S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/23/2017 - 21:43

‘బాహుబలి’ చిత్రం ఎప్పటికప్పుడు కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తోంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు. సీక్వెల్స్‌కు విజయం చేకూరదు అన్న ఓ బలమైన నమ్మకం పరిశ్రమలో పాతుకుపోవడంతో ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలన్న కృతనిశ్చయం ఆయనలో కనబడుతోంది. సీక్వెల్‌గా వచ్చిన ఏ సినిమా అయినా తొలి సినిమా సాధించినంత విజయాన్ని సాధించకపోవడం గమనార్హం.

03/23/2017 - 21:41

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 101 సినిమాకు టైటిల్ ఓకె అయింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఏం టైటిల్ పెట్టరో తెలుసా..? ‘టపోరి’. కథ ప్రకారంగా ఈ టైటిల్ బాగుంటుందని పూరి సూచించినట్టు తెలుస్తోంది?

03/23/2017 - 21:39

విష్ణువిశాల్, నిక్కీగల్రాణి ప్రధాన తారాగణంగా ఎళిల్ దర్శకత్వంలో తమిళంలో రూపొందించిన ‘వెల్లైకారన్’ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమలీల పెళ్లిగోల’గా అనువదించారు. మహావీర్ ఫిలింస్ పతాకంపై పారస్ జైన్ తెలుగులో అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. దర్శకుడు వి.వి.వినాయక్ సీడీని ఆవిష్కరించారు.

03/23/2017 - 21:38

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా శ్రీనువైట్ల దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ పతాకంపై నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ‘మిస్టర్’ సినిమా ట్రైలర్ లాంచ్ హైదరాబాద్‌లో బుధవారం జరిగింది. దర్శకుడు శ్రీను వైట్ల ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ‘సినిమా బాగా వచ్చింది. మా టీమ్‌కు చాలా నమ్మకం ఉంది. మిస్టర్ సినిమా ట్రైయాంగిలార్ లవ్‌స్టోరీ.

03/23/2017 - 21:36

గతేడాది ఘనవిజయం సాధించిన సినిమాల్లో ‘పెళ్లిచూపులు’ ఒకటి. అత్యంత తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం ఊహకందని రీతిలో పదింతలు వసూళ్లను సాధించి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించింది. చిన్న సినిమా ఎలా ఉండాలి అంటే అందరూ ‘పెళ్లిచూపులు’లా ఉండాలి అన్నంతగా ఈ సినిమా పాపులర్ అయింది.

03/23/2017 - 21:33

మహేష్‌బాబు ప్రస్తుతం మురుగదాస్ చిత్రంతో బిజీగా వున్నారు. ఆయన అభిమానులు కోపంగా ఉన్నారు. మురుగదాస్‌తో సినిమా మొదలై ఇన్నాళ్లైనా ఫస్ట్‌లుక్ కనీసం టైటిల్ ఏమిటో చెప్పకపోవడంతో అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారట. ఇలాంటి తరుణంలోనే అభిమానులను మచ్చిక చేసుకోవడానికి ఓ వార్త బయటికి వచ్చింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను, టైటిల్ ప్రకటన, ఆడియో విడుదల కార్యక్రమ తేదీలు నిర్ణయించారట.

03/23/2017 - 21:31

ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన జనతా గ్యారేజ్‌పై కింగ్ ఖాన్ షారుక్ మనసు పారేసుకున్నాడా? ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడా? అంటే అవుననే సమాచారం. తెలుగులో గత ఏడాది రిలీజైన ఈ చిత్రం దాదాపు 100కోట్లుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. కామెన్‌మాన్‌ను ఆదుకునేందుకు ఓ గ్యారేజ్ ఉంటే ఎలా వుంటుంది అన్న పాయింట్‌తో కొరటాల శివ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు.

03/23/2017 - 21:29

నిజంగా రెమ్యూనరేషన్ విషయంలో అమీర్‌ను కొట్టేవాడే లేడు. కేవలం ఒక్క సినిమాకు ఏకంగా 175 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని షాక్ ఇచ్చాడు. నిజంగా ఈ విషయం బలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా బాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసుకున్న అమీర్‌ఖాన్ భిన్నమైన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద విజయ దుందుభి మోగిస్తున్నాడు.

03/23/2017 - 21:27

‘ఖైదీ నెం 150’ చిత్రంతో మరోసారి టాప్ రేస్‌లో చేరిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తమిళంలో అజిత్ ‘వివేగం’, విజయ్-అట్లీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మొన్ననే తన పేరుమీద ఒక పర్సనలైజ్డ్ యాప్‌ను లాంచ్ చేసిన ఆమె ఫ్యూచర్స్‌లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనే అంశంపై ఆసక్తికర అంశాలను బయటపెట్టింది.

03/23/2017 - 21:25

ఆర్.జె. సినిమాస్ పతాకంపై జయ.బి దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు రూపొందించిన చిత్రం ‘వైశాఖం’. హరీశ్, అవంతిక నటించిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియోకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు డి.జె.వసంత్, హీరో హరీశ్ హైదరాబాద్ రేడియో మిర్చిలో సందడి చేశారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ- పాటలు అందరికీ నచ్చాయని, ఒకదాన్ని మించి ఒక పాట హిట్ అయ్యాయని, అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారని తెలిపారు.

Pages