S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/23/2016 - 02:21

నాగశౌర్య, నిహారిక జంటగా టీవీ9 సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామరాజు దర్శకత్వంలో మధురా శ్రీధర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘ఒక మనసు’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని నేడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు రామరాజు చెప్పిన విశేషాలు...

06/21/2016 - 21:09

ప్రఖ్యాత తెలుగు సినీ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ కుమారుడు వరా ముళ్లపూడి. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని రచయితగా, దర్శకుడిగా సినిమాలు, సీరియల్స్ చేస్తూ వస్తున్నారు. గతంలో ‘నా అల్లుడు’, ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వరా, తాజాగా ‘కుందనపుబొమ్మ’ సినిమాతో ముందుకు వస్తున్నారు. ఈనెల 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా వరా ముళ్లపూడి చెప్పిన విశేషాలు..

06/21/2016 - 21:07

చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ షూటింగ్ మరో రెండు రోజుల్లో స్టార్ట్ అవుతోంది. జూన్ 23 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డే, ఫస్ట్ షాట్ చిరంజీవి మీదే తీస్తున్నారట. ఈ సినమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్ వేశారు. అందులో ఫస్ట్ డే షూటింగ్, నెక్స్ట్‌డే 24న హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌మీద ప్లాన్ చేశారని తెలిసింది.

06/21/2016 - 21:04

రెడ్ కార్పెట్ రీల్స్ పతాకంపై ఎస్.బి.చైతన్య దర్శకత్వంలో రవి పంచపాల రూపొందిస్తున్న చిత్రం ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’. ఎ.రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం గూర్చి దర్శకులు చైతన్య మాట్లాడుతూ, ఈ పేరు వినగానే అందరూ కాంట్రొవర్షియల్ టైటిల్ అనుకున్నారని, సినిమా చూశాక పాజిటివ్‌గా ఫీల్ అవుతారని, చక్కటి ప్రేమకథతో ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్నారు.

06/21/2016 - 21:02

పాపులర్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘అఖీరా’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. బాలీవుడ్‌లో ‘గజినీ’, ‘హాలిడే’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మురుగదాస్, అక్కడ తన మూడో ప్రయత్నంగా ‘అఖీరా’ అనే సినిమాను తెరకెక్కించారు. సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను మురుగదాస్, మరో దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో కలిసి నిర్మించారు.

06/21/2016 - 21:01

శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్, మారుతి టాకీస్, గుడ్ సినిమా పతాకాలపై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు రూపొందించిన ‘రోజులు మారాయి’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూలై 1న విడుదలకు సిద్ధమైంది.

06/21/2016 - 20:59

రణధీర్, రుక్సార్‌మీర్ జంటగా కాంచి దర్శకత్వంలో రమా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ రూపొందిస్తున్న చిత్రం ‘షోటైమ్’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజవౌళి టీజర్‌ను విడుదల చేసి ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, పోస్టర్, టీజర్ ఆసక్తికరంగా వున్నాయని, ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

06/21/2016 - 20:58

వెంకటేష్, నయనతార జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి, పి.డి.వి.ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘బాబు బంగారం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఒక్క పాట మినహా టాకీపార్ట్ పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ, ఇటీవల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశామని, ఆడియోను వచ్చే నెల 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

06/21/2016 - 20:56

వరుస సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోన్న రెజీనా, ఇప్పటివరకూ ఎక్కువగా గ్లామర్ పాత్రలనే మెప్పిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఆమె తన కొత్త సినిమాలో ఓ సరికొత్త పాత్రలో, తన శైలికి భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కే రొమాంటిక్ థ్రిల్లర్‌లో హీరోయిన్‌గా నటించనున్న రెజీనా, ఆ సినిమాలో ఓ దెయ్యంగా కనిపించనున్నారట.

06/21/2016 - 20:54

సునీల్, మన్నార్ చోప్రా జంటగా ఆర్.పి.ఎ క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘జక్కన్న’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

Pages