S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/10/2017 - 20:58

కోలీవుడ్ యంగ్ హీరో జై, తెలుగింటి సీతమ్మ అంజలితో ప్రేమాయణంలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై నోరువిప్పకుండా ఇన్నాళ్లూ దాగుడుమూతలు ఆడుతోంది ఈ జంట. వీరి షికార్ల గురించి మీడియాలో ప్రముఖంగా ప్రచారమైనా ఆ వార్తలపై స్పందించనేలేదు. ఏదైతేనేం ఒక దోశ స్కీమ్ వర్కవుటై అసలు గుట్టు బయటికొచ్చింది.

02/10/2017 - 20:56

గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మానియేల్ ప్రధాన తారాగణంగా శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎస్.ఐశ్వర్య రూపొందిస్తున్న చిత్రం ‘ఆక్సిజన్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, ఇటీవల విడుదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాత తెలియజేశారు.

02/10/2017 - 20:54

అప్పట్లో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది అందాల భామ భూమిక. అందరూ స్టార్ హీరోలతో నటించి లక్కీ చార్మ్‌గా పాపులరైన భూమిక ఆ తరువాత భరత్ ఠాకూర్‌ను వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. పెళ్లిచేసుకున్నాక కూడా అడపాదడపా సినిమాలు చేస్తూన్న ఈమె, ‘ఎం.ఎస్.్ధని’ చిత్రంలో ధోని అక్క పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. చాలాకాలం తరువాత మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది ఈమె.

02/09/2017 - 21:42

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుంది. క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం తరువాత మహేష్, కొరటాల శివతో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే.

02/09/2017 - 21:39

అక్కినేని నాగార్జున, దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి. పతాకంపై షిరిడీ సాయి నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి నిర్మించిన భక్తిరస కథాచిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. స్వరవాణి కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో సంగీతప్రియులను విశేషంగా అలరిస్తోంది.

02/09/2017 - 21:22

‘పెళ్లిచూపులు’ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమాలో నటించిన వారంతా ఇప్పుడు పాపులర్ అయ్యారు. ఇక ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించి అందరినీ ఆకట్టుకున్న రీతూవర్మ తమిళ స్టార్ హీరో విక్రమ్ సినిమాకు హీరోయిన్‌గా ఎంపికవ్వడం విశేషం. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘్ధృవ నచ్చత్తిరం’ సినిమాకు మొదట అను ఎమ్మాన్యూల్‌ను కథానాయికగా ఎంపిక చేశారు.

02/09/2017 - 21:20

గతేడాది తెలుగు ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధించిన చిత్రాల్లో నిఖిల్ నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కూడా ఉంది. ఆ చిత్రం నిఖిల్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలబడింది. అంతేగాక దర్శకుడు వి.ఐ.ఆనంద్‌కు కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అందుకే ఆనంద్ ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో సైతం రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. అందుకు చిత్ర నిర్మాత రావు కూడా సుముఖంగానే ఉన్నాడట.

02/09/2017 - 22:49

శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై పాండీరాజ్ దర్శకత్వంలో శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న చిత్రం ‘సరసుడు’. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు అనువాదం సిద్ధమైంది. తమిళంలో వేసవి కానుకగా విడుదలైన ఈ చిత్రం విజయవంతమైంది. తెలుగులో విడుదల కావలసి వున్నా డిమానిటైజేషన్ కారణంగా వాయిదా పడింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు.

02/09/2017 - 21:14

కృష్ణచైతన్య, రాజేష్ రాధోడ్, మోనికా సింగ్, షాలూ చారసీయా ప్రధాన తారాగణంగా బిగ్ విగ్ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కిశోర్ రూపొందించిన చిత్రం ‘ఓ పిల్లా నీవల్లా’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హీరో శర్వానంద్ విడుదల చేశారు.

02/09/2017 - 21:25

ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై దాడి దరిమిలా నిలిచిపోయిన ‘పద్మావతి’ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆ చిత్రంలో రాజారతన్‌సింగ్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఈ విషయం వెల్లడించారు. ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పలేకపోయినా ‘షూటింగ్’ మొదలుపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయని చెప్పారు.

Pages