S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2016 - 21:00

శ్రీవత్సా క్రియేషన్స్ పతాకంపై సంజయ్, చేతనా ఉత్తేజ్, కారుణ్య ప్రధాన తారాగణంగా వి.శశిభూషణ్ దర్శకత్వంలో కమల్‌కుమార్ పెండెం రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత కమల్‌కుమార్ మాట్లాడుతూ, ప్రేమన్నది ప్రపంచ వ్యాప్తంగా వున్న అందమైన అనుభవమని, ప్రేమ విషయంలో ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతూనే వుంటారని తెలిపారు.

01/22/2016 - 20:55

సునీల్ కథానాయకుడిగా వాసూవర్మ దర్శకత్వంలో రాజు రూపొందిస్తున్న చిత్రం ‘కృష్ణాష్టమి’.
ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇటీవల విడుదలయ్యాయి. పాటలకు మంచి స్పందన లభిస్తోందని
దర్శకుడు వాసు వర్మ తెలియజేస్తున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ మిక్కి గల్రాణి, డింపుల్ చోప్‌డే

01/22/2016 - 20:51

హనూ రాఘవపూడి దర్శకత్వంలో నాని, మెహరన్‌కౌర్ జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట రూపొందిస్తున్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని మహేష్‌బాబు విడుదల చేశారు.

01/22/2016 - 20:49

‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఇంత విజయం సాధించడానికి నాలుగు మూలస్తంభాలు వున్నాయని, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సుకుమార్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌లే ఆ నలుగురు అని, వారు లేకపోతే ఈ చిత్రం ఇంత గొప్పగా రూపొందేది కాదని, అంతే విజయాన్ని సాధించేది కాదని నటుడు ఎన్టీఆర్ తెలిపారు.

01/22/2016 - 20:46

ఒకప్పుడు టాలీవుడ్‌లోకి బాలీవుడ్ ముద్దుగుమ్మలు వలసలు కట్టేవారు. ఇప్పుడు ఈ వలసలు మలయాళ పరిశ్రమనుండి ఎక్కువయ్యాయి. ఇప్పటికే పలువురు భామలు టాలీవుడ్‌లో హంగామా చేస్తున్నారు. లేటెస్ట్‌గా మరో హీరోయిన్ పరిచయంకానుంది. ‘ప్రేమమ్’ సినిమాలో నటించిన మడోన సెబాస్టియన్ తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.

01/21/2016 - 04:10

ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ దాదాపు పూర్తికాగా, ఈ సినిమా తరువాత మహేష్ నటించే కొత్తచిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి. ప్రముఖ తమిళ సంచలన దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫిబ్రవరిలోనే సినిమాను మొదలుపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

01/21/2016 - 04:08

ఈ ఏడాది ప్రారంభంలో శైలజగా ప్రేక్షకులను ఆకట్టుకుంది అందాల భామ కీర్తి సురేష్. రామ్ సరసన

01/21/2016 - 04:06

రామ్‌చరణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బ్రూస్‌లీ’ చిత్రం అనుకున్న స్థాయి విజయం సాధించకపోవడంతో మంచి విజయాన్ని కొట్టాలనే కసితో వున్నాడు రామ్‌చరణ్. ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందే సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. తమిళ హిట్ సినిమా ‘తనిఒరువన్’కు రీమేక్‌గా రూపొందే ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడు. ఈ సినిమాతోపాటు మరో రెండు మూడు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు చరణ్.

01/21/2016 - 04:04

విశాల్, కేథరీన్ జంటగా పాండ్యరాజ్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన చిత్రం ‘కథకళి’. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలై ఘనవిజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ చిత్రాన్ని అదై టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు.

01/21/2016 - 04:03

ఈ సంక్రాంతి పండక్కి సోగ్గాడిగా అలరించిన ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన తదుపరి చిత్రం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈసారి మళ్లీ భక్తి సినిమాలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన నటించిన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిరిడీ సాయి’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతో ఇప్పుడు మరో భక్తి సినిమాను తెరకెక్కించేందుకు దర్శకేంద్రుడు సమాయత్తమవుతున్నాడు.

Pages