S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/13/2016 - 22:01

సినిమాలు నిర్మించడం ఈరోజుల్లో ఓ సాహసమే. ఎవరైనా సరే లాభాలు లేదా పేరు కోసమో సినిమా తీస్తుండడం సహజమే. తను తీసిన ఎలాంటిదైనా గొప్పదని నిర్మాత భావిస్తాడు. లాభాలు రావాలని ఆశిస్తాడు. అందుకోసం పబ్లిసిటీసహా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఫలితం ముందుగా చెప్పలేం. ఒక్కోసారి లాభాలు తెస్తే ఒక్కోసారి గల్లాపెట్టి ఖాళీగానే ఉండిపోతుంది.

07/13/2016 - 21:52

అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అవార్డులు రివార్డులు అందుకున్న జంట చిరంజీవి-విజయశాంతి. వీరిద్దరి కలయికలో అనేక హిట్ చిత్రాలు విజయఢంకా మ్రోగించాయి. విజయశాంతి, చిరంజీవి వున్నారంటే ఆ సినిమా మినిమమ్ హిట్ అన్నమాటే. అయితే, ‘గ్యాంగ్‌లీడర్’ తరువాత వారిద్దరూ కలిసి నటించిన ‘మెకానిక్ అల్లుడు’ విడుదలయ్యాక ఇద్దరూ కలిసి నటించిన చిత్రం మళ్లీ రాలేదు.

07/13/2016 - 21:50

నూతన నటీనటులు ఎ.రవితేజ, అశ్వినీ చంద్రశేఖర్, భానుశ్రీ, ప్రభాకర్ ప్రధాన తారాగణంగా రెడ్ కార్పెట్ రీల్స్ పతాకంపై ఎస్.జె.చైతన్య దర్శకత్వంలో రవి పచ్చిపాల రూపొందిస్తున్న చిత్రం ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

07/13/2016 - 21:48

నటి హన్సిక ఇటీవల తన చేతికి ఎముక లేదని నిరూపిస్తోంది. దానాలమీద దానాలు చేస్తుండడం కోలీవుడ్ దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటోంది. ఇటీవలే తన దాతృత్వాన్ని మరో సంఘటనతో నిరూపించుకుంది. చెన్నై మహానగరంలో వున్న ఇళ్లు లేనివారికి సామాజిక స్పృహతో తన వంతు సాయం చేస్తోంది.

07/13/2016 - 21:46

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన రోబో చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రజనీ, శంకర్‌ల కలయికలో రోబో-2 అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంపై దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొన్నాయి.

07/12/2016 - 21:06

తెలుగులో రూపొందిన ‘బాహుబలి’ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొంది సంచలన విజయం సాధించి, ఇండియన్ సినిమా చరిత్రలో భారీ వసూళ్లు దక్కించుకుంది. ఇక ఆ సినిమా స్ఫూర్తితో మరిన్ని సినిమాలు తీయడానికి సన్నాహాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎట్టకేలకు ప్రముఖ దర్శకుడు సుందర్.సి చారిత్రక నేపథ్యంలో ఓ భారీ సినిమాకు ప్లాన్ చేసాడు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది.

07/12/2016 - 21:05

హీరో నితిన్ ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి జోరుమీదున్నాడు. ఇష్క్ సినిమాకు ముందు వరుసగా ఎనిమిది సినిమాలు ఫెయిల్యూర్స్ అవ్వడంతో కెరీర్ వెనకపడిపోయినా, కాస్త లుక్ మార్చి ఇష్క్‌తో క్లాస్ సినిమా చేశాడు. దాంతో ఆ సినిమా సూపర్‌హిట్ అయింది. అంతకుముందు మాస్ హీరోగా రకరకాల ప్రయత్నాలు చేసిన నితిన్‌కు ఏవి పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో క్లాస్ బాట పట్టాడు.

07/12/2016 - 21:02

రాధ పెద్దకూతురు కార్తీక త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పబోతుందని సమాచారం, నాగచైతన్య హీరోగా పరిచయమైన ‘జోష్’ సినిమాతో కార్తీక కూడా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడంతో కార్తీక తమిళ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు చేసింది.

07/12/2016 - 21:01

ఎనర్జిటిక్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న రామ్‌కు ఈమధ్య వరుస ఫ్లాపుల తరువాత ‘నేను శైలజ’ కాస్త ఊరటను ఇచ్చింది. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటున్నాడు రామ్. ప్రస్తుతం ఆయన ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి హైపర్ అనే టైటిల్ ఓకే చేశారట.

07/12/2016 - 20:59

సందీప్, విజయభాస్కర్, ఆనంద్, పూజిత, సాగర్ ప్రధాన తారాగణంగా శుభకరి క్రియేషన్స్ పతాకంపై గణమురళి దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్ రూపొందించిన చిత్రం ‘నినే్న కోరుకుంటా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 15న విడుదలకు సిద్ధంచేశారు.

Pages