S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/24/2016 - 21:37

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 100వ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఆయన లేటెస్ట్‌గా ‘ఆదిత్య 369’ సీక్వెల్ రానుందని నందమూరి బాలకృష్ణ స్వయంగా తెలిపారు. ఈ చిత్రం ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడన్న విషయం కూడా ఆయనే తెలిపారు. దీంతో ఈ చిత్రంలో మోక్షజ్ఞ ఎలా కన్పిస్తాడా అనే ప్రశ్న ఆయన అభిమానుల్లో తలెత్తింది.

01/24/2016 - 21:37

నిర్మాత బెక్కం వేణుగోపాల్

01/24/2016 - 21:36

సూర్య కథానాయకుడిగా సరికొత్త తరహాలో సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన న్యూలుక్ నేడు విడుదల చేశారు. సూర్య నిర్మాతగా విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘24’ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్లు గతంలో విడుదల చేశారు. నేడు సూర్య యాంగ్రీ యంగ్‌మెన్‌గా కనిపిస్తున్న కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

01/24/2016 - 21:35

సుజాతారెడ్డి దర్శకత్వంలో థ్రిల్లర్, సెంటిమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందించిన లఘు చిత్రం ‘మొదలు’. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ సందర్భంగా దర్శకురాలు సుజాత మాట్లాడుతూ, ఈ చిత్రం నన్ను నమ్మి చేసినందుకు ఆనందంగా వుందని, చూసిన ప్రతివారూ బాగుందని చెబుతున్నారని, ఈ చిత్రానికి సహకరించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలను తెలిపారు.

01/24/2016 - 21:34

గ్లామర్ భామ రెజినాకు ఈమధ్య జోరు బాగా పెరిగింది. వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ విజయాలు అందుకుంటోంది. ఇప్పటికే తెలుగు తమిళ భాషలలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి ఇప్పుడు ఓ క్రేజీ అవకాశం దక్కింది. తమిళంలో ముగ్గురు దర్శకుల కలయికలో ఈ సినిమా రూపొందనుంది.

01/24/2016 - 21:34

హెచ్‌డి విజన్ ఇండియా లిమిటెడ్ పతాకంపై బాల తారలతో రూపొందించిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. అహ్మద్ అఫ్ఫాన్ సమర్పణలో అనంతపురం ఫిలిమ్ సొసైటీ సహకారంతో రషీద్ బాషా దర్శకత్వంలో ఎన్.ఇబ్రహీం రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

01/24/2016 - 21:32

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న చిత్రం ‘రోగ్’. ఈ సినిమా ద్వారా కన్నడలో ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఇషాన్‌ని హీరోగా పరిచయం చేయనున్నారు. ఒకేసారి తెలుగు- కన్నడ భాషల్లో నిర్మించాలని మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్ ప్రారంబించి వెంటనే ఆపేశారు. స్క్రిప్ట్‌కోసం మరికొంత టైం తీసుకున్నారట దర్శకుడు పూరి.

01/24/2016 - 21:31

నూతన నటీనటులతో రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై అశోక్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఓ స్ర్తి రేపురా’ (కల్పితమా.. ఖచ్చితమా). ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు ఊళ్లో దెయ్యం తిరుగుతుందని, ఇంటి గోడలపై ‘ఓ స్ర్తి రేపురా’ అని రాసేవారు.

01/23/2016 - 21:40

బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక జంటగా భీమనేని శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘సుందరపాండ్యన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ‘స్పీడున్నోడు’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు వి.వి.వినాయక్ సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు తమన్నా, రెజీనా, రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరీన్ తదితరులు పాల్గొన్నారు.

01/23/2016 - 21:39

కార్తిక్‌రాజు, నిత్యాశెట్టి జంటగా చునియా దర్శకత్వంలో అయాన్ క్రియేషన్స్ పతాకంపై అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో రూపొందిన చిత్రం ‘పడేసావే’. ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నటుడు నాగార్జునలు టీజర్‌ను ఆవిష్కరించారు.

Pages