S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/04/2017 - 21:22

తెలుగులో గ్లామర్ హీరోయిన్‌గా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రెజీనా ప్రస్తుతం తన ఫోకస్ బాలీవుడ్ వైపు మార్చినట్టుంది. తాజాగా ఆమె నటిస్తున్న ఆంఖే-2 చిత్రంలో అమితాబ్‌తో కలిసి నటిస్తోంది. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటేందుకు గట్టిగానే కసరత్తు చేస్తోందట.

02/04/2017 - 21:21

రణధీర్, రుక్సర్ మీర్ జంటగా ఎస్.ఎస్.కాంచి దర్శకత్వంలో రమా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్న ‘షో టైమ్’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ హీరోయిన్ అనుష్క సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శివశక్తి దత్తా, రాజవౌళి, విజయేంద్రప్రసాద్, రాఘవేంద్రరావు, కీరవాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజవౌళి మాట్లాడుతూ- ‘ట్రైలర్ బాగుంది.

02/03/2017 - 21:51

సునీల్ కథానాయకుడిగా యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి రూపొందిస్తున్న చిత్రానికి ‘ఉంగరాల రాంబాబు’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, రథసప్తమి సందర్భంగా ప్రచార రథాన్ని శుక్రవారం సునీల్ ప్రారంభించారని, అన్ని కమర్షియల్ హంగులతో రూపొందిస్తున్న ఈ చిత్రం వైవిధ్యభరితంగా ఉంటుందన్నారు.

02/03/2017 - 21:49

నందమూరి బాలకృష్ణకు సరిపోయే టైటిల్స్ వైవిధ్యంగా వుండాలని అభిమానులు కోరుకుంటారు. అందుకే సింహ, లయన్, డిక్టేటర్ లాంటి టైటిల్స్ అన్నీ ఆయన కోసమే అన్నట్లుగా వున్నాయి. తాజాగా ‘సార్వభౌమ’ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ బాలకృష్ణ కోసమే అన్నట్టు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దర్శకుడు సత్యదేవా ఇప్పటికే స్టోరీని కూడా బాలయ్యకు వినిపించేశాడట!

02/03/2017 - 21:48

రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో శివాని, శివాత్మిక మూవీ సమర్పణలో జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘పి.ఎస్.వి. గరుడవేగ 126.18 ఎం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

02/03/2017 - 21:47

నంద, ఉమ, వౌనిక, వాణి ప్రధాన తారాగణంగా తమిళంలో అగస్త్యన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘సెల్వమ్’. ఈ చిత్రాన్ని ఎ.రమేష్‌బాబు 24 ఫ్రేమ్స్ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై తెలుగులో ‘లక్ష్మీపుత్రుడు’గా అందిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలైంది.

02/03/2017 - 21:45

తొలి సినిమా ‘నేను శైలజ’తో సూపర్‌హిట్ కొట్టింది మలయాళ భామ కీర్తి సురేష్. ఆ సినిమాలో కీర్తి అందం, అభినయం రెండూ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. నానితో కీర్తి జతకట్టిన ‘నేను లోకల్’ మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. మరోవైపు పవన్‌కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో నటించే అవకాశం కూడా పట్టేసింది కీర్తి. ఇంకా రెండు, మూడు భారీ చిత్రాల్లో అవకాశాలు ఆమె కోసం ఎదురుచూస్తున్నాయి.

02/03/2017 - 21:40

‘దర్శకుడు రాఘవేంద్రరావుకు హథీరామ్ బాబా కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టు గురించి నాకు చెప్పారు. బాబాను నమ్మే నేను- నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో షిరిడీ సాయి తీశాను. మా కులదైవం వేంకటేశ్వరస్వామిపై సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఈ సినిమాతో ఆ కోరిక తీరింది’- అని నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి తెలిపారు.

02/03/2017 - 21:37

రవితేజ కథానాయకుడిగా లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీమోహన్ రూపొందిస్తున్న చిత్రం ‘టచ్ చేసి చూడు’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. రవితేజపై నిర్మాత వంశీ మోహన్ క్లాప్‌నివ్వగా, గౌతంరాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

02/03/2017 - 21:35

త్రిష కథానాయికగా మైండ్ డ్రామా పతాకంపై రిథున్ సాగర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘1818’. రాజేంద్రప్రసాద్ ఓ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. దర్శక, నిర్మాత రిథున్ సాగర్ మాట్లాడుతూ- నవంబర్ 11, 2008 ముంబయి దాడుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం ఇదని తెలిపారు.

Pages