S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/14/2016 - 21:02

కామెడీ హీరోగా తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి సరికొత్త టైటిల్స్‌తో ప్రయోగాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘సెల్ఫీరాజా’.

07/14/2016 - 21:00

దర్శకుడు జయంత్ సి.పరాంజి దర్శకత్వంలో నూతన చిత్రం కాళహస్తి ప్రారంభమైంది. ఏపీ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ కథానాయకుడిగా శారద ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో గురువారం ఉదయం జరిగింది. నిర్మాత డి.సురేష్‌బాబు తొలి సన్నివేశంపై క్లాప్‌నివ్వగా, పరుచూరి వేంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు.

07/14/2016 - 20:58

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక నటించిన తొలి సినిమా ‘ఒక మనసు’ చిత్రం ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాతో హీరోయిన్‌గా వెలగాలని అనుకున్న నిహారికకు తీవ్ర నిరాశే ఎదురైంది. దాంతో తన భవిష్యత్ ప్రణాళిక ఏంటనే సందేహంలో వున్న నిహారికకు తాజాగా మరో అవకాశం దక్కింది. ఈమెతో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సన్నాహాలు చేస్తున్నాడు.

07/14/2016 - 20:57

జాతీయ నటుడు కమలహాసన్ ఈరోజు ఉదయం తన ఆఫీసులో కాలుజారి పై అంతస్తునుండి జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలికి గాయమైంది. దాంతో ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు జరిగిన ప్రమాదం గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆసుపత్రివర్గాలు తెలిపాయి.

07/14/2016 - 20:56

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరస సినిమాలతో తనదైన జోరును ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్. వరసగా క్రేజీ అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ భామకు తాజాగా మహేష్ సినిమాలో చాన్స్ దక్కింది.

07/14/2016 - 20:54

‘సమాజంలో ఎక్కడోచోట నేరాలు జరుగుతూనే వుంటాయి. వాటికి అడ్డుకట్టవేయడం ప్రజల ఐక్యతలోనే వుంది అన్న నినాదంతో ‘దండు’ చిత్రాన్ని రూపొందించాం. సామాజిక స్పృహ ప్రతి మనిషికి ఉండాలని, కంటికెదురుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే ధైర్యంతో ప్రతి మనిషి ఎదగాలన్న సందేశంతో ఈ చిత్రం రూపొందింది’ అని దర్శకుడు సంజీవ్ మేగోటి తెలిపారు.

07/14/2016 - 20:52

‘చిత్రం’ సినిమాతో సంచలన దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు తేజకు చాలాకాలంగా సక్సెస్‌లు దూరమయ్యాయి. మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న తేజ..ప్రస్తుతం రానా హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా కాజల్, కేథరిన్ త్రెస్సాలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘చరిత్ర’ అనే టైటిల్‌ను ఇటీవల ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించారు.

07/14/2016 - 20:51

‘కుమారి 21ఎఫ్’ సినిమాతో సంచలనం సృష్టించిన హేబా పటేల్‌కు ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఈమెకు మెగా చాన్స్ దక్కింది. అది కూడా మరో క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ వదిలేసుకున్న అవకాశాన్ని హేబా అందిపుచ్చుకుంది.

07/14/2016 - 20:50

నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ జంటగా ఎస్.ఎస్.సి మూవీ మేకర్స్ సమర్పణలో ఎస్.వెంకటరత్నం తెలుగులో అందిస్తున్న చిత్రం ‘100 డేస్ ఆఫ్ లవ్’. మహ్మద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మలయాళ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న హీరో నితిన్ తొలి సీడీని విడుదల చేసి మరో హీరో నానీకి అందించారు.

07/13/2016 - 22:11

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కలవడం ఎంతో ఆనందాన్నిచ్చిందంటున్నారు ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్. ముంబైలో అమితాబ్ ఇంటికి వెళ్లి కలిశానని, ఆయన ఆప్యాయంగా పలకరించి, ఆదరించడం చూసి ఉబ్బితబ్బిబ్బయ్యాయన్నారు. ఆయనతో కలసి తీసుకున్న సెల్ఫీని ట్విట్టర్ పోస్ట్ చేసి బాలీవుడ్ లెజెండ్‌తో కలసి పంచుకున్న ఆనందాన్ని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Pages