S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2016 - 21:04

‘బెంగాల్ టైగర్’ తరువాత ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు రవితేజ. ఇప్పటికే పలువురు దర్శకులతో కథా చర్చలు జరిపి ఆయన నెక్స్ట్ సినిమా విషయంలో సైలెంట్ అయ్యాడు. ఇప్పటికే ఏడాదికిపైగా గడుస్తున్నా రవితేజ నెక్స్ట్ సినిమా ఏంటి అనే సందేహం ఇంకా ఆయన ఫ్యాన్స్‌లో నెలకొంది. ఫైనల్‌గా రవితేజ నెక్స్ట్ సినిమా ఓకే చేసాడు.

12/09/2016 - 21:01

అవసరాల శ్రీనివాస్ కథానాయకుడుగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా రూపొందిస్తున్న తాజా చిత్రం ‘బాబు.. బాగా బిజీ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.

12/09/2016 - 20:58

రామ్మోహన్.పి నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘పిట్టగోడ’. డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, సన్‌షైన్ సినిమాస్ పతాకాలపై అనుదీప్.కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్, రామ్మోహన్.పి నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అయింది. ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు.

12/09/2016 - 20:56

హీరో సూర్య తన కెరీర్‌ను స్లో అండ్ స్టడీగా చేసుకుంటూ పెద్ద హీరోగా మారిన విషయం తెలిసిందే. కెరీర్ మొదటి రోజుల్లో సూర్య నటించిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా కాకా’. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. దాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా ‘ఘర్షణ’ పేరుతో రీమేక్ చేశారు. కానీ ఇక్కడ పెద్దగా ఆడలేదు.

12/09/2016 - 20:53

విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఆర్.పి.ఎ. క్రియేషన్స్, డి.వి. సినీ క్రియేషన్స్ సంయుక్తంగా అందిస్తున్న చిత్రం పిజ్జా-2. తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 30న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ - ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులను, అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలుపుతూ ఓ సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని ధ్రిల్లర్ జోనర్‌లో సినిమా రూపొందించామని తెలిపారు.

12/09/2016 - 20:53

పల్లాడ సాయికృష్ణ కథానాయకుడిగా శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్, శ్రీలక్ష్మి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ఎందరో మహానుభావులు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. సంగీత దర్శకుడు రఘు కుంచె ఆడియో సీడీని విడుదల చేశారు.

12/09/2016 - 20:50

విజెవైఎస్ ఆర్ ఆర్ట్స్ పతాకంపై వై.శేషిరెడ్డి సమర్పణలో రవి దర్శకత్వంలో తమిళంలో ఘన విజయం సాధించిన ‘తర్కప్పు’ చిత్రాన్ని ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు’గా వై.శేషిరెడ్డి తెలుగులో ప్రేక్షకులకు అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొన్న ఈ చిత్రం త్వరలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు’ చిత్ర విశేషాలను చిత్ర సమర్పకుడు వై.శేషిరెడ్డి తెలియజేస్తూ..

12/09/2016 - 20:50

ఈమధ్య సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ కామన్‌గా మారాయి. ఇప్పటికే పలువురు భామలు ఈ విషయంలో ఒకడుగు ముందుకేస్తున్నారు. బాలీవుడ్‌లో అయితే ఈ లిప్ లాక్ సీన్స్‌కి కొదువే లేదు. ఈమధ్యే తెలుగు సినిమాల్లో కూడా ఎక్కువయ్యాయి. ఇక తెలుగు భామ తేజస్విని కూడా ఈ విషయంలో మంచి జోరుమీదుంది. ఐస్‌క్రీమ్ తరువాత హాట్ డోస్ పెంచిన ఈ భామ, తనలోని గ్లామర్ యాంగిల్‌ని బాగానే బయటపెట్టింది.

12/09/2016 - 20:47

టూ పీస్ బికినీలతో రెచ్చగొట్టే పూనమ్ పాండే, లేటెస్టుగా ఓ తెలుగు సినిమాలో మాత్రమే నటిస్తోంది. ఈ అమ్మడి అందాలు బాలీవుడ్‌కి బోర్ కొట్టినట్టున్నాయి. అందుకే బాలీవుడ్‌లో పెద్దగా సినిమా ఛాన్సులు రావడంలేదు. ఇక తన అందాలను సోషల్ మీడియాలో ఆరబోసి క్రేజ్ తెచ్చుకోవడం ఎలాగో బాగా తెలిసిన ఈ భామ ఇన్ని రోజులు సైలెంట్‌గా వుండి మరోసారి వేడెక్కించేందుకు రెడీ అయింది.

12/08/2016 - 21:21

‘ప్రస్తుతం నిర్మిస్తున్న చిత్రాలలో భారతీయత, మన సంస్కృతి ఎక్కడా కనబడడంలేదు. దర్శక నిర్మాతలందరూ ఓ గిరి గీసుకొని కూర్చున్నారు. మన సంస్కృతిమీద ఆధారపడి బతుకుతున్నవారు ఎందరో వున్నారు. అలాగే సినిమా పరిశ్రమపై ఆధారపడినవారు ఎంతోమంది వున్నారు. సినిమాల ప్రభావం పాత్రలపై పడుతున్నాయి.

Pages