S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

06/27/2016 - 22:23

గత వారం మెరుపులో పెండ్యాల గాయిత్రి గారు అద్భుతంగా మలిచిన కథ సారీ వాస్తవ దృశ్యరూపం ఎస్కార్టు. ఈ కథ చదవడానికి పెద్దదిగా వున్నా చదువుకుంటూ పోతే అప్పుడే అయిపోయిందా అన్నట్లు అనిపించింది. ముఖ్యంగా రచయిత ఎంచుకున్న విషయం ఎంతో గొప్ప అంశం. ముఖ్యంగా కథలను పలు రకాలుగా రాస్తూ వుంటారు కవులు. అయితే ప్రత్యేకంగా వికలాంగులపై మాత్రమే కథ రాయాలనే తలంపే ఈ కథ విజయానికి కారణం.

06/19/2016 - 08:05

మనిషి జీవితంలాంటిదే రైలు ప్రయాణం కూడ. బతుకుబండి నడవాలంటే ఎన్ని స్థాయిలు మారాలో ఈ రైలుబండిలోనూ అన్ని స్థాయిలున్నాయి. ఏ.సి. నుంచి జనరల్ దాక.

06/05/2016 - 06:24

కుండపోతగా కురుస్తున్న వర్షంలో గొడుగు వేసుకుని మరీ వచ్చిన శేషగిరిని చూసి నేనాశ్చర్యపోయాను.
‘‘ఇంత వర్షంలో వచ్చావేంట్రా? రారా!’’ అంటూ ఆహ్వానించాను, ఉబుసుపోక తిరగేస్తున్న ‘పోసుకోట పిట్ట’ తెలుగువీక్లీని పక్కన పడేసి..
శేషగిరి గొడుగు గుమ్మానికి ఆనించి, చెప్పులు విడిచి లోనికి ప్రవేశించాడు.

05/29/2016 - 23:42

ఆరుబయట వెల్ల్లకిలా పడుకొని ఆకాశం వైపు ఆనందంగా చూస్తున్న పాండురంగానికి అసంఖ్యాక నక్షత్రాల మధ్య పుచ్చపువ్వులాంటి వెనె్నల వెదజల్లుతూ, పైకెగబాకుతున్న పూర్ణచంద్రుడు కన్పించేసరికి, చిన్నప్పుడు వాళ్లమ్మ పాడుతున్న పాట గుర్తుకొచ్చింది. ‘‘చందమామ రావే.. జాబిల్లిరావే! కొండెక్కిరావే-కోటివేలు తేవే’’ అంటూ ఏవేవిటో తెచ్చి మా అబ్బాయికివ్వవే అని పాడేది.

05/22/2016 - 22:29

ఫిల్మ్‌నగర్‌లో డింగ్‌డాంగ్ సినిమా ప్రొడక్షన్ ఆఫీస్ నూతన వధువులా ముస్తాబై ఉంది. కారణం మరికొద్ది సేపటిలో అక్కడ నూతన నటీనటుల ఎంపిక జరగబోతోంది. నెత్తిన కౌబోయ్ టోపి, చేతిలో స్మోకింగ్ పైప్ కూలింగ్ గ్లాసెస్, బ్లాక్ సూట్లో జంబులింగం. తను తీయబోయే ‘హాంఫట్’ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అన్నీ అతనే. ఆ సినిమాకి కోడైరెక్టర్ కోటిలింగం.

05/15/2016 - 05:28

సాయంత్రం 6 గంటలయ్యింది. తిరుపతిలో నా పనులు అన్నీ పూర్తి చేసుకొని మా ఊరు రామచంద్రాపురానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండులోకి వచ్చాను. అప్పుడే మా ఊరిమీదుగా కాసీరావుపేటకు వెళ్లే బస్సు 32వ ప్లాట్‌ఫారం వద్దకు వచ్చి ఆగింది. ఆ బస్సు ఎక్కి కిటికీ వద్ద కూర్చున్నాను. అప్రయత్నంగా వెలుపలికి చూశాను. ఒక అందమైన అమ్మాయి ఎవరో వెంట పడుతున్నట్లుగా వచ్చి నా పక్కన కూర్చుంది.

05/08/2016 - 04:51

సుధకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. టైమ్ చూస్తే 7 గంటలైంది. ‘ఏమిటి ఇవాళ ఇంత నిద్రపట్టేసింది’ అనుకుంటూ బ్రష్ తీసుకుని బాత్‌రూంలోకి పరిగెత్తింది. ఫ్రిజ్‌లోంచి పాలు తీసి కాఫీ కలుపుకుని తాగింది. పనిమనిషి లక్ష్మి రోజూ 6 గంటలకే వస్తుంది. ఇవాళ ఇంకా రాలేదేంటబ్బా.. అనుకుంటూ గబగబా కుక్కరు పొయ్యిమీద పెట్టింది. ఇంతలో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన భర్త వినయ్ తిరిగి వచ్చాడు. అతనికి కూడా కాఫీ కలిపి ఇచ్చింది.

05/01/2016 - 05:05

క్లాసులో అటెండెన్స్ తీసుకోవడమయ్యాక, ప్రారంభించే ముందు అటెండరు గోపాలం సర్క్యులర్ పుస్తకం తీసుకొచ్చాడు. అప్పటివరకు గుసగుసగా మాట్లాడుతున్న విద్యార్థులు నిశ్శబ్దంగా మారిపోయారు.

04/29/2016 - 08:08

సూళ్లూరుపేట, ఏప్రిల్ 28: ఒకప్పుడు బంగాళాఖాతానికి తూర్పు వైపున చీమలు దూరని చిట్టడవిలో చిరుదీవిలో ఉన్న శ్రీహరికోట నేడు రాకెట్ ప్రయోగాలకు గుండెకాయలా మారింది. అంతరిక్ష ప్రయోగాలకు రాచబాటగా మారి అంతరిక్షంలో కోట నిర్మించుకునేందుకు మన శాస్తవ్రేత్తలు ఎదిగారు. విదేశాలకు దీటుగా భారీ ప్రయోగాలకు శ్రీహరికోట వేదికయింది.

04/24/2016 - 06:04

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ‘నిమ్మనపల్లి’ ప్రాంతంలో నున్న, ‘బాహుదానది’ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఏరు పసిపిల్ల లాంటిది. ఎంతవద్దన్నా ప్రవహిస్తుంది. పిల్లపిల్ల అలలతో అలరారుతూ నవ్వుతూ తుళ్లుతూనే ఉంటుంది. స్వచ్ఛంగా ప్రకృతిని పలకరిస్తుంది. అక్కడున్న వారి హృదయాలను తట్టి పలకరిస్తూనే ఉంటుంది. ఎవరిమీదా కోపం చూపడం తెలియనిది. ఎవరు కాళ్లు పెట్టినా సుతారంగా పలకరిస్తుందే తప్ప!

Pages