S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శ్రీశ్రీ నాగలక్ష్మి సినిమా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జింక హరిబాబు దర్శకత్వంలో రాయగిరి ఉమాపతి గౌడ్ రూపొందిస్తున్న చిత్రం ‘సోగ్గాడే శోభన్‌కృష్ణ’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు సాగర్ సీడీ విడుదల చేసి నటుడు నారాయణరావుకు అందించారు.
యంగ్ హీరో నితిన్‌కు పవన్‌కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో వేరే చెప్పనక్కర్లేదు. అలాగే త్రివిక్రమ్, నితిన్‌ల కాంబినేషన్ ఎలా ఉంటుందో ‘అ.. ఆ’ సినిమాతో రుజువైపోయింది. ఇలాంటి ఈ రెండు ముచ్చటైన కాంబినేషన్లు కలిసి ఒకే సినిమా చేస్తే అభిమానులకు పండుగనే చెప్పాలి. ఈ ముగ్గురి కలయికలో పవన్, త్రివిక్రమ్‌లు నిర్మాతలుగా నితిన్ హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆఖరులో ఈ సినిమా అనౌన్స్ అయింది.
నాని కథానాయకుడుగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య రూపొందిస్తున్న చిత్రం నిన్ను కోరి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఆడిగా అడిగా..
సునీల్ కథానాయకుడుగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి రూపొందిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి పాట ‘హూ లాలాల హూ లాలాల’ను పాత్రికేయులు విడుదల చేసి, దివంగత దర్శకుడు దాసరి నారారాయణరావుకు అంకితమిచ్చారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ..
తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సంఘమిత్ర సినిమా యూనిట్ ఇప్పుడు ఆలోచనలో పడింది. ఈ సినిమా టైటిల్ రోల్‌లో నటిస్తున్న గ్లామర్ భామ శృతిహాసన్ తప్పుకోవడంతో ఇప్పుడు సంఘమిత్ర తిట్లేల రోల్ పోషించేదెవరు? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే సౌత్ క్రేజీ భామ అనుష్క పేరు వినిపించినప్పటికీ.. లేటెస్ట్‌గా బాహుబలి సినిమా చేసింది కాబట్టి ఈ సినిమాలో ఆమె నటించడం అనుమానమే.. ఇప్పటికే అనుష్కతో చర్చలు జరుపుతున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాల’. పా.రంజిత్ డైరెక్ట్‌చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ‘కబాలి’తర్వాత రజనీ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌మీద అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీస్థాయి అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా నటిస్తున్నారని టాక్. అయితే ఈ విషయమై చిత్ర టీమ్ నుండి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
జాతీయ నటుడు కమల్‌హాసన్ సినిమాలు తీయడం మానేస్తానని అంటున్నాడు. అవునా ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన జిఎస్‌టి బిల్లు విషయంలో సినిమా పరిశ్రమపై 28 పర్సెంట్ పడిందని, ఈ పన్ను శాతాన్ని తగ్గించకపోతే తాను సినిమాలుచేయడం మానేస్తానని అన్నాడు. జులై 1నుండి అమలయ్యే ఈ పన్నుపై ఆయన వ్యతిరేకత వ్యక్తం చేసారు.
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని జంటగా రిషీ మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ పతాకాలపై ఎ.ఆర్.కె.శరవణన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం మరకతమణి. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో నాని సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, సంగీతం బావుందని, విజయవంతమవ్వాలని కోరుకున్నారు.
మంజునాధ్, తనిష్క తివారి జంటగా ఎస్.వి.ఎం. దర్శకత్వంలో శ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘మా ఊరి ప్రేమకథ’. గ్రామీణ నేపథ్యంలో జరిగే లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంజునాధ్ మాట్లాడుతూ- నిజ జీవిత సంఘటనల నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది.
అశ్విన్ కథానాయకుడుగా పరిచయం అవుతున్న ఓ చిత్రాన్ని లోకి ఫిలిమ్స్ సంస్థ బిఎంజె స్టూడియోస్‌తో కలసి సంయుక్తంగా రూపొందిస్తున్నారు. వశిష్ట పారుపల్లి దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తిచేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించనున్నారు.