S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/19/2016 - 22:17

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ మొదటిసారిగా ఓ హైదరాబాదీ చిత్రాన్ని రిలీజ్ చేయటం విశేషం. ఈ సినిమాలో పాపులర్ అయిన నటుడు అద్నాన్ షాజిద్‌ఖాన్, మస్తాన్ అలీ, ఫిరోజ్‌ఖాన్ హీరోలుగా సయ్యద్ హుస్సేన్ దర్శకత్వంలో యాబా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘దావతె షాదీ’. మాధవి, మనీషా, కావ్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సమీఉల్లా ఫయాజ్ నిర్మాత.

02/18/2016 - 23:17

రామ్‌శంకర్, నికీషాపటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, సురేష్‌వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అరకురోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. సినిమాకు సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

02/18/2016 - 23:14

దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియమణికి ఈ మధ్య అవకాశాలు సన్నగిల్లాయి. గ్లామర్‌తోపాటు నటనలో ప్రతిభను ప్రదర్శించే ఈ భామకు ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దాంతో కన్నడంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోటానికి ప్రయత్నించినా, లాభం లేకపోయింది. ఒకటీ అరా సిమాలు చేసిన ప్రియమణి ప్రస్తుతం సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

02/18/2016 - 23:11

సాయి రోనక్, అదితి సింగ్, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం గుప్పెడంత ప్రేమ. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భభంగా దర్శకుడు వినోద్ మాట్లాడుతూ తొలి ప్రేమ నేపథ్యంలో హృదయానికి హత్తుకునే ఫీల్ గుడ్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.

02/18/2016 - 23:10

వి.సినీస్టుడియో నిర్మాణంలో డి.దివాకర్ దర్శకత్వంలో ఆనంద్ నంద, రేష్మి జంటగా రూపొందిస్తున్న చిత్రం ‘రాణిగారి బంగళా’. ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ వచ్చే నెలలోగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

02/18/2016 - 23:00

రామ్‌చరణ్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం గురువారం

02/18/2016 - 22:57

ఆయాన్, కాంచన జంటగా శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాదరెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ఇట్లు మీ సరోజ. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతు ముగింపు దశలో ఉంది.

02/18/2016 - 22:55

ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పి.సత్యనారాయణరెడ్డి నిర్మిస్తున్న ‘అహం’ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. నూతన కథానాయకుడు నటించనున్న ఈ చిత్రంలో విలన్ పాత్రలో ప్రముఖ నటుడు రాజశేఖర్ నటిస్తున్నాడు. తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్‌కు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. ఆయన నటించిన ‘పట్టపగలు’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

02/18/2016 - 22:53

ప్రముఖ సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు సత్యప్రభాస్ తండ్రి దారిలోనే దర్శకుడిగా మారాడు. ఆయన తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మలుపు’ ఆది పినిశెట్టి, నిక్కీ గర్లాని జంటగా తెర కెక్కిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సత్యప్రభాస్ చెప్పిన విశేషాలు:

02/18/2016 - 22:49

కమెడియన్ ధన్‌రాజ్ పదమూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పనిలేని పులిరాజా’. చాచా దర్శకత్వంలో పాలెపు మీడియా పతాకంపై పి.వి.నాగేశ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ‘్ధన్‌రాజ్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ప్రాచీ సిన్హాతోపాటు నలుగురు హీరోయిన్లు ఉంటారు. ప్రస్తుతం సెన్సార్ జరుగుతోంది.

Pages