S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/31/2017 - 20:54

సామాజిక ఇతివృత్తంతో చిత్రాలు రూపొందిస్తున్న దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి. తాజాగా ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘గల్ఫ్’. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. అనంతరం దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ- సునీల్‌కుమార్ ఒక రొమాంటిక్ క్రైం కథ ద్వారా పరిచయం. ఆ తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన గంగపుత్రులు సినిమా చూశాను. చాలా కొత్తగా అనిపించింది.

03/31/2017 - 20:52

ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది సొట్టబుగ్గల తాప్సీ. లేటెస్టుగా ఆమె నటించిన ‘మై నేమ్ ఈజ్ శబానా’ చిత్రం ఇటీవలే విడుదలైంది. సినిమా సినిమాతో క్రేజ్ పెంచుకుంటున్న తాప్సీ, ప్రస్తుతం ప్రేమాయణం సాగిస్తోందని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. దానికి ముఖ్య కారణం- ఇటీవలే ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో తాప్సీ స్పందిస్తూ, తాను ఒంటరిగా లేనని చెప్పడం విశేషం.

03/30/2017 - 21:42

వెంకటేష్, రీతికాసింగ్ ప్రధాన తారాగణంగా వైనాట్ స్టూడియోస్ పతాకంపై సుధా కొంగర దర్శకత్వంలో ఎస్.శశికాంత్ రూపొందించిన చిత్రం ‘గురు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు సుధా కొంగర చిత్రానికి సంబంధించిన పలు విశేషాలు తెలిపారు.
ఆయనకు నచ్చి..

03/30/2017 - 21:40

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా రాజ్ జకారియాస్ నిర్మాతగా సెలబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘టీమ్ 5’. ఈ చిత్రం ద్వారా సురేష్ గోవింద్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మే రెండవ వారంలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని హీరో శ్రీశాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీశాంత్ మాట్లాడుతూ- నేను హీరోగా చేస్తున్న మూడవ చిత్రం ఇది.

03/30/2017 - 21:39

అఛీవర్స్ సిగ్నేచర్ ఎం.ఎఫ్ క్రియేషన్స్ పతాకంపై విన్ను మద్దిపాటి, అక్షత హీరోయిన్లుగా నటించిన ‘శేఖరంగారి అబ్బాయి’ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను దర్శకుడు శ్రీవాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సినిమా యూనిట్‌కు ఆల్ ద బెస్ట్ తెలిపారు.

03/30/2017 - 21:37

ప్రస్తుతం సినీ కథానాయికలు ఎదుర్కొంటున్న పరిణామాలను చూస్తే బాధగా వుంది అంటోంది స్టార్ హీరోయిన్ ఇలియానా. అయితే ఎంతో కొంత ప్రొటెక్షన్‌తో ఉండే సినీ స్టార్స్‌కే ఇలాంటి ఘటనలు ఎదురవుతున్నాయంటే ఇక సాధారణ మధ్యతరగతి అమ్మాయిల పరిస్థితి ఏంటని ఈ అమ్మడు తన బాధను ఓ న్యూస్ ఛానల్ ద్వారా తెలిపింది.

03/30/2017 - 21:35

కళానిలయ క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘సినీ మహల్’ (రోజుకు 4 ఆటలు). లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ రూపొందించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ- ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం డిఫరెంట్ కానె్సప్ట్ మూవీగా రూపొందించామని, శేఖర్ చంద్ర సంగీతం, దొరై.కె.సి కెమెరా పనితనం హైలైట్‌గా వుంటాయని తెలిపారు.

03/30/2017 - 21:34

ఆర్.కె.్ఫలింస్ మరియు జె.వి.ఆర్ సినిమా బ్యానర్‌పై ప్రతాని రామకృష్ణగౌడ్, జల్లేపల్లి వెంకటేశ్వరరావు సంయుక్తంగా సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాకు అహ నా పెళ్లంటా.. పూలరంగడు.. చుట్టాలబ్బాయి లాంటి హిట్ సినిమాలు అందించిన వీరభద్రమ్ దర్శకత్వంలో త్వరలో తెరకెక్కనుంది. ఒక యంగ్ హీరో నటించనున్నట్లు.. ఉగాది పర్వదినాన సినిమా ఆఫీస్‌లో నిర్మాతలు ప్రకటించారు.

03/30/2017 - 21:33

ఎస్.బి.కె.్ఫలింస్ కార్పొరేషన్‌లో ఎస్.కె.బషీద్ దర్శకత్వంలో, ఎస్.కె.కరీమున్నీసా నిర్మించిన చిత్రం ‘నోటుకు పోటు’. గత శనివారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన సందర్భంగా దర్శకుడు ఎస్.కె.బషీద్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ‘నోటుకు పోటు’ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.

03/30/2017 - 21:31

దర్శకుడు పూరి జగన్నాథ్ నందమూరి బాలకృష్ణ 101 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ను ఏప్రిల్ 5 నుండి ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన నటించడానికి కొత్త హీరోయిన్ ముస్కాన్‌ను ఫైనల్ చేసిన పూరి మరో ఇద్దరు హీరోయిన్లను కూడా సెలెక్టు చేశాడట. వాళ్లల్లో ఒకరు అమలాపాల్ అని సమాచారం.

Pages