S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/25/2017 - 22:12

విజయ్ నటిస్తున్న 61వ చిత్రం చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. నేటినుండి కథానాయిక పాత్ర కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఎటువంటి అంచనాలు లేకుండా కథానాయిక పాత్రలో కాజల్ హాజరై అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. విజయ్-కాజల్ జంటగా రూపొందిన తుపాకి భారీ విజయం సాధించడంతో తిరిగి వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి.

04/25/2017 - 22:11

హెబ్బాపటేల్, నాగఅనే్వష్ జంటగా పళని దర్శకత్వంలో శ్రీ సరస్వతీ ఫిలింస్ ప పతాకంపై భువన్ సాగర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఏంజెల్’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మే 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

04/25/2017 - 22:10

జగపతిబాబు కథానాయకుడిగా చిన్నారి ఆర్ట్స్, శ్రీ తిరుమలాస్ సినిమాస్ పతాకంపై అర్జున్ వాసుదేవ్ దర్శకత్వంలో రాజేష్ చిన్నారి, ప్రతాప్ దండెం సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘సూర్యా భాయ్’. ఈ చిత్రానికి సంబంధించిన మూడు షెడ్యూల్స్ పూర్తిచేశారు. చివరి షెడ్యూల్‌ను మే 5 నుండి ప్రారంభించనున్నారు.

04/25/2017 - 22:09

దర్శకులు కె.విశ్వనాథ్‌కు ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించడం.. అవార్డుకే నిండుదనం వచ్చిందని కథానాయకుడు చిరంజీవి అభినందించారు. మంగళవారం విశ్వనాథ్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంలో మాట్లాడుతూ విశ్వనాథ్‌తో తనకు సినిమాపరంగానేగాక, కుటుంబపరంగానూ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్‌కు అవార్డు రావడం చిత్ర పరిశ్రమకే గర్వకారణమన్నారు.

04/25/2017 - 22:08

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 150 థియేటర్లలో విడుదల చేసిన బ్లాక్‌మనీ సినిమా అన్ని కేంద్రాల్లో అద్భుతమైన కలెక్షన్లు రాబడుతుందని, ఈ వారం తామే బాహుబలిగా నిలిచామని నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ తెలిపారు. మోహన్‌లాల్, ఆమలాపాల్ జంటగా జోషీ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన ‘రన్ బేబి రన్’ చిత్రాన్ని బ్లాక్‌మనీగా అనువదించి ఈనెల 21న విడుదల చేసిన సంగతి తెలిసిందే.

04/25/2017 - 22:07

రాహుల్, మహిమా మక్వాన్ జంటగా వేణు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్ సంయుక్తంగా రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం. అచ్చు సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- హ్యాపీడేస్‌లో ఓ హీరోగా నటించిన రాహుల్ ఈ చిత్రంతో బిజీ కావాలని కోరుకున్నారు.

04/25/2017 - 22:06

పిహెచ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న హర్రర్, ఫన్, లవ్ కానె్సప్ట్ మూవీ సినిమా ‘టిక్ టాక్’. పోలిచర్ల హరనాథ్ నిర్మిస్తూ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రోమో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు పోలిచర్ల హరనాథ్ మాట్లాడుతూ- హారర్ కామెడీ జోనర్‌లో అన్ని ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కటలిసి చూసేలా సినిమా ఉంది.

04/25/2017 - 22:04

గాయత్రి ప్రొడక్షన్స్ పతాకంపై నరేష్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో సి.కల్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- పేరులోనే వైవిధ్యం కన్పిస్తోందని, నరేష్ అందించిన సంగీ తం బాగుందని తెలిపారు.

04/25/2017 - 22:03

వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ బ్యానర్‌పై ఎ.గురురాజ్ నిర్మించిన చిత్రం ‘రక్షకభటుడు’. కంటెంట్‌ను హీరోగా పెట్టి దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ చేసిన ఈ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. పాటను మారుతి విడుదల చేశారు.

04/23/2017 - 22:19

ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. గత ఏడాది వచ్చిన సరబ్‌జిత్ చిత్రంలో నటించినందుకుగాను ఈమెకు అవార్డు దక్కింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐశ్వర్యారాయ్‌కు అవార్డును అందజేశారు. కార్యక్రమంలో హేమమాలిని, సయామీఖేర్, సుజిత్ సల్కార్, జీనత్ అమన్‌లు అవార్డులు అందుకున్నారు.

Pages