S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/26/2016 - 23:00

సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘విన్నర్’. విదేశాలలో షూటింగ్ పూర్తి చేసిన సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మాట్లాడారు. ఈ నెల 3 నుండి 20 వరకు ఉక్రెయిన్‌లో పాటల చిత్రీకరణ చేశామని, యాంకర్ అనసూయపై మరోపాటను చిత్రీకరించామని తెలిపారు.

11/26/2016 - 22:58

తెలుగులో అవును, సీమటపాకాయ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందిన నటి పూర్ణ తాజాగా కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో హీరోయిన్‌గా నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు తెలుగులో అవకాశాలు పెరుగుతున్నాయని అందరూ అభిప్రాయపడుతుండగా ఆమెను వెతుక్కుంటూ ఓ గోల్డెన్ చాన్స్ వచ్చింది. కానీ, అది తెలుగులో కాదు తమిళంలో.

11/26/2016 - 22:57

ఓ సినిమా తెలుగులోకి అనువాదం చేయాలనుకున్నపుడు ఆ సినిమా లైన్ ఎలా వుంది? ఏ జోనర్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు? అనే అంశాలను గమనించి ఆ చిత్రాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఏ సినిమా అయినా డిఫరెంట్‌గానే అందించే ప్రయత్నం చేస్తాం. ఈ మూడు చిత్రాలు విడుదలయ్యాక మా సంస్థ గౌరవం పెరుగుతుందని భావిస్తున్నాం.

11/26/2016 - 22:56

రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ధ్రువ’. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

11/26/2016 - 22:55

శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో రామ్‌శంకర్, నికిషా పటేల్ జంటగా మేకా బాలసుబ్రహ్మ ణ్యం, బి.్భస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘అరకురోడ్డులో’.

11/26/2016 - 22:55

జనతాగ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ తదుపరి సినిమా ఏమిటి? అనే ప్రశ్నకు ఇంకా సరైన జవాబు రాలేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరిపినా కూడా ఏది ఫైనల్ కాలేదు.

11/26/2016 - 22:53

ప్రయోగాల హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న విక్రమ్ మరో క్రేజీ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. వీరిద్దరి క్రేజీ కలయికలో రూపొందే చిత్రమే ధ్రువనక్షత్రం. గౌతమ్ మీనన్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించే ఈ సినిమాలో హీరోగా మొదట వేరేవాళ్ళను హీరోగా అనుకున్నాడు. కానీ విక్రమ్ అయితే బెటర్ అని భావించిన గౌతమ్ ఫైనల్‌గా విక్రమ్‌తో ఈ సినిమా తీయడానికి రెడీ అయ్యాడు.

11/26/2016 - 22:53

రాఘవ లారెన్స్, రుతికా సింగ్ జంటగా అభిషేక్ ఫిలిం పతాకంపై పి.వాసు దర్శకత్వంలో రమేష్ పిళ్లై రూపొందిస్తున్న చిత్రం ‘శివలింగ’. షూటింగ్ అంతా పూర్తయిన సందర్భంగా దర్శకుడు వాసు మాట్లాడుతూ- చంద్రముఖి, ఆప్తమిత్ర స్టైల్లో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, శక్తివాసు ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తామన్నారు.

11/26/2016 - 22:52

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజవౌళి తనయుడు కార్తికేయ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా? ప్రస్తుతం నటనపరంగా శిక్షణలో ఆరితేరుతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. బాహుబలి సినిమాతోపాటు జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్‌గా, కొన్ని సినిమాకు పబ్లిసిటీ డిజైనర్‌గా కార్తికేయ వర్క్ చేశాడు.

11/25/2016 - 21:23

టాలీవుడ్‌లో క్రేజీ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గీతామాధురి త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హస్కీ వాయిస్‌తో ఆకట్టుకుంటున్న ఈమె, హీరోయిన్‌గా చేస్తే సంచలనమే అంటూ అంతటా ఆసక్తి నెలకొంది. గీతామాధురి నటించే సినిమా ఏంటి? అనే ప్రశ్న అందరిలో మెదిలింది. దానికి జవాబుగా మెట్రో సినిమాలో ఓ పాటలో గీతామాధురి నటించింది.

Pages