S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

04/17/2016 - 23:42

ఏదీ...
అలనాటి మేటి సఖ్యతారాగం
అసమాన త్యాగం
మూగబోయినదా!
ఏది..
జాతి కోసం.. నీతి కోసం
సర్వజనుల సౌభ్రాతృత్వం కోసం
కంకణబద్ధుడయిన మహనీయుడేడి?
ఎక్కడా?
పేదవాడి ఆకలితీర్చి
నేనున్నానని అక్కున జేర్చి
చేయూతనిచ్చే మనసున్న మనిషేడి?
మానవత మాయమవుతున్న వేళ
మనిషి మనిషికీ మధ్యన
ద్వేషపు తెరలు కోటగోడల్లా నిలిచి

04/17/2016 - 23:38

జంబులింగం, బోడిలింగం బాల్యమిత్రులు, బాల్య మిత్రులు. ఏదో తంటాలు పడి పట్ట్భద్రులయ్యారు. బతుకు దెరువుకోసం ఆఫీసుల మెట్లు లెక్కపెట్టలేక విసిగివేసారి అరిగిన చెప్పులను ముందేసుకొని లబోదిబోమని సొంతంగా ఏదన్నా చేయాలన్న ఉద్దేశంతో ఓ నిర్ణయానికి వచ్చారు. ధనవేటలో వారు వాడిన తూటా నెంబరు -1 డింగ్‌డాంగ్ సాహితీ సంస్థ. అధ్యక్షుడుగా జంబులింగం, ప్రధాన కార్యదర్శిగా బోడిలింగం.

04/17/2016 - 23:35

గత వారం మెరుపులో ప్రచురితమైన యుద్ధ శాంతి కథ చాలా భిన్నంగా సాగింది. రచయిత పిడుగు పాపిరెడ్డి గారి పెళ్లామంటే నువ్వేనే కథ తరువాత అంత బాగా నచ్చిన కథ యుద్ధశాంతి. కథలో భాస్కరరావు, సమీర పాత్రల సంభాషణలు, చిత్రీకరణ చాలా అద్భుతం అనకుండా ఉండలేమండి. నిత్యం చాలామంది ఇళ్లల్లో జరిగే సంఘటనలకు ఈ కథ అద్దం పట్టింది. గతలో కాస్త శృంగార పాళ్లు, కాస్త ఆవేదన, వాస్తవిక కోణం ఇలా అన్నింటిని వండి వార్చిన తీరు సూపర్.

04/10/2016 - 07:15

కాలం మారిపోయింది
ఆశలు అడుగంటి పోయాయి
కోరికలు కొడిగట్టిపోయాయి
అక్షరం అన్నం ముద్దవుతుందనుకొన్నాను
కళ్లల్లో దీపాలు వెలిగించి
పుస్తకాల్లో బ్రతుకు చిత్రాన్ని వెతుకున్నాను
జీవితంలో ఎన్ని ఆశ్చర్యార్థాలు
జీవన సమయంలో కామాలే తప్ప
పుల్‌స్టాపులు ఉండవనుకొన్నాను
మార్కులు తగ్గినపుడు పంతులు గారు
గోడ కూర్చీ వేయిస్తే సిగ్గుతో తలవంచుకున్నాను

04/08/2016 - 02:14

నెల్లూరు, ఏప్రిల్ 7: పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నా ఇంకా చంద్రబాబు ‘ఆకర్ష్’లతో ఇతర పార్టీల నేతలకు ఎందుకు గాలం వేస్తున్నారో అర్థం కావడం లేదని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

04/06/2016 - 04:14

నెల్లూరు టౌన్, ఏప్రిల్ 5: దివంగత కేంద్ర మాజీ మంత్రి జగ్జీవన్‌రాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కొనియాడారు.

04/04/2016 - 05:03

నెల్లూరు, ఏప్రిల్ 3: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్ రిజిస్ట్రార్‌కు రిమాండ్ విధించారు. శనివారం సబ్ రిజిస్ట్రార్ నందకిషోర్ ఇంటిలో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించి అక్రమ ఆస్తులను సంపాదించినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించారు.

04/04/2016 - 05:02

కావలి, ఏప్రిల్ 3: తాను ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి ఉద్యోగ వేటలో వుండగా నయం కాని హుద్రోగానికి గురికాగా గుండెమార్పిడితో వ్యాధి నయమవుతుందని వైద్యులు చెప్పారని కొండాపురానికి చెందిన చిమ్మిలి హరిబాబు అనే యువకుడు చెప్పాడు. ఆదివారం పట్టణంలోని ప్రజావైద్యశాల వైద్యులు డాక్టర్ ప్రభాకర్‌నాయుడు, వారి బంధువులతో కలిసి విలేఖర్లతో మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి తన ప్రాణాలను కాపాడాలని వేడుకున్నాడు.

04/04/2016 - 05:02

సూళ్లూరుపేట, ఏప్రిల్ 3: చెంగాళమ్మ పాలకవర్గ అధ్యక్ష పదవికి అధికార పార్టీ నేతల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఆలయ పాలక మండలి రద్దై నాలుగు నెలలు కావస్తున్నా నేటికీ నియమించికపోవడంతో పలువురు నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది.

04/04/2016 - 05:01

పెళ్లకూరు, ఏప్రిల్ 3: మండలంలోని చిల్లకూరు 24 సొసైటీ పరిధిలోని అక్కగారిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం జిల్లా జాయింట్ కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రైతుల నుంచి ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేశారనే దానిపై ఆరా తీసారు.

Pages