S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/19/2017 - 21:07

అల్లరి నరేష్, నిఖిలా విమల్ జంటగా జాహ్నవి ఫిలింస్ పతాకంపై జి ప్రజిత్ దర్శకత్వంలో గొప్పన చంద్రశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘మేడమీద అబ్బాయి’. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఒరు వడక్కమ్ సెల్ఫీ’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

05/19/2017 - 21:06

జాలే ఫిలింస్ పతాకంపై జెవి నాయుడు ప్రధాన పాత్రగా చేస్తున్న చిత్రం ‘బిట్రగుంట (ది బిగినింగ్)’. నాగరాజు తలారి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రమిది. మురళీధర్‌రెడ్డి, ఇషిక జంటగా నటిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

05/19/2017 - 21:02

బాహుబలితో అంతర్జాతీయ స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. ఈ సినిమాతో ఆయన మార్కెట్ అమాంతం పెరిగింది. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రం సాహో. ఇప్పటికే విడుదలైన టీజర్ సంచలనం రేపింది. బాహుబలి ఇంపాక్ట్‌తో సాహో చిత్రానికి భారీ బిజినెస్ ఆఫర్ దక్కిందట. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

05/19/2017 - 21:00

గత ఏడాది కన్నడరంగంలో భారీ విజయం అందుకున్న ‘యూ టర్న్’ చిత్రంపై తెలుగు, తమిళ, రంగాల్లో చర్చలు సాగుతున్నాయి. ఈ సినిమాను రీమేక్ చేయాలని ఆలోచనతో పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రం కావడంతో నటి సమంత సైతం ఈ చిత్రంపై ఆసక్తి ప్రదర్శిస్తోందట. ‘యూ టర్న్’లో చేయాలని అనుకుంటున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.

05/19/2017 - 20:59

జై, అంజలి జంటగా 70 ఎంఎం ఫిలింస్ పతాకంపై పిఎన్ అరుణ్ బాలాజీ కందస్వామి, నందకుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘బెలూన్’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ శీనీష్ మాట్లాడుతూ కొడైకెనాల్‌లో సినిమా షూటింగ్ జరిగిందని, రొమాంటిక్ హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న చిత్రంలో కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని తెలిపారు.

05/19/2017 - 20:57

బాహుబలి సినిమా కొత్త ఉత్సాహాన్ని అందించింది. ముఖ్యంగా భారతీయ సినిమాపై అత్యంత భారీ ప్రభావాన్ని చూపించింది. ఈ నేపథ్యంలో సినిమా తీయడానికి అప్పుడే చాలామంది దక్షిణ నిర్మాతలు సన్నాహాలు మొదలుపెట్టారు. బాహుబలి ఘనవిజయం సాధించడంతోపాటు ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 1500 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా స్ఫూర్తితో చారిత్రక నేపథ్యంలో మరో సినిమా సంఘమిత్ర తెరకెక్కబోతోంది.

05/19/2017 - 08:28

శర్వానంద్ కథానాయకుడిగా నటించిన శతమానంభవతి చిత్రానికి జాతీయ అవార్డు లభించిన సందర్భంగా నిర్మాత దిల్ రాజు గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి అవార్డును ఆయనకు చూపించారు. ఈ సందర్భంగా మంచి చిత్రాలను తీసి అవార్డులు సాధించాలని ముఖ్యమంత్రి సినిమా పరిశ్రమకు పిలుపునిచ్చారు.

05/19/2017 - 08:27

అశోక్‌చంద్ర, తేజారెడ్డి, కారుణ్య ప్రధాన తారాగణంగా శ్రీ శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై కరణ్‌రాజ్ దర్శకత్వంలో ఎస్.పి.నాయుడు రూపొందించిన చిత్రం ‘ఇదో ప్రేమలోకం’. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సాయివెంకట్ తొలి సీడీని విడుదల చేసి నరేశ్‌కు అందజేశారు.

05/19/2017 - 08:26

వివాదాలతో చెలిమి చేయడం రాయ్ లక్ష్మికి కొత్తేమీ కాదు. అప్పట్లో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో ఓపెన్‌గానే చెట్టపట్టాల్ వేసుకుని తిరిగిన ఈ అమ్మడు.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో బోల్డ్ స్టేట్‌మెంట్‌లతో హీట్ పెంచింది. ఇక ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో సామాజిక మాధ్యమాల్లో వేడెక్కించే ఫొటోల్ని అప్‌లోడ్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది.

05/19/2017 - 08:25

రామ్‌చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నాచురల్ లొకేషన్స్‌లో మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేశారు. కథానాయికగా సమంత నటిస్తున్న ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈనెల 9 నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ జరుగుతోంది.

Pages