S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/21/2017 - 20:44

విజయ్ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై జీవ శంకర్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘యమన్’. యమన్ ఈ శివరాత్రికి విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు...
* ‘యమన్’ అంటే?

02/21/2017 - 20:41

ఓ వైపు టాలీవుడ్, కోలీవుడ్, మరోవైపు బాలీవుడ్ అంటూ రకరకాల అవకాశాలతో ఉత్తరాది నుంచి దక్షిణాదికి చక్కర్లు కొట్టేస్తోంది నటి శ్రుతిహాసన్. ఇంత బిజీలో కూడా అమ్మడిపై ఏవో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వాటన్నిటినీ అసలు పట్టించుకోదనుకోండి! అయినా కానీ ఆమె పట్టించుకునేలా ఓ కొత్త కథనం వినిపిస్తోంది. అవేంటంటే తాజాగా లండన్‌లో నటుడైన మైఖేల్ కోర్సలేతో ఎయిర్‌పోర్టులో కనిపించింది ఈ భామ.

02/21/2017 - 20:40

సాయిధరమ్‌తేజ్ హీరోగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మించిన చిత్రం ‘విన్నర్’. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 24న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు.

02/21/2017 - 20:37

ప్రముఖ నటి, ప్రస్తుతం హిందీలో స్టార్ హీరోయిన్‌గా మన్ననలు పొందుతున్న తాప్సి తన అభిమాని విజ్ఞప్తిమేరకు అతని వివాహానికి హాజరుకానుంది. సికింద్రాబాద్‌కు చెందిన ఆ అభిమాని వివాహం వచ్చే నెలలో జరగనుంది. రెగ్యులర్‌గా ఈమెయిల్స్, చాటింగ్ ద్వారా టచ్‌లో ఉండే ఈ అభిమానికి తాప్సి అంటే ఎనలేని గౌరవమట. అంతేగాక అతను తాప్సి ఫాన్స్ క్లబ్‌లో అధికారిక సభ్యుడట.

02/19/2017 - 21:12

హరీష్, అవంతిక జంటగా ఆర్.జె. సినిమాస్ పతాకంపై జయ.బి దర్శకత్వంలో బి.ఎ.రాజు రూపొందించిన చిత్రం వైశాఖం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకురాలు జయ మాట్లాడుతూ..

02/19/2017 - 21:10

అందము, కాస్త నటించే శక్తి ఉంటే సినిమాలే చేయక్కర్లేదు. బోలెడు అవకాశాలు మనకోసం ఎదురుచూస్తున్నాయి. వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వాళ్లకి ఎలాంటి ఢోకా లేదని, సినిమాలే టార్గెట్ అని అనుకుంటే ఇబ్బందులు పడతామని చెప్పుకొచ్చింది నేహాధూపియా. హిరోయిన్‌గా బాలీవుడ్‌లో పాపులారిటీ సంపాదించాలని ప్రయత్నించిన నేహాధూపియాకి అవకాశాలు తలుపుతట్టలేదు.

02/19/2017 - 21:09

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీ సినిమాల్లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కానీ దీనిని ఇంతవరకూ ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఈ విషయాన్ని సైఫ్ అలీఖాన్ ధ్రువీకరించారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సారాఅలీ సినీ రంగప్రవేశం త్వరలోనే ఉంటుందని ప్రకటించాడు.

02/19/2017 - 21:08

సినిమా అవకాశాలు మనకు మార్కెట్ ఉన్నంతకాలమే వస్తాయి. ఆ తర్వాత ఏవో చిన్న చిన్న పాత్రలు వస్తే నటిస్తూ కూర్చోడం నావల్లకాదు. అందుకే దానికన్నా పక్కకు తప్పుకొని, గౌరవప్రదమైన వృత్తిని ఎంచుకోవడం మంచిదని చెబుతోంది టాలీవుడ్ బ్యూటీ రకుల్‌ప్రీత్‌సింగ్. ఎప్పటికప్పుడు మార్కెట్ విలువ మారిపోయే పరిశ్రమలో ఎప్పుడూ హీరోయిన్‌గానే ఉంటాను, అంతే పారితోషికం ఇవ్వమంటే ఎవ్వరూ ఇవ్వరు.

02/19/2017 - 21:06

ఈ సంక్రాంతికి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు బాలయ్య. నిజానికి ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాతో బాలయ్య యాభై కోట్ల మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇదే జోష్‌తో తన 101వ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన నెక్స్ట్ సినిమాకోసం క్రేజీ దర్శకులు అటు పూరి జగన్నాథ్, ఇటు కృష్ణవంశీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

02/19/2017 - 21:05

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్ హీరోగా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘విన్నర్’. బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఎలాంటి కట్స్ లేకుండా యు బై ఏ సర్ట్ఫికెట్ పొందడం విశేషం.

Pages