S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/08/2016 - 20:54

కండల వీరుడు బాలీవుడ్ బాద్‌షా సల్మాన్‌ఖాన్ కన్నా ఒక ఆకు ఎక్కువే చదివానంటోంది ముంబై భామ అనుష్కాశర్మ. గతంలో ఆమె నటించిన అనేక చిత్రాల్లో మంచి మార్కులే వేయించుకుంది. అయితే ఈసారి ‘సుల్తాన్’ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌తోపాటుగా రెజ్లర్‌గా అనుష్కా శర్మ నటించింది. మొదట ఈ పాత్రలో అనుష్కాశర్మ నటిస్తోందంటే అందరూ పెదవి విరిచారు. అనుష్కాశర్మకు ఆ పాత్ర నప్పదని, తేలిపోతుందని వ్యాఖ్యానించారు.

07/08/2016 - 20:53

‘ఝమ్మంది నాదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన గ్లామర్ భామ తాప్సీకి చాలా అవకాశాలు వచ్చినా కూడా తెలుగులో సరైన కమర్షియల్ హిట్‌ని అందుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె, అక్కడ చేసిన మూడు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే తాప్సీకి అనుభవం బాగా వచ్చినట్టుంది. అందుకే ఎక్కడ చూసినా తన అనుభవాన్ని రంగరించి మాట్లాడుతోందట.

07/07/2016 - 21:06

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ నటించిన ‘సుల్తాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. రంజాన్ పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే బాలీవుడ్ కలెక్షన్ల రికార్డును అధిగమించింది. షారుక్‌ఖాన్ నటించిన ‘్ఫ్యన్’ చిత్రం ఇప్పటివరకు తొలిరోజు కలెక్షన్లలో మొదటి స్థానంలో నిలవగా, ‘సుల్తాన్’ చిత్రం ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

07/07/2016 - 21:04

మోడ్రన్ సినిమా బ్యానర్‌పై ఆదిత్య ఓం స్వీయ దర్శక నిర్మాణంలో విజయ్ వర్మ పాకలపాటి నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. సోషల్ మీడియా బ్యాక్‌డ్రాప్‌పై రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆదిత్య ఓం ప్రత్యేక పాత్రలో నటించారు. రోహిత్, ప్రకాష్, శీతల్, రిచాసోని, సాగరిక ఛైత్రి, మనీషా కేల్‌కర్, నితేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

07/07/2016 - 21:02

వరుస హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న నాని ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యంత ఆదరణ కలిగిన మీడియం చిత్రాల హీరోగా వెలిగిపోతున్నాడు. మంచి సబ్జెక్టుతో నానితో సినిమా తీస్తే అది ఖచ్చితంగా పెట్టుబడికి రెండింతలు దాటేస్తుందని ఇండస్ట్రీ వర్గాలే కాదు.. ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నాయి. కాగా విజయాలతో వున్న ఈ హీరోకు మరో సెంటిమెంట్‌ను జోడిస్తున్నారు దర్శక నిర్మాతలు.

07/07/2016 - 20:59

‘సినిమా పోస్టర్లు చూసి ఇది అదో టైపు సినిమా అని అందరూ అనుకుంటున్నారు. కానీ, ఇది కుటుంబ ప్రేక్షకులందరూ కలిసి చూడదగిన సినిమా. ఇప్పటికే అన్ని కేంద్రాలలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. భారతీయుడు, అపరిచితుడు, ఆపరేషన్ దుర్యోధన లాంటి చిత్రాలతో పోల్చి ఈ సినిమాను ఆదరిస్తున్నందుకు సంతోషంగా వుంది’ అని దర్శకుడు భానుశంకర్ చౌదరి తెలిపారు.

07/07/2016 - 20:57

‘బిచ్చగాడు’ చిత్రంతో కలెక్షన్ల పరంగా ఓ కొత్త ఒరవడిని సృష్టించిన హీరో విజయ్ ఆంటోని తెలుగులో ఇప్పుడు టాప్‌స్టార్ అయ్యాడు. సంగీత దర్శకుడిగా తమిళనాడులో కెరీర్ ప్రారంభించిన ఆయన హీరోగా మారి వరుసగా చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. గతంలో ఆయన హీరోగా నటించిన ‘డా.సలీం’ అనే సినిమాతో తెలుగులో మంచి పేరునే తెచ్చుకున్నాడు.

07/07/2016 - 20:55

మాస్ హీరోగా చిత్రాలు చేస్తున్న గోపీచంద్, తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆక్సిజన్’. డిఫరెంట్ యాక్షన్ జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం తరువాత గోపీచంద్ సంపత్‌నంది దర్శకత్వంలో మరో మాస్ ఎంటర్‌టైనర్‌లో నటించనున్నాడు. ‘శంఖం’, ‘రెబెల్’ చిత్రాలు రూపొందించిన శ్రీ బాలాజీ సినీ మీడియా జె.పుల్లారావు, జె.్భగవాన్ నిర్మాతలుగా భారీ బడ్జెట్‌లో రూపొందించనున్నారు.

07/07/2016 - 20:53

రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ కథానాయకుడు విష్ణు హీరోగా మన్ననలు అందుకుంటున్నాడు. పక్షవాతానికి గురైన ఓ నిరుపేద జర్నలిస్టు జీవితానికి కొత్త ఆశలు చిగురింపజేశారు. దుర్గాగౌడ్ అనే పాత్రికేయుని ఆరోగ్యం కోసం ఆయన సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. పక్షవాతంతో మంచంపట్టి చావుబతుకులతో పోరాడుతున్న పాత్రికేయుని కష్టాలను ‘నేను సైతం’ కార్యక్రమం తెరపైకి తెచ్చింది.

07/07/2016 - 20:51

తెలుగు కథానాయిక అంజలికి తమిళంలో ఎంతో క్రేజ్ వుంది. ఈమధ్య తెలుగులో కూడా మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామకు ఎ.ఆర్.మురగదాస్ తెరకెక్కించిన ‘జర్నీ’ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. కథానాయకుడు జై, అంజలికి ఆ చిత్రంతో మంచి పేరొచ్చింది. ఇపుడు ఈ ఇద్దరు కలిసి మరో చిత్రం కోసం జతకట్టారు. వారిద్దరి సినిమా నేడు సెట్స్‌పైకి వెళ్లింది.

Pages