S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2017 - 21:08

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు ప్రమోషన్ కొట్టేసిన ప్రియాంక చోప్రా, అక్కడైనా ఇక్కడైనా తాను ఒకేవిధంగా కష్టపడుతున్నానని, హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా తనకు తేడాలు లేవని చెబుతోంది. బాలీవుడ్ కంటే హాలీవుడ్‌పైనే ప్రియాంక చోప్రా మమకారం చూపుతోందంటూ వస్తోన్న కథనాలపై ఆమె ఇలా క్లారిటీ ఇచ్చింది.

05/02/2017 - 21:06

మనం ఎలా ఉన్నా ఫర్వాలేదు. ఫొటో తీసేవాడిదే గొప్ప అంటోంది అందాల గోవా బ్యూటీ ఇలియానా. దాదాపు పదిహేనేళ్లుగా నటిస్తూనే వున్నా, ఇప్పటికీ అందం తరిగిపోకుండా కాపాడుతూ మెరిసిపోతోంది బక్కపల్చని గోవా బ్యూటీ. అవకాశాలు తగ్గుముఖం పట్టినా, ఎప్పటికప్పుడు తన ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ నిబోన్ నేతృత్వంలో చేసిన ఫొటో షూట్స్ సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులకు కనువిందు చేస్తోంది.

05/02/2017 - 21:04

బాహుబలి ఇమేజ్ ‘బిగినింగ్’లో దొరికినంతగా ‘కన్‌క్లూజన్’లో దొరకకపోయినా -తమ్మూ బేబీకి అంతకంటే మంచి చానే్స దక్కేలావుంది. శివుడితో ప్రణయ కలాపాలు సాగించే చాన్స్ ‘కన్‌క్లూజన్’లో తమ్మూకి రాజవౌళి ఇవ్వలేదు. ఆమె పాత్రను చాలా పరిమితం చేసేశారు. ఆ బాధలోవున్న తమన్నాకి ఓదార్పు కలిగించేలాంటి చాన్స్ మళ్లీ ప్రభాస్‌తోనే దక్కనుంది.

05/02/2017 - 21:03

కృష్ణవంశి దర్శకత్వంలో శ్రీచక్ర మీడియా, బుట్టబొమ్మ క్రియేషన్స్ పతాకాలపై సందీప్‌కిషన్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న చిత్రం ‘నక్షత్రం’. ‘ఒక్కపాట చిత్రీకరణ మిగిలివుంది. అది హీరోయిన్‌పై చిత్రీకరిస్తాం. టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నాం’ అని దర్శకుడు కృష్ణవంశీ చెబుతున్నాడు.

05/02/2017 - 21:01

సచిన్ హీరోగా తాతినేని సత్య దర్శకత్వంలో వైకింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రైనా జోషి రూపొందిస్తున్న చిత్రం ‘వీడెవడు?’ ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తిచేసి జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

05/02/2017 - 21:00

అర్చన ప్రధాన పాత్రలో వరుణ్ సందేశ్ ప్రత్యేక పాత్రలో ఎపిక్ పిక్చర్స్, బోర్న్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకాలపై డి రామకృష్ణ దర్శకత్వంలో బి ప్రదీప్‌రెడ్డి, బి భవానీ శంకర్, బి శ్రీనివాసరెడ్డి, శరత్ రూపొందించిన చిత్రం ‘మర్లపులి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. సినిమా ట్రైలర్‌ను డిజె సెట్‌లో దర్శకుడు హరీశ్ శంకర్, వంశి పైడిపల్లి సంయుక్తంగా విడుదల చేశారు.

05/02/2017 - 20:58

గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై జయంత్ సి పరాన్జి దర్శకత్వంలో కె అశోక్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘జయదేవ్’. చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన ఓ పాటకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు.

05/02/2017 - 20:56

అర్జున్, క్రాంతిచంద్, అవితేజ్, ప్రదీప్, కోయల్‌దాస్, సుపూర్ణ ప్రధాన తారాగణంగా శ్రీ సిద్ధి సెవెన్ హిల్స్ క్రియేషన్స్ పతాకంపై వెంకటరెడ్డి ఉసిరిక దర్శకత్వంలో ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి రూపొందించిన చిత్రం ‘చంద్రుడిలో ఉండే కుందేలు’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది.

05/02/2017 - 20:55

ఎఆర్ మురుగదాస్ ప్రొడక్షన్స్ పతాకంపై దిలీపన్, అంజలి జంటగా కిన్‌స్లిన్ దర్శకత్వంలో మురుగదాస్ రూపొందించిన తమిళ చిత్రం ‘వత్తికుచ్చి’. ఈ చిత్రాన్ని తెలుగులో జెబి ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్‌రావు మార్టోరి ‘గోలీసోడా’ పేరిట అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

05/02/2017 - 20:52

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాణి జంటగా ఎఆర్‌కె శరవణన్ దర్శకత్వంలో రిషి మీడియా, శ్రీచక్రా ఇన్నోవేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘మరకతమణి’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Pages