S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/10/2016 - 07:29

అల్లరి నరేష్ కథానాయకుడిగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. యు/ఎ సర్ట్ఫికెట్ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 12న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

11/10/2016 - 07:28

హెబ్బాపటేల్, తేజస్వి మడివాడ, రావు రమేష్ ప్రధాన తారాగణంగా లక్కీ మీడియా పతాకంపై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ రూపొందించిన చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది.

11/10/2016 - 07:28

‘ముకుంద’ సినిమాలో పద్ధతిగల సంప్రదాయ పాత్రలో కనిపించి ఆకట్టుకున్న పూజా హెగ్డే, ఆ సినిమాతో ఇక్కడ మంచి మార్కులు కొట్టేసి, ఛాన్స్‌లు పట్టేసింది. ఆ తరువాత ‘ఒక లైలాకోసం’, మొహంజదారో సినిమాల్లో నటించిన పూజ, ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన డి.జె ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రంలో నటిస్తోంది. ఈ అమ్మడు సంప్రదాయబద్ధంగా కనిపిస్తుందేమో అని అనుకున్నారు అందరూ.

11/10/2016 - 07:27

సందీప్ కిషన్, మెహరీన్ కౌర్ పీర్జాదా జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రం హైదరాబాద్ ఫిలింనగర్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎ.ఎం.రత్నం క్లాప్‌నిచ్చారు.

11/10/2016 - 07:26

ప్రేమన్నది యూనివర్సల్. కానీ ప్రేమలో వున్న ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతుంటారు. అంటే ప్రేమ అన్నది వ్యక్తిగతం కూడా. చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా నేటి యువత కోసం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుపోతున్నారు. దీనివల్ల మనుషులు, మనసులు విడిపోతున్నాయి. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని తన వల్ల జరిగిన పొరపాటుని ఎలా సరిదిద్దుకున్నాడు?

11/10/2016 - 07:26

‘సరైనోడు’ ఘనవిజయంతో తెలుగు పరిశ్రమలోని స్టార్ డైరెక్టర్‌లలో ఒకడిగా మారిపోయారు బోయపాటి శ్రీను. హైఓల్టేజ్ యాక్షన్ సబ్జెక్ట్‌తో సినిమాలు చేస్తూ తనతో పనిచేసే హీరోలను మాస్ హీరోలుగా నిలబెట్టే బోయపాటి, తన తరువాతి సినిమాను హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చేస్తున్నారు. ‘అల్లుడు శీను’ చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన శ్రీనివాస్, ఇప్పటివరకూ సరైన కమర్షియల్ హిట్ అందుకోలేదు.

11/08/2016 - 21:02

లవర్‌బాయ్‌గా దొరికే ఇమేజిలో ఓ ఆనందం వుంటుంది. ప్రేమకథలే నాకు పూర్తి కంఫర్ట్ జోనర్. ‘ప్రేమమ్’ చిత్రం తరువాత ఈ నమ్మకం మరింత బలపడింది. ఇంకా వైవిధ్యమైన ప్రేమకథల్లో నటిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అని అర్థమైందని’ నటుడు నాగచైతన్య తెలిపారు.

11/08/2016 - 20:58

అంతర్జాతీయ వేదికపై బాలీవుడ్ నటి దీపిక పదుకొనేకు అపూర్వ అవకాశం దక్కింది. గేట్ వే ఆఫ్ యూరోప్‌కా విఖ్యాతిగాంచిన నెదర్లాండ్స్‌లోని రొట్టెర్‌డామ్‌లో జరిగిన ఎంటివి యూరోపియన్ మ్యూజిక్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకల్లో రెడ్‌కార్పెట్‌పై హొయలొలికించేందుకు వచ్చిన దీపికకు అపూర్వ స్వాగతం లభించింది. ప్రఖ్యాత డిజైనర్ మొనీషా జైసింగ్ రూపొందించిన దుస్తుల్లో దీపిక ఆహూతులను ఆకట్టుకుంది.

11/08/2016 - 20:57

నాగచైతన్య, మంజిమమోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథాచిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ద్వారకా క్రియేషన్స్ బేనర్‌పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డితో సినిమా గురించిన విశేషాలను తెలియజేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

11/08/2016 - 20:55

విశాల్, తమన్నా జంటగా హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి అందిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రాన్ని ఈనెల 18న భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని నిర్మాత రాజు విడుదల చేశారు.

Pages