S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/07/2017 - 21:09

దిలీపన్, అంజలి హీరో హీరోయిన్లుగా ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ సమర్పణలో ఎ.ఆర్.మురగదాస్ ప్రొడక్షన్స్ పతాకంపై పి.కిన్‌స్లిన్ దర్శకత్వంలో ఎ.ఆర్.మురగదాస్ నిర్మించిన ‘వత్తికుచ్చి’ తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని శ్రీ జె.వి.ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్రావ్ మార్టోరి ‘గోలీసోడా’ పేరు తెలుగులో అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

01/07/2017 - 21:07

హీరోయిన్‌గా పెద్దగా ఇమేజ్ తెచ్చుకోని ఈ అందాల భామకు ఐటెం గర్ల్‌గానే పాపులారిటీ దక్కింది. ఆమధ్య లారెన్స్ సరసన ‘కాంచన’తో వెలుగులోకి వచ్చిన లక్ష్మీరాయ్‌కి బాలీవుడ్‌లో హాట్ సినిమాగా రూపొందిన జూలీ సీక్వెల్‌లో ఛాన్స్ దక్కింది. జూలీ-2 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో నటిస్తున్న ఈమెకు తాజాగా పవన్ సరసన సర్దార్ గబ్బర్‌సింగ్‌లో చేసిన ఐటెం సాంగ్ మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది.

01/07/2017 - 21:04

గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ బ్యానర్‌పై ప్రకాష్ ఠాకూర్ నిర్మాతగా హర్షకుమార్, డాలీ శర్మ, నదీమ్ భార్గవ్, కామ్నసింగ్, అభిలాష్, రుహానీ శర్మ నటించిన చిత్రం ‘్ఫల్‌మూన్’. దీపక్ బలదేవ్ దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

01/06/2017 - 20:51

బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందించిన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు రూపొందించిన ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు.

01/06/2017 - 20:50

భారతీయ సినిమా చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.. ఏ పాత్రనైనా మెప్పించడంలో ఆయనదో విశిష్ట శైలి.. విలక్షణ నటనతో ప్రేక్షకజన హృదయాల్లో ఆయనది చెరగని ముద్ర.. సహజత్వాన్ని జోడించి తాను నటించిన పాత్రను ప్రేక్షకులకు చేరువ చేయడంలో ఆయన మార్గం అనితర సాధ్యం. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, సజీవంగా కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఓం పురి తరువాతే ఎవరైనా అని బాలీవుడ్‌లో అంటారు.

01/06/2017 - 20:48

‘నిర్మాతగా కథకు న్యాయం చేయడానికే ప్రయత్నిస్తా. ప్రేక్షకులకు ఆనందాన్ని ఇవ్వడమే కాదు, కథవల్ల సమాజానికి ఎంతోకొంత ఉపయోగం కలిగేలా జాగ్రత్తలు తీసుకుంటా. వీటితో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలాగూ తప్పవు’- అని నిర్మాత బి.ఎ.రాజు తెలిపారు. ఆర్.జె. మూవీస్ పతాకంపై బి.జయ దర్శకత్వంలో ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం ‘వైశాఖం’ విడుదలకు ముస్తాబవుతోంది.

01/06/2017 - 20:46

రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ బృందావనం రూపొందిస్తున్న చిత్రం శ్రీవల్లి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, మనకెన్నో అద్భుతాలు సృష్టించే శక్తి వుందని, అలాంటి అద్భుతమైన మనసును చూడగలిగితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే కథనంతో రూపొందించామని తెలిపారు.

01/06/2017 - 20:44

పీపుల్స్ స్టార్‌గా విప్లవ చిత్రాలతో ఇమేజ్ తెచ్చుకున్న ఆర్.నారాయణమూర్తి తాజాగా నటిస్తున్న చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’. జయసుధ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు.

01/06/2017 - 20:42

గ్లామర్ భామ మోనాల్ గజ్జర్‌కి లక్కీ చాన్స్ దక్కింది. తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న విఐపి-2 చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. తెలుగులో అల్లరి నరేష్ సరసన సుడిగాడు చిత్రంలో నటించిన మోనాల్- ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ తెలుగులో రెండు, మూడు సినిమాలు చేసింది. ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ ప్రయత్నాల్లో భాగంగా ధనుష్ సినిమాలో అవకాశం కొట్టేసింది.

01/06/2017 - 20:40

‘వందశాతం వినోదం’ చిత్రంతో హీరోగా వచ్చిన విజయ్ భరత్ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తుహినా ఫిలింస్ పతాకంపై మత్తి సురేష్ దర్శకత్వంలో సుధాకర్ రూపొందిస్తున్న చిత్రానికి జానకిరాముడు అన్న పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, ఈనెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, కుటుంబ కథా చిత్రంగా రూపొందిస్తున్నామని తెలిపారు.

Pages