S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/09/2017 - 20:50

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఓరు వడక్కన్ సెల్ఫీ’ చిత్రం అల్లరి నరేష్ హీరోగా తెలుగులో రీమేక్ కాబోతోంది. జాహ్నవి ఫిలిం బ్యానర్‌పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్ బొప్పన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ‘ఓరు వడక్కన్ సెల్ఫీ’ మలయాళ మాతృక చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జి.ప్రజీత్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు.

03/09/2017 - 20:48

సినీనటి భావన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మలయాళ నిర్మాత నవీన్‌తో గురువారం అతికొద్ది మంది బంధువులు, స్నేహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. మూవీ ట్రాకర్ రమేష్ బాల ఈ విషయాన్ని నిర్ధారిస్తూ భావన నిశ్చితార్థం ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తెలుగులో ‘మహాత్మ’, ‘నిప్పు’, ‘ఒంటరి’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.

03/09/2017 - 20:46

ప్రిన్స్ మహేష్‌బాబు కథానాయకుడిగా రూపొందుతున్న 23వ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. సినిమా మొదలై దాదాపు ఏడాది కావస్తున్నా ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయమూ ఇంతవరకూ బైటికి రాలేదు. పేరు ఏం పెడతారోనన్న ఆసక్తితో మహేష్‌బాబు అభిమానులు కూడా ఉత్కంఠగా కూడా ఉన్నారు. రకరకాల టైటిల్స్ ప్రచారంలో వచ్చాయి.

03/09/2017 - 01:33

ప్రస్తుతం కోలీవుడ్‌లో సుచి లీక్స్ సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరో హీరోయిన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయి హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల వీడియోలు లీక్ చేసి వారి కెరీర్‌కి మాయనిమచ్చగా మారనున్నాయి. ఇంతకీ ఈ ఫొటోలు లీక్ చేస్తున్నది ఎవరూ అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

03/09/2017 - 01:31

ఇప్పటివరకూ గ్లామర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ సమంత, ఈసారి ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమైంది. లేటెస్టుగా ఈ షాకింగ్ న్యూస్ బైటికి రావడంతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఈమధ్య దక్షిణాదిలో హారర్ చిత్రాల హవా ఎక్కువ అవడంతో ఈ తరహా చిత్రాల్లో నటించేందుకు హీరోయిన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవలోకి సమంత కూడా చేరింది.

03/09/2017 - 01:29

తన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో మంచి విజయాన్ని అందుకుని 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు నందమూరి బాలకృష్ణ. ఇక ఆయన 101వ చిత్రంగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గురువారం ప్రారంభం కానుంది. ఈ సినిమా తరువాత తన 102వ సినిమా కోసం అప్పుడే సన్నాహాల్లో జోరు పెంచాడు బాలకృష్ణ. ఈ సినిమా కోసం ముగ్గురు దర్శకులు క్యూలో వుండడం విశేషం.

03/09/2017 - 01:28

మహిళా దినోత్సవం సందర్భంగా టాలీవుడ్‌లో విడుదలైన ఓ పోస్టర్ సంచలనం రేపుతోంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో ప్రశంసలందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ‘మహానటి’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. నాటి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావచ్చిన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశాడు.

03/09/2017 - 01:27

నయనతార కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘డోర’. దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. నిర్మాత శివకుమార్ మాట్లాడుతూ..

03/08/2017 - 21:48

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్, శ్రుతిహాసన్ జంటగా డాలి దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు’ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తికావచ్చింది. ఏప్రిల్ 24న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా త్వరగా షూటింగ్ పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా లొకేషన్‌లోని ఫొటోలు...

03/08/2017 - 21:46

రామ్‌శంకర్ కథానాయకుడుగా శరత్‌కుమార్ కీలకమైన పాత్రలో సలేంద్ర దర్శకత్వంలో శ్రీకాంత్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘నేనోరకం’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు పూరి జగన్నాథ్, దేవిశ్రీప్రసాద్, గోపీచంద్ ఒక్కొక్క పాటను ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కథానాయకుడు గోపీచంద్ మాట్లాడుతూ..

Pages