S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2016 - 04:04

విశాల్, కేథరీన్ జంటగా పాండ్యరాజ్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన చిత్రం ‘కథకళి’. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలై ఘనవిజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ చిత్రాన్ని అదై టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు.

01/21/2016 - 04:03

ఈ సంక్రాంతి పండక్కి సోగ్గాడిగా అలరించిన ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన తదుపరి చిత్రం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈసారి మళ్లీ భక్తి సినిమాలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన నటించిన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిరిడీ సాయి’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతో ఇప్పుడు మరో భక్తి సినిమాను తెరకెక్కించేందుకు దర్శకేంద్రుడు సమాయత్తమవుతున్నాడు.

01/21/2016 - 04:03

రంజిత్, అర్చన జంటగా సాయికిరణ్ ముక్కామల దర్శకత్వంలో మాంత్రిక్ మీడియా వర్క్స్ పతాకంపై రూపొందిన ‘కథనం’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ సీడీని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ చాలా బాగుందని, టైటిల్‌తోపాటు ట్యాగ్‌లైన్ కూడా నచ్చిందని అన్నారు.

01/21/2016 - 04:01

సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ హీరోగా ఆనంది హీరోయిన్‌గా శ్యామ్ ఆంటోనీ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రాన్ని తెలుగులో ‘నాకు ఇంకో పేరు వుంది’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. తమిళంలో ‘ఎనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు’ అనే టైటిల్‌తో రూపొందుతోంది.

01/21/2016 - 04:01

వినయ్‌రాయ్, సాక్షీ చౌదరి, స్వస్తిక జంటగా శరన్ దర్శకత్వంలో ఆర్.కె. ఫిలింస్ పతాకంపై ప్రతాని రామకృష్ణగౌడ్ నిర్మిస్తున్న ‘కింగ్స్’ చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు శరన్ మాట్లాడుతూ, ఇదొక మంచి ఫాంటసీ ఎంటర్‌టైనర్. సూర్యగ్రహణం రోజున పుట్టిన ఇద్దరు కవల పిల్లలు బద్ధశత్రువులుగా మారడమనే మంచి కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇదన్నారు.

01/20/2016 - 04:29

ఈ మధ్య సినిమాలపై బాగా దృష్టిపెట్టింది అందాల భామ త్రిష. దశాబ్దకాలంపాటు గ్లామర్ భామగా సౌత్‌లో హవా సృష్టించిన ఈమెకు ఈమధ్య కాస్త కెరీర్ డల్ అయింది. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తూ సెలక్టివ్ పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలు విభిన్నమైన చిత్రాల్లో నటిస్తున్న త్రిష ఈసారి పొలిటికల్ లీడర్‌గా నటిస్తోంది. తమిళనాట రాజకీయాల్లో చక్రం తిప్పిన మహిళా నేతగా కనిపిస్తుందని తెలిసింది.

01/20/2016 - 04:32

గత ఏడాది ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది గ్లామర్ భామ తమన్నా. ఆమె తాజాగా నటించిన ‘బెంగాల్ టైగర్’ సినిమాలో గ్లామర్‌తో ప్రేక్షకుల్ని పిచ్చెక్కించింది. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ మరోవైపు కమర్షియల్ ప్రోడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ప్రచారం కల్పిస్తోంది.

01/20/2016 - 04:26

శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా మాట్రిక్స్ టీమ్‌వర్క్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ నిర్మల కానె్వంట్. జి. నాగకోటేశ్వరరావు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో శ్రేయాశర్మ కథానాయికగా నటిస్తోంది. జైపూర్, అరకు, మెదక్, నైనిటాల్, చిగ్‌మంగళూరులలో ఐదు షెడ్యూల్స్ పూర్తిచేశారు.

01/20/2016 - 04:24

సువర్ణా క్రియేషన్స్ పతాకంపై కె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మించిన చిత్రం ‘తొలి కిరణం’. ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ హైదరాబాద్ సారథి స్టూడియోస్‌లో జరుపుతున్నారు.

01/19/2016 - 23:45

ఎనిమిది సంవత్సరాలుగా చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్నారు. రీఎంట్రీ ఇస్తూ రూపొందించే 150వ సినిమా కోసం కొన్ని రోజులుగా కసరత్తు జరుగుతూనే వున్నాయి. ఇప్పటికే పలు కథలు విన్న చిరంజీవి, మొత్తానికి తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తాడన్న విషయం తెలిసిందే.

Pages