S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 21:06

ఆ ఇద్దరూ నాగార్జునకి జోడీగా నటించినవాళ్ళే. నాగార్జున పక్కన కనిపించిన ఆ ఇద్దరూ కూడా నాగ్‌కి తగ్గ జోడీ అనిపించినవాళ్లే. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ తల్లి అవుతోంది. ఆమెకి కూతురుగా మరో హీరోయిన్ నటిస్తోంది. ఇది ఎంత విశేషం కదూ! వివరాల్లోకి వెళితే- అనుష్క ప్రధాన పాత్రధారిగా అశోక్.జి దర్శకత్వంలో ‘్భగ్‌మతి’ తెరకెక్కుతోంది. అందులో అనుష్కకి తల్లిగా టబు నటించబోతోందట. నాగార్జునకి మాజీ లవర్‌గా టబుకి పేరుంది.

07/26/2016 - 21:03

దాదాపు ముప్ఫైఏళ్ళ క్రితం తెరకెక్కిన మజ్ను చిత్రం గురించి ఈమధ్య ఒక్కసారిగా ఇండస్ట్రీ మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. అందుకు కారణం నాగార్జున నటించిన ఆ సినిమా పేరును ఆయన తనయుడు నాగచైతన్య సినిమాకి వాడబోతున్నారనే ప్రచారం సాగడమే. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ రీమేక్‌కి మజ్ను పేరును ఫిక్స్‌చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకున్నాయి.

07/26/2016 - 21:01

శ్రీ శే్వతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై వెంకటరమణ పసుపులేటి దర్శకత్వంలో డి.వి.వి.సాయికుమార్, వెంకటరమణ పసుపులేటి సంయుక్తంగా నిర్మిస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ‘చంద్రోదయం’. ఆగస్టు 4న ఒంగోలులో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటీవలే ఈ చిత్ర బ్రోచర్‌ను హోం మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప ఆవిష్కరించారు.

07/26/2016 - 20:59

ఆనంద్ నంద, రేష్మిగౌతమ్, శివకృష్ణ ప్రధాన తారాగణంగా వి సినీ స్టూడియోస్ పతాకంపై బాలాజీ నాగలింగం సమర్పణలో డి.దివాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాణిగారి బంగళా’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీ విడుదలైంది. ఆడియో సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు.

07/26/2016 - 20:55

ఉదయ్, స్వప్న జంటగా రూపొందించిన చిత్రం ‘రామసక్కని రాకుమారుడు’ ఆడియో సీడీని నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ విడుదల చేసి తొలి కాపీని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యకు అందించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, కొత్త నటీనటులైనా బాగా నటించారని, ఉదయ్ దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ప్రతిభ చూపారని అన్నారు.

07/26/2016 - 20:53

మిల్కీ బ్యూటీ తమన్నాకు సంబంధించిన పెళ్లి వార్తలు అటు బాలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. హిందీలో రణవీర్‌సింగ్ సరసన చేసే సినిమాతో ఆమె బాలీవుడ్‌కి బైబై చెప్పనుందని సమాచారం. పెళ్లిచేసుకుని నటనకు స్వస్తి చెప్పాలని ఆలోచిస్తోంది. ముంబయికి చెందిన తన కుటుంబానికి ఆప్తులైన వ్యక్తితో ఆమె ప్రేమాయణం సాగిస్తోందని వినికిడి.

07/26/2016 - 20:49

దీపక్ సరోజ్, మాళవికా మీనన్ జంటగా కందిమల్ల మూవీ మేకర్స్ పతాకంపై సి.కళ్యాణ్ సమర్పణలో కందిమల్ల వెంకట చంద్రశేఖర్ రూపొందించిన చిత్రం ‘లవ్ కె రన్’ (సేవ్ లవ్). కోటపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తికావస్తున్నాయి. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు సి.కళ్యాణ్ మాట్లాడుతూ, సాంకేతిక విలువలతో దృశ్యకావ్యంగా రూపొందించారన్నారు.

07/25/2016 - 00:15

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, తమన్నా జంటగా విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అభినేత్రి’. ఎం.వి.వి.సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గూర్చి రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ, ‘మూడు భాషల్లో 70 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.

07/25/2016 - 00:12

చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించిన హైప్ ఎంత రావాలో అంత చేశారు. ఇంకా అది చాలదన్నట్లు హీరోయిన్ విషయమై రోజుకొక కొత్త వార్త వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ బంతి కాజల్ కోర్టులో పడింది. కాజల్ చిరంజీవి సరసన నటించడానికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది హీరోయిన్ల తర్వాత కాజల్ మాట వినిపిస్తోంది.

07/25/2016 - 00:10

జయ.బి దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’ చిత్రం నాలుగో షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాల్ని, ఓ ఫైట్‌ని, ఓ పాటని చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకురాలు జయ మాట్లాడుతూ, ‘లవ్‌లీ’ తర్వాత మరోసారి సూపర్‌హిట్ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా ‘వైశాఖం’. ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ మిక్స్ అయిన ‘వైశాఖం’ అపార్ట్‌మెంట్స్ నేపథ్యంలో సాగుతుంది.

Pages