S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/12/2016 - 00:13

వికాస్, కళ్యాణి జంటగా దుర్గాదేవి ఫిలింమేకర్స్ బ్యానర్‌పై ఎన్.డి.ఉదయ్‌కుమార్ దర్శకత్వంలో కనవరెడ్డి నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘తుహిరే మేరీజాన్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

11/12/2016 - 00:12

పూజా గాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్ మూవీస్ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ నిర్మించిన ‘దండుపాళ్యం’ ఘన విజయం సాధించి శత దినోత్సవ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అదే టీమ్‌తో రూపొందుతున్న ‘దండుపాళ్యం-2’ 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ, ‘40 రోజులపాటు ఏకధాటిగా జరిగిన షెడ్యూల్‌తో 70 శాతం షూటింగ్ పూర్తయింది.

11/12/2016 - 00:12

శ్రీ విష్ణు హీరోగా కుమార్ వట్టి దర్శకత్వంలో వెనె్నల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్‌రావు నిర్మిస్తున్న చిత్రం ‘మా అబ్బాయి’. ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత ప్రకాష్‌రావు మాట్లాడుతూ, ‘మా తొలి ప్రయత్నంగా మా అబ్బాయి చిత్రాన్ని నిర్మిస్తున్నాం.

11/12/2016 - 00:11

వరం, తాన్యారెడ్డి ముఖ్య పాత్రల్లో ప్రణీత్ పండగ దర్శకత్వంలో గీతా టాకీస్ పతాకంపై వైష్ణవి నిరంజన్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో,హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు చలపతిరావు క్లాప్ కొట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,‘కొత్త పాయింట్‌తో వచ్చే చిత్రాల్ని జనాలు ఆదరిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా మంచి విజయం సాధించాలి’ అన్నారు.

11/10/2016 - 23:49

హృతిక్ రోషన్ కథానాయకుడిగా భారీ యాక్షన్ థ్రిల్లర్ కాబిల్ చిత్రాన్ని తెలుగులో ‘బలం’గా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. రాకేష్ రోషన్ నేతృత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యామీగౌతమ్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

11/10/2016 - 23:48

అందాల భామ హన్సిక ఈమధ్య తెలుగులో కంటే కూడా తమిళంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ అక్కడే బిజీగా మారిపోయింది. దాంతోపాటు తెలుగులో కూడా స్టార్ హీరోయిన్‌గా వెలగాలనే ప్రయత్నాలు మాత్రం చేస్తూనే వుంది. తాజాగా ఈమె గోపీచంద్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. గోపీచంద్ ప్రస్తుతం ఆక్సిజన్ చిత్రంలో నటిస్తున్నాడు.

11/10/2016 - 23:47

తనకు అవకాశాలివ్వమని అవతలివాళ్లను అడగడం ఇష్టముండదని, ఎవరివద్దా చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరమే లేదని చెబుతోంది అందాల భామ ఇలియానా. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన ఈమె, బాలీవుడ్‌పై వున్న ఆసక్తితో అక్కడికి చెక్కేసింది. సౌత్‌నుండి చాలా అవకాశాలు వచ్చినా కూడా దేనికీ ఓకె చెప్పలేదు.

11/10/2016 - 23:45

వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గురు’. బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘సాల ఖుద్దూస్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేష్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగింది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ విడుదలకు ఫిక్స్ అయింది.

11/10/2016 - 23:44

చిరంజీవి కథానాయకుడిగా రూపొందిస్తున్న ఖైదీ నెం.150 (బాస్ ఈజ్ బ్యాక్) చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ యూరప్‌లో జరుగనుంది. సంక్రాంతికి విడుదల చేయడానికి జెట్ స్పీడ్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాజల్ కథానాయికగా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ రూపొందిస్తున్నారు.

11/10/2016 - 23:42

ఖయ్యుమ్, నందినీ కపూర్ జంటగా షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్ కుమార్ నిర్మిస్తున్న పొలిటికల్ క్రైమ్ థిల్లర్ చిత్రం ‘డర్టీగేమ్’. ఈ చిత్రం టాకీపార్ట్ పూర్తిచేసుకుంది. దర్శకుడు మాట్లాడుతూ, డర్టీగేమ్ చాలా బాగా వచ్చిందని, కథలో వైవిధ్యం ఉంటుందని, చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.

Pages