S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/13/2016 - 20:48

అల్లు అర్జున్ కథానాయకుడిగా శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై హరీశ్ శంకర్.ఎస్ దర్శకత్వంలో రాజు రూపొందిస్తున్న చిత్రం ‘డి జె దువ్వాడ జగన్నాధమ్’. ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నేతృత్వంలో ఈ చిత్రానికి సంబంధించిన బాణీలను రూపొందిస్తున్నారు.

10/13/2016 - 20:47

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సినిమాల జోరు పెంచిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తోన్న 22వ సినిమా కాటమరాయుడు సెట్స్‌పై ఉండగానే, నిన్ననే 23వ సినిమా కూడా మొదలుపెట్టేశారు. ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఇప్పటికే దాదాపుగా పూర్తికాగా, టీమ్ క్యాస్టింగ్ ప్రక్రియ మొదలుపెట్టిందట. పవన్ సరసన హీరోయిన్‌గా నయనతారను సంప్రదించినట్లు తెలుస్తోంది.

10/13/2016 - 20:45

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ‘ఖైదీ నెం.150’ కొద్ది నెలలుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు రామ్‌చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.

10/13/2016 - 20:42

ధనుష్ తొలిసారిగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం ‘్ధర్మయోగి’. తమిళంలో ‘కొడి’ పేరుతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో త్రిష, అనుపమా పరమేశ్వరన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సిహెచ్.సతీష్‌కుమార్ అందిస్తున్నారు. నరసింహ చిత్రంలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అలరించిన విషయం తెలిసిందే.

10/13/2016 - 20:40

తెలుగులో టాప్ హీరోయిన్ రేసులో రకుల్ ప్రీత్‌సింగ్ ముందుండి దూసుకుపోతోంది. సూపర్‌స్టార్ మహేష్‌తో ఓ సినిమా, రామ్‌చరణ్‌తో ధ్రువ అనే సినిమా, సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమా ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ ఖాళీలేకుండా కష్టపడుతున్న ఈ భామ ఈమధ్యే తమిళంలో విశాల్ హీరోగా తెరకెక్కనున్న ‘తుప్పరివాలన్’ అనే సినిమాకు కూడా రకుల్ హీరోయిన్‌గా ఓకే అనేసింది.

10/12/2016 - 21:19

సాయికుమార్, సుమన్ ప్రధాన తారాగణంగా టీమ్ ఇండియా ప్రొడక్షన్స్ ప్రై. లి. పతాకంపై అల్లాణి శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘చిలుకూరి బాలాజీ’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. యు సర్ట్ఫికెట్ లభించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

10/12/2016 - 21:18

సుదీప్, నిత్యామీనన్ జంటగా సి.ఎల్.ఎన్. మీడియా లగడపాటి శ్రీనివాస్, గూడూరి గోపాల్‌శెట్టి అందిస్తున్న చిత్రం ‘కోటికొక్కడు’. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఇటీవల విడుదల చేశారు.

10/12/2016 - 21:17

నవీన్‌చంద్ర, శృతిసోధి జంటగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ రూపొందించిన చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు.

10/12/2016 - 21:16

బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్ హీరోగా హిందీలో రూపొందించిన ‘కాబిల్’ చిత్రం తెలుగులో విడుదల కానుంది. రాకేష్‌రోషన్, హృతిక్‌రోషన్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘క్రిష్’, ‘క్రిష్-3’ కోరుూ మిల్‌గయా, కహోనా ప్యార్‌హై చిత్రాలను అందించిన కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు కాబిల్‌తో వస్తోంది. సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2017 జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

10/12/2016 - 21:15

అల్లు శిరీష్ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందించనున్నారు. మంచి కథలతో ముందుకు వచ్చే ఆనంద్ ఈసారి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నిఖిల్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ చిత్రం తరువాత శిరీష్ చిత్రం తెరకెక్కనుంది. సైన్స్ ఫిక్షన్ కథనంతో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Pages