S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/06/2016 - 21:18

సీనియర్ దర్శకుడు భరత్ దర్శకత్వంలో సి.బి.డి.టి. ప్రొడక్షన్స్ పతాకంపై డి.ఎ.ఎస్.పటేల్ నిర్మిస్తున్న చిత్రం ‘గండ్రగొడ్డలి’. ఆవు చంపిన పులినెత్తురు ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే ప్రారంభమైంది.

05/06/2016 - 21:16

ప్రస్తుతం హారర్ చిత్రాల హవా ఎక్కువవ్వడంతో దక్షిణాదిలో ఈ చిత్రాలను రూపొందించేందుకు దర్శక నిర్మాతలు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు హీరోయిన్లు కూడా ఈ తరహా చిత్రాల్లో నటించి క్రేజ్ తెచ్చుకునేందుకు పోటీపడుతున్నారు. ప్రస్తుతం ‘నాయకి’ చిత్రంలో నటిస్తోన్న త్రిష, ఇటీవలే తన 32వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మరో హారర్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పిందట.

05/06/2016 - 21:14

ఇటీవలే ‘సర్దార్ గబ్బసింగ్’ సినిమాలో పవన్‌తో కలిసి స్పెషల్ సాంగ్‌లో ఆడి పాడిన రాయ్ లక్ష్మి మరోసారి ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘పటాస్’ చిత్రాన్ని తమిళంలో రాఘవ లారెన్స్ హీరోగా ‘మెట్ట శివ కెట్ట శివ’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా నిక్కీగల్రాణి నటిస్తోంది. ఈ చిత్రంలో రాయ్‌లక్ష్మి ఐటెం సాంగ్ చేయనుంది.

05/06/2016 - 21:12

పవన్‌కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని ఇటీవలే మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఫ్యాక్షన్ లీడర్ ప్రేమకథతో సాగే ఈ చిత్రంలో హీరోయిన్ కోసం అనే్వషణ జరుగుతోంది. ఇప్పటికే మలయాళ భామ హీరోయిన్‌గా నటిస్తోందని వార్తలొస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్‌ను హీరోయిన్‌గా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

05/05/2016 - 21:25

దశాబ్దకాలానికిపైగా దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన గ్లామర్ భాష త్రిష తన పుట్టినరోజు వేడుకను ఆమె సన్నిహితులతో జరుపుకుంది. ‘వర్షం’ సినిమాతో తెలుగులో కమర్షియల్ విజయాన్ని అందుకుని స్టార్ హీరోల సరసన నటించిన త్రిషకు ఈమధ్య అవకాశాలు తగ్గాయి. దాంతో పెళ్లిదాకా వెళ్లి కాన్సిల్ అవడంతో ఇక సినిమాలపైనే దృష్టి సారించింది.

05/05/2016 - 21:23

ప్రస్తుతం తెలుగులో రాశీఖన్నా హవా బాగా జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలు సినిమాల్లో అవకాశాలు రావడంతో ఈమె హైదరాబాద్‌లో సెటిల్ అయింది. ఇటీవలే ‘సుప్రీమ్’ చిత్రంలో నటించిన రాశీఖన్నా, ప్రస్తుతం రవితేజ సరసన ఓ చిత్రంలో నటించేందుకు రెడీ అయ్యింది. దాంతోపాటు హీరో రామ్ సరసన కూడా మరోసారి నటిస్తోందట.

05/05/2016 - 21:21

సేతు, అభిషేక్, రాజ్, పూజ ప్రధాన పాత్రల్లో సురేష్ కుమార్ మరియు రాజ్ దర్శకత్వంలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పతాకంపై రాజ్ జకారిస్ నిర్మిస్తున్న చిత్రం ‘రహదారి’. అన్ని కార్యక్రమాలు పూర్తికావచ్చిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర వివరాలను నిర్మాతలు తెలియజేశారు.

05/05/2016 - 21:20

మహేష్‌బాబు హీరోగా నటించిన ‘1’ (నేనొక్కడినే) సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన గ్లామర్ భామ కృతి సనన్‌కు ఆ తరువాత తెలుగులో అవకాశాలు వచ్చినా కూడా కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈమెకు నిరాశే మిగిలింది. దాంతో ఇప్పుడు తన చెల్లెలు నుపుర్ సనన్‌ను రంగంలోకి దింపుతోంది.

05/05/2016 - 21:17

మానస్, సనమ్‌శెట్టి జంటగా కళాసందీప్ దర్శకత్వంలో ఎస్.ఎస్.సినిమాస్ పతాకంపై లక్ష్మీనారాయణరెడ్డి, కె.ఇసనాక సునీల్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘ప్రేమికుడు’.

05/05/2016 - 21:15

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న ‘అజహర్’ సినిమా ప్రమోషన్‌కోసం ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ తార ప్రాచీదేశాయ్.

Pages