S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/29/2016 - 20:51

కార్తి, నయనతార, శ్రీదివ్య హీరో హీరోయిన్లుగా గోకుల్ దర్శకత్వంలో పి.వి.పి సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై రూపొందిన ‘కాష్మోరా’ మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రం మొదటిరోజే 5 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి కార్తి కెరీర్‌లో బెస్ట్ చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి చెప్పిన విశేషాలు..

10/28/2016 - 21:27

ముంబైలో నిర్వహించిన 18వ మామి, ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ముగిసింది. బాలీవుడ్ అందాల భామలు ఈ సందర్భంగా ర్యాంప్‌పై హొయలొలికించారు. ప్రఖ్యాత దుస్తుల డిజైనర్ ప్రబల్ గురుంగ్ రూపొందించిన ఎర్రని దుస్తుల్లో కత్రినాకైఫ్ ఆహూతులను ఆకట్టుకుంటే డైస్‌కయోక్ రూపొందించిన దుస్తులు, నీరవ్‌మోదీ ఆభరణాలు ధరించిన సోనమ్‌కపూర్ కట్టిపడేసింది.

10/28/2016 - 21:07

తమిళ స్టార్ హీరో సూర్య, అనుష్క, శృతిహాసన్ ముఖ్యపాత్ల్రో హరి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞాన్‌వేల్‌రాజా నిర్మిస్తున్న చిత్రం ‘సింగం-3’. ఈ చిత్రాన్ని తెలుగులో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ శుక్రవారం విడుదలైంది.

10/28/2016 - 21:05

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నాని. ఇటీవలే మజ్ను చిత్రంలో నటించిన నాని, తాజాగా నటిస్తున్న చిత్రం ‘నేను లోకల్’. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

10/28/2016 - 21:04

గ్లామర్ భామ హన్సిక ప్రస్తుతం కోలీవుడ్‌లో బిజీగా వుంది. వరుస అవకాశాలతో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న ఈమె, టాలీవుడ్‌లో కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోన్న హన్సిక, తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఓ సందర్భంగా తన జీవితంలో ప్రేమకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, ప్రేమా గీమా జాంతానై అని చెబుతోంది.

10/28/2016 - 21:02

జీవా, కాజల్ జంటగా డి.కె. దర్శకత్వంలో తమిళంలో ‘కావలైవేండాం’ చిత్రాన్ని తెలుగులోకి డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో అందిస్తున్న చిత్రం ఆడియో విడుదల హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జీవా, కాజల్, కె.వి.వి.సత్యనారాయణ, రాహుల్ రవీంద్రన్, మల్కాపురం శివకుమార్, శోభారాణి, గిరిధర్, మంత్ర ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

10/28/2016 - 21:00

ఏ విషయమైనా బయటకు చెప్పేవరకూ తనకు నిదరపట్టదని అంటోంది అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్. సాధారణంగా పరిశ్రమలో చాలా విషయాలు గుట్టుగా జరిగిపోతూ వుంటాయి. ఏదీ బైటికి రానీయరు. కానీ ఈమె మాత్రం తనకు తెలిసిన ఏ విషయమైనా ఖచ్చితంగా బైటికి చెప్పేవరకూ ఊరుకోదట. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్ క్రేజీ గర్ల్‌గా ఇమేజ్ తెచ్చుకుంది. రకుల్‌ప్రీత్‌సింగ్.

10/28/2016 - 20:57

విశాల్, తమన్నా జంటగా హరి వెంటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు.

10/28/2016 - 20:55

సునీల్‌కుమార్ రెడ్డి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గల్ఫ్’. యెక్కలి రవీందర్‌బాబు, రమణీకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చేతన్ మద్దినేని కథానాయకుడు. డింపుల్ కథానాయిక. ప్రస్తుతం గల్ఫ్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

10/28/2016 - 20:51

ప్రస్తుతం ఏ పేపర్ తిరగేసినా చైన్ స్నాచింగ్ వార్తలే కనబడతాయి. ఇదొక హాట్ టాపిక్‌గా మారింది. నిత్యం రద్దీగా వుండే ప్రాంతాలలో చైన్ స్నాచర్లు దర్జాగా గొలుసులు లాక్కెళ్లిపోవడం వింటూనే వున్నాం. ఈ బర్నింగ్ టాపిక్‌పై రూపొందించిన చిత్రం ‘మెట్రో’. రియలిస్టిక్‌గా మన కళ్లముందే జరుగుతున్నట్టుగా చిత్రీకరించిన ఈ సినిమా చైన్ స్నాచింగ్ నేపథ్యంలోనే సాగుతుంది.

Pages