S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/21/2016 - 21:01

ఈ చిత్రంలో నటించమని అడిగేందుకు బీజింగ్ వచ్చిన యూనిట్ సభ్యులు రజనీ చిత్రాల క్లిప్పింగ్‌లు చూపెట్టారు. ఆయనలో ఏదో మ్యాజిక్ ఉందనుకున్నా. సీన్‌లోకి వచ్చాక ఆయన ప్రత్యేకత, మానవత్వం అర్థమయ్యాయి. ఆయన నుంచి అటు నటనలోను, ఇటు నడవడికలోనూ ఎంతో నేర్చుకున్నా’ అన్నారు విన్‌స్టన్ చావో. ఆయన కబాలీలో విలన్‌పాత్ర పోషిస్తున్నారు.

07/21/2016 - 20:59

శ్రీ‘కబాలీలో హీరోయిన్‌గా అవకాశం రావడం అదృష్టం. ఈ చిత్రంలో రజనీ యువకుడిగా ఉన్నప్పుడు అతడి భార్య కుముదవల్లి పాత్రలో నటించా. భాష, యాస, నటన, నడవడిక, ఓ మనిషి ఎలా ఉండాలి, నటించేటప్పుడు, నిజజీవితంలో వ్యవహారశైలి ఇలా అన్ని విషయాల్లో రజనీనుంచి నేర్చుకున్నా. నేర్చుకుంటూనే ఉంటా. కబాలీ నాకు నటనతోపాటు ఎన్నో విషయాలు నేర్పింది.’ అని చెబుతోంది రాధికా ఆప్టే.

07/21/2016 - 20:57

షిరిడీ సాయి క్రియేషన్స్ పతాకంపై ధీరేంద్ర, పూజిత జంటగా అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘డర్టీ గేమ్’. ఈ చిత్రాన్ని సీనియర్ నటుడు సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మనోహర్‌కుమార్ మాట్లాడుతూ, ప్రముఖ నటీనటులందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారని, సురేష్ ఓ కీలకమైన పాత్రలో కన్పిస్తారని తెలిపారు.

07/21/2016 - 20:56

దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఎక్కలి రవీంద్రబాబు, రమణికుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘గల్ఫ్’ (సరిహద్దు దాటిన ప్రేమకథ). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది.

07/21/2016 - 20:53

మాస్ మహారాజ్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న రవితేజ ఈమధ్య చాలా వెనుకపడ్డాడు. ఆయన నటించిన బెంగాల్ టైగర్ సినిమా తరువాత దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా ఏ సినిమా సెట్స్‌పైకి రాలేదు. ఇప్పటికే రెండు మూడు కథలు రెడీగా వున్నా కూడా ఆయన ఏదీ కన్‌ఫర్మ్ చేయలేదు. రవితేజ కావాలనే సినిమాలు చేయడం లేదని, ఆయన ఆమధ్య కిక్-2 సమయంలో బాగా సన్నమయ్యాడుగా. ఆ లుక్ జనాలకు నచ్చలేదు. దాంతో మళ్లీ తన పాత ఫిగర్‌ని పెంచే పనిలో ఉన్నాడు.

07/21/2016 - 20:51

సుశాంత్, సోనం ప్రీత్ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీ నాగ్ కార్పొరేషన్, శ్రీ జీ ఫిలింస్ పతాకంపై జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల రూపొందిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం రా’ (జెస్ట్ చిల్). ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. వచ్చే నెల 19న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

07/21/2016 - 03:58

నటి నదియా అత్తగా నటిస్తే ఆ చిత్రం హిట్టవుతుందన్న సెంటిమెంట్ ‘అత్తారింటికి దారేది?’తో స్థిరపడింది! హీరోయిన్‌గా ఆమె నటిస్తున్న కాలంలో పట్టించుకోని టాలీవుడ్, ఇపుడు నదియాకు అవకాశాలపై అవకాశాలు ఇస్తోంది. అందాల అత్త పాత్రలో నదియా చేసిన నటన, ఆమె నటించిన ఆ చిత్రం అఖండ విజయం సాధించడం వంటి అంశాలతో మరోసారి వైవిధ్యభరితమైన కాంబినేషన్‌కు తెరలేచింది.

07/21/2016 - 03:57

ఏదైనా సమాధానం చెప్పడంలో సమంత తీరే వేరు. ఎదుటివారి ప్రశ్నలకు ఎక్కడా దొరక్కుండా సమాధానాలు చెప్పి తప్పించుకోవడం, ఆమె చెప్పిన సమాధానాల్లో అంతరార్థం అర్థం చేసుకోవడానికి ఆలోచించుకునేందుకు సమయం ఇవ్వడం, ఈలోగా కొత్త ప్రశ్నలు రాకుండా అడ్డుకోవడం అన్న విద్య సమ్ముకు తెలిసినట్లుగా మరొకరికి తెలీదు. కొంతకాలంగా నాగచైతన్యతో ఆమె ప్రేమలో పడిందనీ, త్వరలో పెళ్లనీ వార్తలు వస్తున్నాయి.

07/21/2016 - 03:55

హనీష్, చిరాశ్రీ జంటగా శ్రీ కనకదుర్గ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ఆమె అతడైతే’. షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించారు.

07/21/2016 - 03:54

గోపీనాధ్, విష్ణుప్రియ జంటగా బి.ఆర్.ఎస్.ఐ మూవీస్ పతాకంపై పోల్కంపల్లి నరేందర్ నిర్మిస్తున్న చిత్రం ‘ట్వంటీఫస్ట్ సెంచురీ లవ్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 23న విడుదలవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ, సినిమా పూర్తయ్యింది.

Pages