S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/31/2016 - 21:01

వైష్ణవి మూవీస్, సొహాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బాల్వాన్, ప్రాచి అధికారి హీరోహీరోయిన్లుగా కృష్ణమోహన్ దర్శకుడిగా నిర్మాత సునీల్‌సాగర్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ చిత్రం నైజాం పిల్లోడు (వీడు మహా మాస్‌గాడు) ఈ చిత్రం టాకీ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత సునీల్‌సాగర్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ, ‘ఇందులో ఏడు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయని జనవరిలో సినిమా విడుదల చేస్తాం’ అన్నారు.

12/30/2016 - 22:31

ప్రముఖ నటుడు మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం షూటింగ్ బ్రేక్‌లో వున్న సంగతి తెలిసిందే. మహేష్ సినిమాలకెంత ప్రాముఖ్యత ఇస్తాడో, మరోవైపు ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు. షూటింగ్‌లో ఏ కాస్త బ్రేక్ దొరికినా ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో సరదాగా గడపడం ఇష్టం. మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా బ్రేక్ సమయంలో కూడా విదేశాలకు వెళ్లిపోయాడు మహేష్.

12/30/2016 - 22:32

ఫ్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా తెలుగు హీరోలు సత్తా చాటడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. స్టార్ హీరోలు ఇంకాస్త ఇమేజ్ పెంచుకోవడం, చిన్న హీరోలు పెద్ద హీరోలుగా మారడానికి చేసే ప్రయత్నాలు ఎలా వర్కవుట్ అయ్యాయో చూస్తే- 2016లో మన హీరోలు కాస్త స్పీడ్ పెంచారు. ఏడాదికి ఒక్క సినిమా చేసే స్టార్ హీరోలు ఈ ఏడాది రెండు, మూడు సినిమాలను లైన్‌లో పెట్టి సక్సెస్ అందుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

12/30/2016 - 22:22

‘రంగం’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన జీవా హీరోగా, గ్లామర్ డాల్ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఎంతవరకు ఈ ప్రేమ’. డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ దీన్ని అందిస్తున్నారు. డికె దర్శకత్వం వహిస్తున్నారు.

12/30/2016 - 22:20

మాస్టర్ నార్ని చంద్రాంషువు సమర్పణలో పాలిన్‌డ్రోమ్ పిక్చర్స్ పతాకంపై బి.్భవన విజయ్ దర్శకత్వంలో కామెడీ సెటైర్‌గా రూపొందిన చిత్రం ‘వర్మ పఒ శర్మ’. బాబ్ రతన్, బిందు బార్బీ జంటగా నటించగా, గిరిబాబు, జూ.రేలంగి టైటిల్ రోల్స్ పోషించారు. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో చాలాభాగం షూటింగ్ చేశారు.

12/30/2016 - 22:19

చిరంజీవి నటిస్తున్న ఖైదీనెం.150 ప్రీ రిలీజ్ వేడుక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 4న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుక జరుగుతుందని నిర్మాత, నటుడు రామ్‌చరణ్ తెలిపారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ వీడియోను ఎప్పుడో విడుదల చేయాల్సి వుందని, చిరంజీవి కొత్త సినిమా కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.

12/30/2016 - 22:17

రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్లుగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్ హార్ట్ అనేది ట్యాగ్‌లైన్. ఉదయ్ నాగ్ రతన్ దాస్ సంగీతాన్ని సమకూర్చిన పాటలు ఇటీవల విడుదలై శ్రోతలను అలరిస్తున్నాయి. చిత్ర నిర్మాత పీరికట్ల మాట్లాడుతూ,‘ ఇటీవల విడుదలైన పాటలకు, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియో సినిమాపై క్రేజ్‌ని పెంచింది.

12/30/2016 - 22:16

శ్రద్ధాదాస్ ముఖ్యపాత్రలో రూపొందిన రియలిస్టిక్ హారర్ థ్రిల్లర్ ‘ఆట’. ‘గేమ్ నెవర్ ఎండ్స్’అనేది దీనికి ఉపశీర్షిక. మాధురి ఇటాగె, గాయత్రి, అవినాష్, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్.జి.ఆర్. దర్శకత్వం వహించారు. వేదా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై విక్రం రాజు అందిస్తున్నారు.

12/30/2016 - 22:14

హృషికేశ్, నరైన్, మియా జార్జ్, సంచితాశెట్టి ప్రధాన తారాగణంగా తమిళంలో రూపొందించిన చిత్రం ‘రమ్’. ఈ సినిమాను సుర ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ‘మంత్రిగారి బంగళా’ పేరుతో తెలుగులో అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.

12/29/2016 - 21:33

‘సినిమా డైరీ’లో మరో ఏడాది గడిచిపోయింది. ప్రతి ఏడాదిలో కొత్త ఉత్సాహంతో ఘన విజయాలు అందుకోవాలని అందరూ ఎంతో కొంత ప్రయత్నించినా- సక్సెస్‌లు అందచ్చు, అందకపోవచ్చు. 2016లో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఇలాంటి పరిస్థితులే కనిపిస్తాయి. అందాలతో, అభినయంతో ఆకట్టుకునేందుకు కొత్తతరం అమ్మాయిలు వస్తూనే ఉంటారు. టాలెంట్, గ్లామర్‌తో ఆకట్టుకోవడానికి వారు గట్టి ప్రయత్నాలే చేస్తుంటారు.

Pages