున్నారు. దశాబ్దకాలంపాటు దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన అందాల భామ త్రిష, కొంతగ్యాప్ తరువాత రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

06/09/2017 - 20:53

బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా మామూలుగా లేదు. జీవిత కథల ఆధారంగా తెరకెక్కించిన సినిమాల్లో చాలావరకూ సంచలనం రేపిన సినిమాలే ఎక్కువ. అందుకని బయోపిక్‌లతో సినిమాలు తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో బయోపిక్ సన్నాహాలు చేస్తున్నాడు ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాల్. ప్రస్తుతం ఆయన దీపికతో పద్మావతి సినిమా చేస్తున్నాడు.

06/08/2017 - 21:35

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే 80 శాతంపైగా పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన కొంత టాకీని ఈనెల 13 నుంచి చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్ నాలుగు రోజులపాటు జరగనుందని, దాని తరువాత జూలైలో పాటలని తెరకెక్కిస్తారట. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

06/08/2017 - 21:33

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్. ఇప్పటికే స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ రేసులో వున్న రకుల్, ప్రస్తుతం మహేష్ సరసన స్పైడర్‌లో నటిస్తోంది. దాంతోపాటు తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తోంది.

06/08/2017 - 21:31

సునీల్ మంచి డాన్సర్. తన ప్రతిభను ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చాడు. అతని డాన్సులు తెరపై చూస్తుంటే ముచ్చటనిపిస్తుంది. అలాగే దర్శకుడు క్రాంతి మాధవ్‌కు, సునీల్‌కు ఈ సినిమా పెద్ద సక్సెస్ తీసుకురావాలి అని దర్శకుడు వి.వి.వినాయక్ చెప్పారు. సునీల్, మియాజార్జ్ జంటగా యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శత్వంలో పరుచూరి కిరీటి రూపొందిస్తున్న చిత్రం ‘ఉంగరాల రాంబాబు’.

06/08/2017 - 21:28

రచ్చ సినిమాతో కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంపత్‌నంది ప్రస్తుతం గోపీచంద్‌తో గౌతమ్ నందా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఓ వైపు దర్శకత్వం వహిస్తూనే, మరోవైపు నిర్మాతగా సెలెక్టివ్‌గా సినిమాల్ని రూపొందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గాలిపటం సినిమా తరువాత సంపత్ నంది నిర్మిస్తున్న మరో చిత్రం పేపర్ బాయ్.

Pages