S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/01/2017 - 20:55

అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రాఘవేంద్ర లారెన్స్, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు దర్శకత్వంలో రమేష్ పి.పిళ్ళై నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ‘గతంలో నేను రూపొందించిన చంద్రముఖి తెలుగు, తమిళంలో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు కన్నడలో తీసిన శివలింగ సూపర్‌హిట్ అయ్యింది. ‘శివలింగ’ను తెలుగు, తమిళంలో ఏకకాలంలో సినిమాను షూటింగ్ చేశాం.

01/01/2017 - 20:54

బాలీవుడ్‌లో ఈ హాట్‌భామ రోజు తెగ తాగేస్తుందని, తాగుడికి బానిసయ్యిందనే వార్తలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. భర్తతో విడాకులు తీసుకున్న ఈమె రోజంతా బార్‌లు, పబ్బుల్లోనే ఉంటోందట!! ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అని షాక్ అవుతున్నారా.. ఆ వివరాల్లోకి వెళితే బాలీవుడ్‌లో హాట్‌హాట్ అందాలు ఆరబోసి హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న మలైకాఅరోరా గుర్తుందిగా.. ఇటీవలే ఆమె భర్త అర్బాజ్‌ఖాన్‌తో విడాకులకు పిటిషన్ వేసింది.

12/31/2016 - 21:14

భారతీయ సినిమాలో వెలగాలనే కోరిక ఈమధ్య హాలీవుడ్ భామలకు బాగా కలిగినట్టుంది. అందుకే ఇక్కడికి ముటాముల్లె సర్దుకుని వచ్చేస్తున్నారు. ఇప్పటికే హిందీతోపాటు సౌత్‌లో కూడా గ్లామర్ భామలుగా చెలామణీ అవుతున్న అమీ జాక్సన్, స్కార్లెట్ విల్సన్, నోరా ఫతేహి, ఫరహాకరిమి లాంటి భామలు తనదైన గ్లామర్‌తో ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఇక వీరి కోవలో మరో గ్లామర్ భామ ఎంట్రీ ఇస్తోంది.

12/31/2016 - 21:13

అనుష్క షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెళ్లివయసు దాటిపోతున్న ఈమెకు పెళ్లిచేయడానికి ఇంట్లోవాళ్లు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గ్లామర్ భామగా అనుష్క తెలుగుతెరపై తనదైన ఇమేజ్ తెచ్చుకుంది.

12/31/2016 - 21:11

అక్కినేని ఫ్యామిలీ సినిమాగా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న ‘మనం’ సినిమా ఇప్పుడు మలయాళంలో రీమేక్ అవుతుంది. తెలుగు సినిమా క్లాసిక్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ఈ సినిమాలో అక్కినేని మూడుతరాల నటులు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌లు నటించారు. భిన్నమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంది.

12/31/2016 - 21:09

పవన్‌కళ్యాణ్, శృతిహాసన్ జంటగా నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో శరత్‌మరార్ రూపొందిస్తున్న చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచారాన్ని దూకుడుగా నిర్వహిస్తున్నామని నిర్మాత తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే ప్రచారం వినూత్న రీతిలో ప్రారంభించామని, అంచెలంచెలుగా ప్రచార చిత్రాలను విడుదల చేశామని తెలిపారు.

12/31/2016 - 21:09

‘కంచె’తో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే అందరినీ మెప్పించిన సంగీత దర్శకుడు చిరంతన్ భట్. తెలుగులో ఆయన చేస్తున్న రెండవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. నందమూరి బాలకృష్ణ 100వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదలకు సిద్ధం అవుతున్న సందర్భంగా చిరంతన్ భట్ చెప్పిన విశేషాలు..
శాతకర్ణి ఆడియో

12/31/2016 - 21:08

సాయిరామ్ శంకర్, శరత్‌కుమార్ ప్రధాన తారాగణంగా సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో శ్రీకాంత్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘నేనోరకం’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాల సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, సమాజంలో జరుగుతున్న సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని దీన్ని నిర్మించామని, థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తప్పక విజయవంతవౌతుందని తెలిపారు.

12/31/2016 - 21:07

లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్‌తేజ్ కథానాయకుడుగా శ్రీనువైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘మిస్టర్’. లావణ్యా త్రిపాఠీ, హెబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం గూర్చి దర్శకుడు మాట్లాడుతూ, ‘ఎమోషన్లకు, విజువల్స్‌కు, సంగీతానికి స్కోప్ ఉన్న ఈ చిత్రాన్ని చేయాలని తానెప్పటినుంచో అనుకుంటున్నానని, అందుకు తగ్గ కథ కుదిరిందని తెలిపారు.

12/31/2016 - 21:06

బుట్టబొమ్మ క్రియేషన్స్ పతాకంపై కృష్ణవంశీ దర్శకత్వంలో విన్ విన్ విన్ క్రియేషన్స్ సమర్పణలో వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం నక్షత్రం. దీనికి హీరో రామ్‌చరణ్ ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ఆదరణ లభిస్తోందని నిర్మాతలు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నామని, ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

Pages