S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

04/04/2016 - 05:00

కొండాపురం, ఏప్రిల్ 3: గత నెల రోజులుగా మండలంలోని రాళ్లపాడు రిజర్వాయర్ ఆయకట్టుదారులు ఎదురుచూస్తున్న సాగునీటిని ఆదివారం అధికారులు విడుదల చేశారు. ఇందుకోసం రైతులు ఎన్నో ఉద్యమాలు చేశారు. నిరాహార దీక్షలకు సైతం దిగారు. రిజర్వాయర్ అధికారులు, కందుకూరుకు చెందిన ఒక నాయకుడు తాను, తన అనుచరగణం రిజార్వాయర్‌లో పెంచుతున్న చేపల కోసం తాగునీటి సాకు చూపి నీటిని విడుదల చేయకుండా నిలిపివేశారు.

04/04/2016 - 05:00

ఆత్మకూరు, ఏప్రిల్ 3: బిజెపి జిల్లా అధ్యక్షుడి నియామక ప్రక్రియ నెలల తరబడి కొలిక్కి రాకుండా సందిగ్ధంలోనే కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో విచారం వ్యక్తమవుతోంది. ఎన్నికల కమిషన్ నియామవళి అనుసరించి అన్ని రాజకీయ పార్టీలు రెండేళ్లకోమారు సభ్యత్వాల నమోదు విధిగా చేపట్టాలి. సభ్యత్వాల నమోదు తరువాయి సంస్థాగత ఎన్నికలు చేపట్టాల్సి ఉంది.

04/04/2016 - 04:59

నెల్లూరు, ఏప్రిల్ 3: జిల్లాలో ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని కోరుతూ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వేళ్లపాలెం శ్రీనివాసులరెడ్డి వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఆదివారం చిలకలూరిపేటలో వినతిపత్రం సమర్పించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

04/04/2016 - 04:58

నెల్లూరు, ఏప్రిల్ 3: వేసవి వచ్చిందంటే చాలు రైల్వే పోలీసులకు ఎక్కడ లేని చాకిరి ప్రారంభమవుతుంది. ఎండలు పెరిగేకొద్ది ఆందోళన కూడా పెరుగుతుంది. ఏడాది పొడవునా రైలు ప్రయాణంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినవారి కంటే కేవలం వేసవిలోనే సంభవించే మరణాల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ప్రతియేటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ ప్రమాదాలు ఎక్కువ సంభవిస్తుంటాయి.

04/03/2016 - 21:22

ఋతువుల రాణి వసంతకాలం
ప్రకృతిగట్టెను పచ్చనిచీర
కుహుకుహు రవముల కోకిల పాలు
ఘుమఘుమలాడే మల్లెల సొబగులు
పులుపు, తీపి, చేదుల కలయిక
వగరు, ఉప్పు, కారపు రుచులు
ఆరు ఋతువులు, ఆరు రుచులను
మానవ జీవిత సుఖదుఃఖాలకు ప్రతీకలు
గతితప్పిన కాలచక్ర గమనం
తారుమారైన ఋతువుల ఆగమనం
కలుషితమయ్యెను వాతావరణం
వంట చెరకుకు, ఇటుక బట్టీల ఎర్రదనానికి

04/03/2016 - 20:51

నానీల తీరం అనే సంపుటితో పెన్నాతీర వాసి తిప్పావఝుల సుబ్రహ్మణ్యం వెయ్యినానీల సంకల్పయాత్ర పూర్తయినట్టే. ఐదేళ్లుగా పట్టువదలని సాహితీ కర్షకుడు తిప్పావఝల. సామాజిక సరిగమలు, తిప్పావఝల నానీలు, నానీ పూలు, నానీలయాత్ర, నానీల తీరం వంటి సంపుటాలతో వెయ్యి నానీలు పూయించారు. నానీల సృష్టిలో అలుపెరుగని కవి సుబ్రహ్మణ్యంగారు. నానీల సృష్టి సామాన్యమైనా వెయ్యినానీల సృష్టి అసామాన్యమే.

04/02/2016 - 05:50

కావలి, ఏప్రిల్ 1 : వికలాంగుల సంఘాల మధ్య ఆధిపత్య పోరు న్యాయ వివాదాలు, అధికారుల విచారణలు, ప్రభుత్వం వారికిచ్చిన ఇళ్ల స్థలాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వరకు వెళ్లగా శుక్రవారం ఓ సంఘం నాయకులు ఆర్డీవో కార్యాలయంలో ఏకంగా ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు.

04/01/2016 - 05:48

నెల్లూరు టౌన్, మార్చి 31: జిల్లాలోని రైతులు పండించిన వరి ధాన్యానానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు రైతులు విక్రయించుకునేందుకు 165 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గుర్తించి పటిష్టంగా చర్యలు తీసుకున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు.

04/01/2016 - 05:46

ఆత్మకూరు, మార్చి 31: ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి గ్రామం వద్ద మదన్ అనే ఎనిమిది సంవత్సరాల బాలుడు సోమశిల ఉత్తరకాలువలో పడి గల్లంతయ్యాడు. గురువారం సాయంత్రం ఈ సంఘటన కలకలం రేపింది. సదరు బాలుడి తండ్రి రాజు పొగాకు కూలీగా పని చేస్తున్నాడు. వీరు గుంటూరు జిల్లావాసులు కాగా, రామస్వామిపల్లి వద్ద పొగాకు క్యూరింగ్ నిమిత్తం కుటుంబ సమేతంగా తరలివచ్చారు.

03/27/2016 - 21:15

‘‘శాంతి అంటే యేమిటి’’ అంటే ‘‘యుద్ధానికి యుద్ధానికి మధ్య ఉండేది శాంతి’’ అన్నాడట ఒక పెద్దాయన. యుద్ధాలు అనేవి రెండు దేశాల మధ్య కాని, రెండు జాతుల మధ్య కాని, రెండు కుటుంబాల మధ్య కాని, ఇద్దరు వ్యక్తుల మధ్య కాని జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా దంపతుల మధ్య కూడా నిత్యం యుద్ధం జరుగుతూ, మధ్య మధ్య శాంతి నెలకొంటూ ఉంటుంది. అందుకు సజీవ సాక్ష్యం భాస్కరరావు సమీరల దాంపత్యం.

Pages