S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/11/2016 - 21:22

ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి, జయసుధ జంటగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..

12/11/2016 - 21:26

మాగంటి శ్రీనాథ్, పల్లవి జంటగా మిసిమి మూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా కందవాడలో షూటింగ్ జరుగుతోంది. ఆర్‌వైజె శ్రీరాజా దర్శకత్వంలో జి.రమేష్ రూపొందిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమ అనంతరం దర్శకుడు శ్రీరాజా మాట్లాడుతూ రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ ప్రేమకథలో వైవిధ్యమైన కథనం ఉంటుందని, కొత్త నటీనటులు పరిచయవౌతున్న ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందుతోందని తెలిపారు.

12/11/2016 - 21:18

ఈమధ్యే అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘రుద్రమదేవి’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు గుణశేఖర్ ఆ సినిమా తర్వాత మళ్లీ చారిత్రక నేపథ్యంలో ‘ప్రతాపరుద్రుడు’ సినిమాను తెరకెక్కిస్తానని చెప్పాడు. దానికి సంబంధించిన రీసెర్చ్ కూడా మొదలుపెట్టిన ఆయన ఈ సినిమా విషయం పక్కనపెట్టి తాజాగా ‘హిరణ్యకశప’ పేరుతో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

12/11/2016 - 21:16

అల్లరి నరేష్ కథానాయకుడుగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..

12/11/2016 - 21:14

తమిళంలో విజయం సాధించిన ‘తరకప్పు’ చిత్రాన్ని తెలుగులో అనువదించారు. వి.జె.వై.ఎస్.ఆర్. ఆర్ట్స్ పతాకంపై రవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో వై.శేషిరెడ్డి అందిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.

12/11/2016 - 21:11

ఈమధ్య హాలీవుడ్ సినిమాల్లో ఇండియన్ స్టార్‌ల ప్రవేశం ఎక్కువగానే వుంది. ముఖ్యంగా కొన్ని రోజులుగా బాలీవుడ్ భామలు దీపిక, ప్రియాంకల గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే దీపిక హాలీవుడ్‌లో రూపొందుతున్న సంచలన చిత్రం ‘ట్రిపుల్‌ఎక్స్’లో నటిస్తోంది. ఆ టీజర్ ఇటీవలే విడుదలై సంచలనం క్రియేట్ చేసింది. ఆ టీజర్‌లో హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కించింది దీపిక.

12/11/2016 - 21:07

సన్నీ, ప్రశాంత్, ప్రసన్న, అక్చిత ప్రధాన తారాగణంగా వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై శివశ్రీ దర్శకత్వంలో డాక్టర్ మళ్ల విజయప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇంకేంటి.. నువ్వే చెప్పు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. సినిమా ఆడియో వేడుక వైజాగ్ ఆర్‌కె బీచ్‌లో నిర్వహించారు.

12/11/2016 - 01:52

ప్రముఖ తమిళ దర్శకుడు బాల తమిళంలో రూపొందించిన ఓ చిత్రం ‘కాళి’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. బి స్టూడియోస్ పతాకంపై అధర్వ, ఆనంది, లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మీ వెంకటేశ్వరా మూవీస్, శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎం.ఆర్. అందిస్తున్నారు.

12/11/2016 - 01:50

తెలుగు, తమిళ భాషల్లో సూర్య కథానాయకుడిగా స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పణలో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత మల్కాపురం శివకుమార్ అందిస్తున్న చిత్రం ‘యముడు-3’ (సింగం-3). ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఆదివారం ఆన్‌లైన్‌లో విడుదలకానున్నాయి. చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

12/11/2016 - 01:47

‘కుమారి 21ఎఫ్’తో సంచలన కథానాయికగా మారింది హెబ్బాపటేల్. ‘అలా ఎలా’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈమెకు ‘కుమారి 21ఎఫ్’ చిత్రం టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తరువాత మరో రెండు చిత్రాల్లో నటించి వరుస విజయాలతో దూసుకుపోతున్న హెబ్బా, తాజాగా నటిస్తున్న చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’. ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి భాస్కర్ దర్శకుడు.

Pages