S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/28/2016 - 03:33

నూతన నటీనటులు కార్తీక్, నిత్యాశెట్టి, శామ్ ప్రధానంగా చునియా దర్శకత్వంలో ఐయాన్ క్రియేషన్స్ పతాకంపై నాగార్జున ప్రోత్సాహంతో రూపొందించిన చిత్రం ‘పడేసావె’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీ హైదరాబాద్‌లో అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు.

01/27/2016 - 01:43

‘గ్లామర్, నటన అనేవి నటికి రెండూ అవసరమే. అయితే మంచిపేరు రావాలంటే కమర్షియల్ చిత్రాల్లో నటించక తప్పదు. సినిమా పరిశ్రమలో సెటిల్ అయ్యాక ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలి. అయితే ఇక్కడ నిర్ణయాలు మా చేతుల్లో వుండవు’ అంటోంది నటి పూనమ్ బజ్వా.

01/27/2016 - 01:41

సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్వి ప్రధాన తారాగణంగా కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ రూపొందిస్తున్న చిత్రం ‘సినీ మహల్’ (రోజుకు 4 ఆటలు). ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను జరుపుతున్నారు.

01/27/2016 - 01:39

ఉత్తమ నటుడు మహేశ్‌బాబు, ఉత్తమ నటి శ్రుతిహాసన్, ఉత్తమ దర్శకుడు రాజవౌళి

మూడు అవార్డులు దక్కించుకున్న రంగీ తరంగ (కన్నడ) దర్శకుడు
అనూప్ భండారి

01/27/2016 - 01:37

నయనతార కథానాయికగా తెరకెక్కిన ‘అనామిక’ సరైన ఫలితాన్ని ఇవ్వని సంగతి తెలిసిందే. ఆ తరువాత దర్శకుడు శేఖర్ కమ్ముల మహేష్‌బాబు హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించాలని సన్నాహాలు చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి తనకు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చిన ‘హ్యాపీడేస్’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు.

01/27/2016 - 01:35

విజయ భరత్, అశ్విని, కాంచన, పృధ్విరాజ్ ప్రధాన తారాగణంగా ఎస్.ఎస్.సెల్యులాయిడ్స్ పతాకంపై జైశ్రీరామ్ దర్శకత్వంలో పోట్నూరు శ్రీనివాసరావు రూపొందించిన ‘వినోదం వంద %’ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది. దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, కిషోర్ రాఠి, అచ్చిరెడ్డి సంయుక్తంగా బిగ్ సీడీని విడుదల చేయగా, పృధ్వీరాజ్ టీజర్‌ను ఆవిష్కరించారు.

01/27/2016 - 01:34

శ్రీ లక్ష్మి నరసింహ సినిమా పతాకంపై మధుమిత, శివ, వరుణ్ ప్రధాన తారాగణంగా నరసింహ నంది దర్శకత్వంలో బూచేపల్లి తిరుపతిరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘లజ్జ’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో బి.గోపాల్, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి సమక్షంలో విడుదల చేశారు.

01/27/2016 - 01:33

‘నేను చేసే పాత్ర ముందు నాకు నచ్చాలి. నటించేటప్పుడు సంతోషం కలగాలి. హీరోయిన్ అంటే అందంగా కనిపించాలి. కానీ ఇపుడు వస్తున్న గ్లామర్ పాత్రల్లో నటించడానికి నేను సిద్ధంగా లేను’ అంటోంది అర్తనా బిను. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్‌తరుణ్, అర్తన బిను జంటగా రూపొందించిన చిత్రం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’.

01/24/2016 - 21:39

దక్షిణాది సినీ పరిశ్రమలో తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఐఫా అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా ప్రారంభమైంది. ఆది, సోమవారాలలో రెండురోజులపాటు జరిగే ఈ వేడుకకు దక్షిణాది సినీతారలు తరలివచ్చారు.
గచ్చిబౌలి ఔట్‌డోర్ స్డేడియంలో అట్టహాసంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల ద్వారా సేకరించిన మొత్తాన్ని ఇటీవల చెన్నైలో వచ్చిన తుపాను బాధితులకు అందజేయనున్నారు. దాదాపు కోటి రూపాయలు విరాళం

01/24/2016 - 21:37

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 100వ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఆయన లేటెస్ట్‌గా ‘ఆదిత్య 369’ సీక్వెల్ రానుందని నందమూరి బాలకృష్ణ స్వయంగా తెలిపారు. ఈ చిత్రం ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడన్న విషయం కూడా ఆయనే తెలిపారు. దీంతో ఈ చిత్రంలో మోక్షజ్ఞ ఎలా కన్పిస్తాడా అనే ప్రశ్న ఆయన అభిమానుల్లో తలెత్తింది.

Pages