S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 20:53

‘మంచి కథలు ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు చూడాలని అనుకుంటున్నారు. భాష అర్థం కాకపోయినా పొరుగు సినిమాలు చూడాలని ఆశిస్తున్నారు. ‘ప్రేమిస్తే’, ‘పిజ్జా’, ‘షాపింగ్‌మాల్’, ‘జర్నీ’ లాంటి బ్లాక్‌బస్టర్లు ప్రేక్షకుల్లో మారిన అభిరుచికి నిదర్శనం. ఆ తరహాలోనే వస్తున్న మరో సినిమా ‘మెట్రో’. ‘జర్నీ’ని మించి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టే చిత్రమిది’ అని అన్నారు హీరో నందు.

12/02/2016 - 20:51

విన్ను మద్దిపాటి, అక్షత జంటగా అఛీవర్ సిగ్నేచర్ ఎం.ఎఫ్.క్రియేషన్స్ పతాకంపై అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖరరావు, మధుఫోమ్రా రూపొందించిన చిత్రం శేఖరం గారి అబ్బాయి. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది.

12/02/2016 - 20:49

యువ కథానాయకుడు జై, అంజలి జంటగా 70 ఎం.ఎం. ఫిలింస్ పతాకంపై టి.ఎస్.అరుణ్ బాలాజీ, కందస్వామి నందకుమార్ రూపొందించిన చిత్రం ‘బెలూన్’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.

12/02/2016 - 20:47

ప్రతీక్, శ్రావ్య, శ్రీసయ్యాని ప్రధాన తారాగణంగా రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్ ప్రేమ్‌కరణ్ దర్శకత్వంలో లంకా కరుణాకర్‌దాస్ రూపొందిస్తున్న చిత్రం వానవిల్లు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

12/01/2016 - 21:01

బాలకృష్ణ కథానాయకుడిగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. వై.రాజీవ్ రెడ్డి, సాయిబాబు రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన చివరి సన్నివేశాన్ని ఆర్‌ఎఫ్‌సిలో బాలకృష్ణ, శ్రీయ, హేమామాలినిపై చిత్రీకరించారు.

12/01/2016 - 20:59

అల్లరి సురేష్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఛత్రపతి ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

12/01/2016 - 20:58

చిరంజీవి 150వ సినిమాగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ చిరంజీవి సరసన తొలిసారిగా కథానాయికగా నటించడం విశేషం. చిరంజీవి చిత్రాలకు ఉన్న మాస్ ఇమేజ్ దృష్టిలో ఉంచుకొని ఆయన పాత్రను సృష్టించారు.

12/01/2016 - 20:56

ప్రియాంకా కీలక పాత్రలో బేబి ఇలినాపార్థవి ప్రధాన తారాగణంగా కె.ఆర్.కె.ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ సంయుక్తంగా అందిస్తున్న చిత్రం ‘చిన్నారి’. లోహిత్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రూపొందింది.

12/01/2016 - 20:56

తెలుగు తమిళ భాషల్లో అంజలి ప్రధాన పాత్రలో హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ సినిమాగా రూపొందిస్తున్న చిత్రం ‘చిత్రాంగద’. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్ పతాకంపై అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

12/01/2016 - 20:55

విజయ్ ఆంటోని మరోసారి ‘బేతాళుడు’గా కలెక్షన్ల వేటను మొదలెట్టాడు. ఈ సినిమాకోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇటు పరిశ్రమలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఓ క్యూరియాసిటీ వున్నదని, 500 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైందని, విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు ప్రదీప్, ఎస్.వేణుగోపాల్ తెలిపారు.

Pages