S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

09/26/2016 - 21:09

వినతి చేస్తుందే గాని
వీరోచిత పోరాటాలు చెయ్యదు
ఇబ్బందులెన్నైనా భరిస్తుంది గాని
విద్యుక్త్ధర్మాన్ని వీడదు...
ఇంటి పోషణ భారాన్ని
భుజాలపై మోస్తూ
కాలాన్ని గడుపుతున్న
ఓ... ఇల్లాలు ఆమె!
పట్నంలో విధులు
రోజూ ప్రయాణం..
రెండు మైళ్ల దూరమైనా
నరక లోగిళ్లు దాటుతున్నట్లు
కలవరపడని రోజు లేదు!
ఇల్లు వదిలి
రోడ్డుపై అడుగిడగానే

09/26/2016 - 21:05

‘‘అబ్బ! ఆపరా బాబు నీ సుత్తి!’’
నాకేసి నమిలి మింగేసేలా చూస్తూ కృష్ణమూర్తి అలా అంటుంటే ఒళ్లు మండిపోయింది నాకు.
మండదామరి?!
పోనీలే స్నేహితుడు కదాని, వాడి బాగుకోరి బోల్డంత ఎనర్జీ వేస్ట్ చేసుకుని నోరు నొప్పెట్లేలా హితబోధ చేస్తే.. వెధవకది సుత్తిలా అనిపించిందంటే - ఒళ్లు మండకుండా ఎలా ఉంటుంది?

09/26/2016 - 21:02

జత లేదు..
మతి లేదు
గతి లేదు
క్రుంగెను హృదయం
చెదిరెను మనసు
రాలెను ఆశ
బాంధవ్యం కనుమరుగై
సంఘజీవనం వగరై
చాంచల్యం మెరుగయ్యెను
సంతాన స్పర్శకై చెయి చాపెను
ఒంటరియై వెక్కి వెక్కి ఏడ్చెను
ఆశ్రమాల దారి పట్టెను
కరుణ లేని బిడ్డలు
కఠినమైన మనసులు
కాటికెళ్లు కాయములు
మేను ఆవిరైనా
ఆత్మలో అవే అవే తలపులు

09/18/2016 - 18:25

‘రాములూ ఎలాగుందయ్యా..’
‘ఏం చెప్పమంటావు శీనయ్య.. మనబోటోళ్లకి నాలుగువేళ్లు నోటిలోకి వెళ్లడమే కష్టమాయే.. దానికితోడు రోగాలొకటి’ ఖళ్ ఖళ్ అంటూ దగ్గుతూ సమాధానం చెప్పాడు రాములు.
‘బాగున్నారా అన్నయ్య గారూ’ అంటూ వెనుకనుంచి సుభాషిణి అన్న మాటలకు అటువైపు తలతిప్పి చూశాడు శీనయ్య. తోటి ఉద్యోగి కష్టాల్లో ఉంటే చూడడానికి రాములు ఇంటికి శీనయ్య వచ్చాడు.
***

09/11/2016 - 07:10

అంగరాజ్యానికి రాజు అభినవ గుప్తుడు. అభినవ గుప్తుని అభ్యుదయ భావాలన్ని అమలైతే అంగరాజ్యం, వంగ కళింగ మగధ మాళవ సౌరాష్ట్రాది ఛప్పన్న యాభైయారు రాజ్యాలకంటె మిన్నగా వెలుగొంది, ప్రపంచానికి ధృవతారగా విశ్వవిఖ్యాతి పొందుతుంది. అదే ఆయన జీవితలక్ష్యం, పరమార్థం కూడ. ఆయనే కాదు, అంతకుముందు రాజులు కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగారు. వాళ్ల వేగాన్ని అందుకోలేక ప్రజలు వెనుకపడ్డారు.

09/05/2016 - 03:24

ఓ కవీ..నువ్వు ధన్యజీవివి
నీ భావాలను సొగసైన రెక్కలుగా చేసుకుని
సాహిత్యమనే ఆకాశంలో ఎగరగలవు
అంచులూ చూడగలవు.
నీ భావాలను
బలమైన చేతులుగా మార్చుకుని
సాహిత్యమనే సముద్రంలో ఈదగలవు
లోతులూ చేరగలవు
నీ భావాలను ముచ్చటైన లిపిగా మార్చుకుని
అందమయిన ఈ సృష్టినే చూపగలవు
అందరినీ అలరించగలవు.
ఓ కవీ! నీ కలం
ఆ విద్యాదేవి హస్తాన విరిసిన కమలం

09/05/2016 - 03:20

డాక్టర్ మధుకర్ కారు సడన్ బ్రేక్‌తో ఆగిపోయింది. ఏమై ఉంటుంది కారుకి. ఈరోజే పెట్రోలు ఫుల్ చేశానే మరి ఎందుకు ఆగి ఉంటుంది తెలీడం లేదు. బయట భోరున వర్షం. ఆ వర్షం కారణంగా కరెంట్ కూడా లేదు. మెకానిక్ మస్తాన్‌కు ఫోన్ చేస్తే వెళ్లడం లేదు. కారు దిగి తనకు తోచిన రిపేర్లు చేశాడు డాక్టర్ మధుకర్. ఊహు కారు నడవడానికి మొరాయిస్తోంది. ఇక చేసేదేమి లేదు వర్షం వెలిసే వరకు ఎక్కడైనా నిలబడాలి అంతే తప్ప మరోదారి లేదు.

09/05/2016 - 03:26

ప్రతులకు
గురుబ్రహ్మ వేణుగోపాలస్వామి
చరవాణి : 9490916869
***

09/05/2016 - 03:15

ఆకాశంలో మేఘాలతో విహరిస్తున్నాను
పాతాళంలో నిధిగా నిక్షిప్తపై వున్నాను
భూమిపై బాటసారిగా నడక సాగిస్తున్నాను
నేనుంటేనే ఏ గ్రహానికైనా జీవశక్తి
నేను లేని చోటు జీవరాశులకు ప్రాణవిముక్తి
చెట్టుకైనా..చేనుకైనా..పక్షికైనా..పశువుకైనా..
మనిషికైనా..మహోన్న శక్తికైనా..నేనే జీవనాధారం
నిరంతరం నడక సాగిస్తూనే ఉంటాను
ఆగితే నా కాళ్లు నొప్పెడతాయి

09/05/2016 - 03:07

గత వారం మెరుపులో ప్రచురించిన నగరానికి ఆవల కథ చాలా బాగుంది. మెరుపులో చాలాకాలం తర్వాత ఓ మంచి ఆసక్తికరమైన కథను చదవామన్న భావన కలిగింది. రచయిత కె రవిశేఖర్ విభిన్న కోణంలో ఆలోచించి కథను నడిపిన తీరు రక్తికట్టింది. బాంబుపేలుళ్లలో మరణించిన వారు దేహంపై ఉన్న భ్రాంతితో ఇంకా జీవించి వున్నట్లే చూపిన ప్రయత్నం బాగుంది. వారి సంభాషణలు అంతా కొత్తగా సాగాయి.

Pages