S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/13/2016 - 21:45

వయసు పెరుగుతున్నా ఇప్పటికీ హీరోయిన్‌గా క్రేజ్ ఉన్న రమ్యకృష్ణకు ‘బాహుబలి’ సినిమాతో సంచలన విజయం దక్కింది. శివగామిగా ఆ పాత్రలో నటించి ఆకట్టుకున్న రమ్యకు ఇప్పుడు దక్షిణాదిలో అవకాశాల జోరు ఎక్కువైంది. ఇప్పటికే నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా హిట్ కూడా తన ఖాతాలో వేసుకున్న రమ్యకృష్ణకు ఇప్పుడు అవకాశాల జోరు పెరగడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్టు తెలిసింది.

02/12/2016 - 21:03

నూతన తారలతో ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’. సాయిరోనక్, అతిథిసింగ్, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్ హైదరాబాద్‌లో విడుదల చేశారు.

02/12/2016 - 21:01

యూత్‌లో మంచి ఫాలోయింగ్ వున్న నటుడు అల్లు అర్జున్. సినిమా సినిమాకూ తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంటూ స్టార్ హీరోగా నిలబడ్డాడు. ఇటీవలే సౌత్ ఇండియాలోని క్రేజీ హీరోగా ఫేస్‌బుక్‌లో సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరైనోడు’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న సినిమాలో మరో విశేషం వుంది.

02/12/2016 - 21:00

ప్రముఖ నటుడు వెంకటేష్ ఇటీవలే నటించిన ‘దృశ్యం’ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు ఆయన దృష్టి రీమేక్ సినిమాలపై పడింది. దృశ్యం సినిమా కూడా మలయాళ హిట్ ‘దృశ్యం’ చిత్రానికి రీమేక్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’ చిత్రంలో నటిస్తున్న వెంకటేష్, మరో రీమేక్ కోసం సన్నాహాలు చేస్తున్నారు.

02/12/2016 - 21:00

‘నేనో పెద్ద అందగత్తెనని, నటనలో అన్ని అవార్డులు తీసుకోవడానికి వచ్చానని, సరైన పాత్రలు అంటే, నటించడానికి స్కోప్ వున్న పాత్రలు రావడంలేదని నేను అసలు అననే అనను’ అంటోంది రకుల్ ప్రీత్‌సింగ్.

02/12/2016 - 21:04

నూతన నటీనటులతో వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు శివ నేతృత్వంలో మళ్ల విజయప్రసాద్ రూపొందిస్తున్న చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ, యువతకు సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తున్నామని తెలిపారు.

02/12/2016 - 20:58

దక్షిణాది భాషల్లో టాప్ హీరోయిన్‌గా ఫాలోయింగ్ సంపాదించుకున్న గ్లామర్ భామ కాజల్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. దాదాపు పది సంవత్సరాలుగా క్రేజీ హీరోయిన్‌గా వున్న ఈ భామ ఇనే్నళ్లు కొనసాగడానికి కారణమేంటనే సీక్రెట్‌ని బైటపెట్టింది. కథానాయికగా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో ఎవరు కథ చెప్పినా వినేదాన్నని, దానివల్ల ఫలితమెలా వున్నా అనుభవం మాత్రం వచ్చిందని చెబుతోంది.

02/12/2016 - 20:57

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం షూటింగ్ జోరుగా జరుపుకుంటోంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే కేరళలో అందాల భామ కాజల్, పవన్‌లపై ఓ పాటను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్‌లో ప్రస్తుతం కామెడీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

02/12/2016 - 20:57

జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకుని విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న నటుడు కమల్‌హాసన్. లోకనాయకుడిగా పేరు తెచ్చుకున్న కమల్‌కు ఎప్పటినుంచో ఓ కోరిక వుందని అర్థమవుతోంది. ఆ కోరిక ఏంటంటే, హాలీవుడ్ సినిమాలో నటించడం. ఈమధ్య భారతీయ నటులు హాలీవుడ్‌లో కూడా తమ హవాను సృష్టించుకుంటున్నారు. తాజాగా కమల్ కూడా ఓ సినిమాకు శ్రీకారం చుట్టారని తెలిసింది.

02/11/2016 - 23:28

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఉస్తాద్ హోటల్’ చిత్రాన్ని తెలుగులోకి ‘జతగా’ పేరుతో విడుదల చేస్తున్నారు. పలు హిట్ చిత్రాల్ని అందించిన సురేష్ కొండేటి నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు చెప్పారు.

Pages