S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/28/2016 - 23:16

గణేష్, మంజరి, మాళవిక ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘జర్నీ-2’. జయలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై చిగులూరి గంగాధరరావుచౌదరి నిర్మిస్తున్నారు. ఎస్.నారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు ఆడియో సీడీలను విడుదల చేసి తొలి సీడీని నిర్మాత బి.ఎ.రాజుకు అందించారు.

09/27/2016 - 21:04

‘అభినేత్రి’ చిత్రం హారర్ కామెడీ జోనర్. కానీ హారర్ అంతగా వుండదు. పూర్తి హాస్యం వుంటుంది. అలాగని ఫ్యామిలీ జోనర్ కాదు అనుకోవద్దు. పూర్తిగా కుటుంబ ప్రేక్షకులు చూసేలా వుంటుంది. హారర్ అంటే సహజంగా దెయ్యాన్ని చూపిస్తారు. ఈ చిత్రంలో మాత్రం దెయ్యం వుంటుంది కానీ ఎక్కడా కనపడదు. అదే ఈ సినిమా ప్రత్యేకత అని నటుడు, దర్శకుడు, నృత్యదర్శకుడు ప్రభుదేవ తెలిపారు.

09/27/2016 - 21:03

బాలకృష్ణ వందో చిత్రంగా రూపొందిస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను మొరాకో దేశంలో చిత్రీకరించారు. భారీ యుద్ధాల సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలువనున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

09/27/2016 - 21:01

చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి ఎలా వుంటాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాలో చిరంజీవి ఇదుగో ఇలా వుంటాడు. ఈ చిత్రంలో చిరు తాజా స్టిల్స్ విడుదలయ్యాయ.

09/27/2016 - 20:59

ప్రేమకోసం ఛాలెంజ్ చేసి తన మేధస్సును పెంచుకుని ప్రేమలో గెలిచి ప్రేయసిని ఎలా దక్కించుకున్నాడు అనే కథనంతో రూపొందించిన ‘నిర్మలా కానె్వంట్’లో నటుడు రోషన్ చక్కగా నటించాడని దాసరి నారాయణరావు తెలిపారు.

09/27/2016 - 20:56

బాహుబలి చిత్రం రెండవ భాగం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాజవౌళి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులతోపాటు సినిమాలకు సంబంధించిన సెలబ్రిటీలు కూడా తాము ఎదురుచూస్తున్నామని చెబుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. బొమ్మ పడిందంటే కలెక్షన్లు అదుర్స్‌గా వుంటాయని కూడా కథనాలు వస్తున్నాయి.

09/27/2016 - 20:55

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై మిథున్ మాన్యుల్ థామస్ దర్శకత్వంలో సారా అర్జున్ ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం ‘పిల్ల రాక్షసి’. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో చదలవాడ పద్మావతి అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

09/27/2016 - 20:53

రామ్ కథానాయకుడిగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హైపర్’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిపికెట్ వున్న ఈ చిత్రం ఈనెల 30న విడుదలకు సిద్ధమైంది.

09/27/2016 - 20:52

మనీష్, తేజస్విని జంటగా భాగ్యలక్ష్మి మూవీ మేకర్స్ పతాకంపై నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో మల్లికార్జున్‌రెడ్డి అందిస్తున్న చిత్రం ‘ప్రతిక్షణం’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సీడీని ఆర్.పి.పట్నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా విజయవంతం కావాలని, పాటలు, ట్రైలర్లు అందరికీ నచ్చేలా ఉన్నాయని అన్నారు.

09/25/2016 - 21:07

‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో టాలీవుడ్‌లో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు పొందిన రాజ్‌తరుణ్ ఇప్పుడిప్పుడే మంచి సినిమాలతో ప్రేక్షకాదరణ పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా తాను బుడిబుడి అడుగుల దశలోనే ఉన్నానని చెప్పుకునే ఈ హీరోకు టాలీవుడ్‌లో రేగిన పుకార్లు పెళ్లిచేసేశాయి. లాస్య అనే యాంకర్‌ను అతను రహస్య వివాహం చేసుకున్నాడని, వీరిద్దరి మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచిందని ఆ వార్తల సారాంశం.

Pages