S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

10/30/2016 - 00:12

ఉదయగిరి దుర్గానికి దక్షిణం వైపునున్న దుర్గంపల్లె గ్రామమది. నరసయ్యకు కొండ చరియల మధ్య పాతిక సెంట్ల భూముంది. అందరిలాగే కొండవాగు నీళ్లతో కూరగాయలు పండిస్తాడు. నరసయ్య పెళ్లాం పండ్లు కోయడానికో, పిట్టల్ని పట్టడానికో, కట్టెలు కొట్టడానికో అడవికి పోతే, నరసయ్య పొలం పండిస్తూ సీజన్లో కూరగాయలు గంపనెత్తిన పెట్టుకుని ఉదయగిరి గ్రామంలో వీటిని అమ్ముకుని అంతో ఇంతో తెస్తుంటాడు.

10/30/2016 - 00:10

ఎముకలు కొరికే హిమపవనాలు
గగనపు ఛత్ర ఛాయలో
అనుకోని ఆపదలా వచ్చే తుహిన తుఫానులైన
వేడిగాలులు విరజిమ్మే ఎడారులైన
కదనానికి కవ్విస్తూ
వికృత చేష్టలు చేసే వైరిసేనకు
వెన్నులో వణుకు పుట్టిస్తూ
వగవక, వెరవక
కార్యదీక్షాపరుడవై
తలిదండ్రుల మమతలను
భార్యాబిడ్డల ప్రేమానురాగాలను
ఎదగదిలో పదిలపరిచి
బ్రహ్మచారిలా జీవిస్తూ

10/30/2016 - 00:06

నవ భారతాన్ని కలలుగనే
చిన్నారుల కళ్లల్లో
వెలుతురు నింపుదాం రండి..

పోయిన దీపావళికి అనుకున్నా
వారి గుండెళ్లో వెలుగు నింపాలని
జానెడు పొట్ట నింపుకోలేక
చీకటిలో మగ్గుతున్న జీవితాలకి
మతాబునై వెలుగునవ్వాలని కోరుకున్నా
శ్రమజీవుల నుదుట లక్ష్మీరాత లేదేమిటాని
లక్ష్మీబాంబు పేల్చి
మరీ సమాధానం కోసం ఎదురుచూసా..

10/30/2016 - 00:03

మధ్యతరగతి కుటుంబాల ఆలోచన విధానాలే కథాంశంగా తీసుకుని రచయిత రాయప్రోలు లక్ష్మీ రామకృష్ణ గారు రాసిన నవ్యచైతన్యం కథ బాగుంది. కథలోని పాత్రలు సులోచనమ్మ, నాగమ్మ, చంద్రం, గంగయ్య పాత్రలను ఎంతవరకు వాడుకోవాలో అంత పరిధి మేరకు వాడుకోవడం, రచయిత చెప్పదలచుకున్న విషయాన్ని చక్కగా చెప్పిన విధానం బాగుంది. నిజంగా ఈ స్థలాల గోల, ఇళ్లు కూల్చివేయడాలన్నీ మధ్యతరగతి ప్రజలు నిత్యం ఎక్కడో ఓ చోటు అనుభవిస్తున్న నిత్యకృత్యాలు.

10/23/2016 - 04:20

అతులిత బలరాముడు, ఆడినమాట తప్పనివాడు అందరికీ అండగా నిలుచువాడు ఇలా వింటూంటే ఆ తల్లి ఎంతో గర్వపడిపోతోంది.
అది ఒక సభ, ఆ సభలో అనేకానేక విద్యలు నేర్పిన ఆరితేరిన వారి గురించి ప్రస్తావనలు వచ్చాయి. ఆ నిండు సభలో, జనం నిండిన సభా ప్రాంగణంలో మెల్లగా మూలనక్కిన నాగమ్మ ఇదంతా గమనిస్తోంది.

10/17/2016 - 22:01

‘‘ఒరేయ్ వెధవకాన’’ అంటూ రాంబాయమ్మగారు వీపుమీద చరిచేసరికి ఉలిక్కిపడ్డాడు రాంబాబు. ‘ఏం చేస్తున్నావురా వెధవ నీకెన్నిసార్లు చెప్పానురా పొద్దునే ఆ తెల్లకాగితాలు టేబుల్ మీద వేసుకు కూర్చోవద్దని వెధవ... చవటా... ఛీ ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధిరాదురా’ అంటూ అపర కాళికలా విజృంభించింది రాంబాయమ్మ. ‘అబ్బ బామ్మ ఈ ఒక్కసారికే లేవే...

10/17/2016 - 21:58

పొత్తిళ్లలో ఉన్ననాడు ఉగ్గుపాలతో
అమ్మ చెప్పిన దేశభ క్తుల కథలు విని ఉత్తేజితుడవై
దేశం కోసం నేనూ ఒకడినంటూ సైన్యంలో చేరి పహారా కాసే
సైనికుడా.. వందనం
నిత్య శ్రామికుడా నీకు వందనం
లాలి లాలించూ
జోలపాటతో నిద్రబుచ్చవద్దంటూ
భరత మాత రక్షణకు
మన కర్తవ్యం ఏమిటో
బోధించమని ఊయలలో
పడుకో బెట్టినప్పడు అమ్మను అడిగి

10/17/2016 - 21:53

మెరుపులో ప్రచురితమైన బంగారు కథ చాలా బాగుంది. ఎంత బాగా బతికినా మనం వేసే అడుగుల్లో ఒక్క తప్పటడుగు జీవితాన్ని కకావికలం చేస్తుంది. ఇలాంటి ఓ కథను ఎంచుకుని చక్కగా ఆవిష్కరించిన రచయిత ఆలకుంట రెడ్డిప్రసాద్ గారికి ధన్యవాదములు. గొప్పగా యువరాణిలా పెరిగిన బంగారు జీవితం చివరికి ఎలా బుగ్గిపాలయ్యింది.

10/09/2016 - 06:53

హఠాత్తుగా మెలకువ వచ్చింది నాకు. ఏదో స్టేషన్‌లో ఆగినట్లుంది రైలు. వేసవికావడంతో బాగా దాహంగా అనిపించింది. బెర్త్‌పై లేచి కూర్చుని వాటర్‌బాటిల్ మూతతీశాను. కొంచెమే నీళ్లున్నాయి. ఆ కాసిని తాగి అప్పుడే నిద్ర లేచి నా వంక చూస్తున్న ఎదురుబెర్తు ఆవిడకు, కొంచెం నా పెట్టె చూడమని చెప్పి, భుజానికి బ్యాగు తగిలించుకుని, మంచినీళ్ల సీసా పట్టుకుని కంపార్ట్‌మెంట్ డోర్ దాకా వచ్చాను.

10/02/2016 - 01:08

ఆమె ఒంటరిగా తన భవితను గూర్చి ఆలోచిస్తూ నడుస్తూ వుంది. చిన్నప్పటి నుంచి హాస్టల్‌లో ఉండి కష్టపడి ఉన్నత చదువులు చదివిన ఆమె ఉద్యోగం కోసం పట్టుదలగా ప్రయత్నిస్తోంది. ఒక వైపు పేదరికం, నిరుద్యోగం, మరోవైపు పెళ్లి వయసు దాటిపోతూ ఉండటం. ఇవన్నీ తనను వెంటాడుతున్న సమస్యలు. వీటన్నింటినీ మించి అంగవైకల్యంతో ఉన్న చెల్లెలు. ఇన్ని సమస్యలతో సతమతవౌతోంది మమత.

Pages