S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/02/2016 - 04:39

నటిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న మహేష్‌బాబు సోదరి మంజుల ఇప్పుడు మరో బాధ్యత తీసుకునేందుకు రెడీ అయ్యింది. ఇప్పటివరకూ నటిగా షో, కావ్యాస్ డైరీ లాంటి చిత్రాల్లో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మహేష్ కథానాయకుడిగా నటించిన నాని, పోకిరితోపాటు షో, కావ్యాస్ డైరీ, ఏమాయ చేసావె తదితర చిత్రాల్ని నిర్మించారు మంజుల.

06/02/2016 - 04:38

దక్షిణాదిలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. ఆ తరువాత బాలీవుడ్‌కి చెక్కేసిన హాట్ భామ ఇలియానాకు అక్కడ తీవ్ర నిరాశే మిగిలింది. చేసిన నాలుగు సినిమాలు ఢమాల్‌మనడంతో అవకాశాలు రావడం ఆగిపోయాయి. దాంతో మళ్లీ గ్లామర్ పెంచి మాగజిన్‌లకు హాట్‌హాట్ ఫోజులిచ్చి సౌత్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ట్రైచేసినా పెద్దగా లాభం లేకపోయింది. దాంతో ఇక పెళ్లిచేసుకునేందుకు రెడీ అయినట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి!

06/02/2016 - 04:37

శ్రీనువైట్ల, వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘మిస్టర్’ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ 28న స్పెయిన్‌లో ప్రారంభం అవుతుందని తెలిసింది. నిజానికి మొదట ఈ సినిమా మే 15 నుంచి స్పెయిన్‌లో షూటింగ్ మొదలు కావాల్సి ఉన్నా అది జరుగలేదు. ప్రస్తుతం లాస్‌వేగాస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న వరుణ్‌తేజ్ మరికొద్ది రోజుల్లో ఇండియాకు రానున్నారు.

05/31/2016 - 22:21

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించేందుకు స్వదేశీ గ్రూప్ ముందుకొచ్చింది. దాదాపు 1000 కోట్లతో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికోసం రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు స్వదేశీ గ్రూప్ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మోటూరి కృష్ణప్రసాద్ తెలియజేశారు. హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో తమ స్వదేశీ గ్రూప్ నుంచి భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను ఆయన వివరించారు.

05/31/2016 - 21:24

‘నేను ఇప్పటివరకూ సీరియస్, ఇంటెన్స్, రొమాన్స్ లాంటి అన్ని రకాల జోనర్స్ సినిమాలలో నటించాను. కానీ కామెడీ మాత్రం ట్రై చేయలేదు. మొదటిసారి ‘అ ఆ’ చిత్రంలో కామెడీ పాత్రలో నటించే ప్రయత్నం చేశాను. నాకు మొదటినుండి కమెడియన్స్ అంటే చాలా ఇష్టం. కామెడీ పండించడం చాలా కష్టమైన పని. నన్ను నమ్మి ఈ పాత్ర ఇచ్చినందుకు థాంక్స్’ అని నటి సమంత పేర్కొన్నారు.

05/31/2016 - 21:22

హరీష్, అవంతిక జంటగా బి.జయ దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ బ్యానర్‌పై బి.ఎ.రాజు నిర్మిస్తోన్న చిత్రం ‘వైశాఖం’. ఈసినిమా అరవై శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ, ‘‘ప్రేమలో పావని కళ్యాణ్’, ‘చంటిగాడు’, ‘ప్రేమికులు’, ‘లలీ’ వంటి చిఅతాల తరువాత మా సంస్థలో రాబోతున్న మరో చిత్రం ‘వైశాఖం’.

05/31/2016 - 21:20

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ఇటీవలే మొరాకలో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లోని చిలుకూరు దగ్గరలో జరుగుతోంది. ఇప్పుడు రెండో షెడ్యూల్‌కి చేరుకున్నా కూడా ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు? దాంతో హీరోయిన్‌కోసం అనే్వషణ జోరుగా జరుగుతోంది. ఇప్పటికే నయనతార, అనుష్కల పేర్లు వినిపించాయి.

05/31/2016 - 21:11

ప్రముఖ దర్శకుడు రాజవౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా గతేడాది జూలైలో విడుదలై దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ‘బాహుబలి’, పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికలపై మన సినిమా మార్కెట్ పెరిగే అవకాశాలను కల్పించింది.

05/31/2016 - 21:10

భలే భలే మగాడివోయ్’ సినిమా తరువాత దర్శకుడు మారుతి ప్రస్తుతం వెంకటేష్ హీరోగా ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత మారుతి ఓ యువ హీరో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిసింది. తాజా సమాచారం మేరకు మెగా హీరో సాయిధరమ్‌తేజ్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. సుప్రీమ్ హిట్ తరువాత సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘తిక్క’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

05/31/2016 - 21:08

‘లవ్ యూ అలియా’ చిత్రంలో తాను ఓ సరికొత్త పాత్రలో నటించానని, కెరీర్‌లో ఇలాంటి పాత్ర ఇప్పటివరకూ చేయలేదని నటి భూమిక తెలిపారు. చందన్‌కుమార్, సంగీతా చౌహాన్ జంటగా సమీస్ మ్యాజిక్ సినిమా పతాకంపై ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ యూ అలియా’.

Pages