S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

,
07/19/2016 - 21:07

‘ఐతే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తొలి చిత్రంతోనే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు చంద్రశేఖర్ యేలేటి. ఆ తరువాత భిన్నమైన కథలతోనే చిత్రాలను చేస్తూ వచ్చాడు. తాజాగా ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘మనమంతా’. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్, గౌతమి ప్రధాన పాత్రల్లో తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.

07/19/2016 - 21:04

ఈమధ్య దక్షిణాదిలో హారర్ సినిమాల హవా బాగా ఎక్కువైంది. ఇప్పటికే వందల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. మరిన్ని రూపొందుతున్నాయి కూడా. ముఖ్యంగా ఈ తరహా సినిమాల్లో నటించడానికి స్టార్ హీరోయిన్లు ముందుకు రావడంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ఇపుడు వీరి దారిలోకి వస్తోంది మరో క్రేజీ హీరోయిన్ కాజల్.

07/19/2016 - 21:02

విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా డి.సురేష్‌బాబు సమర్పణలో రాజ్‌కందుకూరి, ఎస్.రంగినేని నిర్మిస్తున్న చిత్రం ‘పెళ్లిచూపులు’.

07/19/2016 - 21:02

శ్రీకాంత్, అక్ష జంటగా కరణం బాబ్జీ దర్శకత్వంలో రాజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ మరియు సుబ్రహ్మణ్య ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మెంటల్’. ‘మెంటల్ పోలీస్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పోలీసుల అభ్యంతరాల మేరకు ‘మెంటల్’ టైటిల్‌గా మార్చారు.

07/19/2016 - 21:00

ఎక్సెల్ ఫిలింస్ సమర్పణలో రాంరెడ్డి పన్నాల దర్శకత్వంలో వాజిద్‌ఖాన్ నిర్మిస్తున్న సూపర్ రైమ్స్ పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అడిషనల్ ఎస్.పి సత్యనారాయణ సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా వుందన్నారు.

07/19/2016 - 20:59

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ వ్యవస్ధాపకుడు జెఫ్ బొజెస్ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. సినీరంగంపై మొదటినుంచి ఆసక్తి ఉన్న జెఫ్ మొదట్లో ఓ షార్ట్ఫిల్మ్ ‘టూత్ ఫెయిరీ’లో నటించాడు. ఇందులో ఆయన ఓ సెక్యూరిటీ గార్డు పాత్రలో నటించాడు. ఇప్పుడు తొలిసారిగా హాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టాడు.

07/19/2016 - 20:56

ప్రస్తుతం కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పాపులరైన అందాల భామ హన్సికకు తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ చేసిన రెండు మూడు సినిమాలు ఆశించిన పలితాలని రాబట్టకపోవడంతో కోలీవుడ్డే బెటరని అక్కడే సెటిల్ అయింది. ప్రస్తుతం ఈమెకు తెలుగులో మరో అవకాశం దక్కింది. ప్రముఖ నటుడు గోపీచంద్ హీరోగా సంపత్‌నంది దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో హీరోయిన్‌గా హన్సిక ఓకె అయింది.

07/19/2016 - 20:54

అందాలభామ ఇలియాన స్వారీ చేస్తున్న గుర్రం అదుపుతప్పితే అక్షయ్‌కుమార్ కళ్లెం వేసి కట్టడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్షయ్‌కుమార్, ఇలియానా కలిసి నటిస్తోన్న హిందీ ‘రుస్తుం’ చిత్రం షూటింగ్ ఈమధ్య లండన్‌లో చేశారు. ఆ చిత్రంలో ఓ సన్నివేశంలో ఇలియానా గుర్రంపై స్వారీ చేస్తూండాలి. షూటింగ్ మొదలైన వెంటనే గుర్రం బెదిరిపోయింది.

07/17/2016 - 22:03

ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కబాలి చిత్రం ఈనెల 22న విడుదలకు సిద్ధమైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా మొదటినుంచి భారీ అంచనాల్ని క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ట్రైలర్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షించాయి. కబాలి రా అంటూ రజనీ పలికిన డైలాగ్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సినిమాకోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

07/17/2016 - 22:01

కంచె సినిమా సూపర్ అని కామెంట్ చేశారు తెలంగాణ ఐటి మంత్రి కె.టి.ఆర్. సినిమాలో నటీనటులు అద్భుతంగా నటించారని, ఇప్పుడే ఈ సినిమా చూశానని, చాలా క్వాలిటీతో తీశారని, ముఖ్యంగా వరుణ్‌తేజ్, ప్రగ్యాజైస్వాల్‌ల నటన అద్భుతంగా వుందని, క్రిష్ ఎక్స్‌లెంట్‌గా తెరకెక్కించాడని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.

Pages