S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/29/2016 - 21:39

తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 25న విడుదలైన ‘ఊపిరి’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. రీసెంట్‌గా సినిమాను చూసిన దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ‘ఊపిరి’ సినిమా గురించి మాట్లాడుతూ ఊపిరి సినిమా చూశాను, చాలా బావుంది. నా మనసుకు ఎంతో నచ్చింది. తెలుగు సినిమా కొత్తతరహా సినిమాలు తీస్తున్నామని చెప్పడానికి ఊపిరి పోసింది. ‘బొమ్మరిల్లు’ తర్వాత నాకు సంపూర్ణంగా నచ్చిన సినిమా లేదు.

03/30/2016 - 05:03

హైదరాబాద్: ‘గానకోకిల’గా తెలుగువారందరికీ తెలిసిన నేపధ్యగాయని సుశీల తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆరు భాషల్లో 17,695 పాటలు పాడిన గాయనిగా ఆమెకు ఈ అరుదైన ఘనత దక్కింది. 1950లో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె తెలుగుతో పాటు తమిళం, మళయాలం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, తుళు భాషల్లో పాడి సంగీతానికి ఎలాంటి సరిహద్దులు లేవని నిరూపించారు.

03/29/2016 - 21:32

‘విక్రమసింహ’, ‘లింగ’ లాంటి రెండు వరుస పరాజయాల తర్వాత రజనీకాంత్, తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ‘కబాలి’, ‘రోబో 2.0’ సినిమాలను సిద్ధం చేస్తున్నారు.

03/29/2016 - 21:27

అభిరుచిగల నిర్మాతగా ‘మనవూరి పాండవులు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘సీతారాములు’, ‘కృష్ణార్జునులు’, ‘వివాహ భోజనంబు’ వంటి చిత్రాలను రూపొందించిన మేకప్‌మెన్, నిర్మాత జయకృష్ణ మంగళవారం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. మేకప్‌మన్ అప్రెంటిస్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన నిర్మాతగా ఎదిగి ఉత్తమమైన చిత్రాలను రూపొందించారు.

03/29/2016 - 21:25

క్రాంతిమాధవ్ లాంటి సెన్సిబుల్ డైరెక్టర్‌తో సునీల్ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని దర్శకుడు వి.వి.వినాయక్ తెలిపారు. సునీల్, మియా జంటగా యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిటెడ్ పతాకంపై క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పరుచూరి కిరీటి నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, డి.సురేష్‌బాబు క్లాప్‌కొట్టారు.

03/29/2016 - 21:20

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంతా జంటగా నటిస్తున్న ‘అ.. ఆ..’ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజా సమాచారంమేరకు ఈ సినిమా టీజర్‌ని ఈనెల 30న నితిన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ‘అ...

03/29/2016 - 21:17

తమిళంలో ఘన విజయం సాధించిన ఓ హారర్ ఎంటర్‌టైనర్‌ను తెలుగులో ‘శశికళ’ పేరుతో అనువదిస్తున్నారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. జయరాజ్, నితిన్‌రాజ్, మిషా ఘోషల్ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, అందరినీ భయపెడుతూ..

03/29/2016 - 21:11

బాలీవుడ్ నటి విద్యాబాలన్ మంచి నటి అన్న విషయం తెలిసిందే. ‘నోవన్ కిల్‌డ్ జెస్సికా’, ‘డర్టీ’ పిక్చర్స్ సినిమాల్లో మంచి నటన ప్రదర్శించారు. ఆ తరువాత 2012లో వచ్చిన ‘కహానీ’ తనని నటిగా మరో మెట్టు ఎక్కించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘కహానీ-2’ అనే సినిమాని రూపొందుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడనుండే సీక్వెల్ మొదలవుతుందని సమాచారం.

03/29/2016 - 21:06

మలయాళంలో విజయవంతమైన ఉస్తాద్ హోటల్ చిత్రాన్ని తెలుగులో ‘జతగా’ అనే పేరుతో అనువదించారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అన్వర్ రషీద్ దర్శకత్వంలో రూపొందించగా, తెలుగులో సురేష్ కొండేటి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి కాపీ సిద్ధమైంది.

03/27/2016 - 21:59

గ్లామర్ భామ అనుష్క ప్రస్తుతం ‘బాహుబలి-2’, సూర్య హీరోగా నటిస్తున్న ‘సింగం-3’ సినిమాలో నటిస్తోంది. దాంతోపాటు మరో క్రేజీ సినిమాలో నటించేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ‘శివలింగ’ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హీరోగా రజనీకాంత్‌ను ఒప్పించాలని ప్రయత్నాలు జరిగాయి.

Pages