S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

03/18/2016 - 06:40

నెల్లూరు, మార్చి17: ఫిర్యాదును సాంతం ఓపిగ్గా వినడం, వెంటనే స్పందించడం, ఆదేశాలు జారీ చేయడం... ఇలా సాగింది గురువారం జరిగిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 16 మంది తమ సమస్యలను ఎస్పీకి ఫోన్ ద్వారా విన్నవించుకున్నారు. ప్రతిఒక్కరి ఫిర్యాదును పూర్తిగా విని, అంతే ఓపిగ్గా వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఎస్పీ ప్రయత్నించారు.

03/18/2016 - 06:39

నెల్లూరు, మార్చి 17: రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర అందించే విషయంలో జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రధాన భూమిక పోషించాలని, వీటి నిర్వహణలో పూర్తి అవగాహన కలిగి పటిష్ఠంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.జానకి సూచించారు.

03/18/2016 - 06:38

వింజమూరు, మార్చి 17: మండలంలోని రావిపాడు అగ్రిగోల్డ్ లేఅవుట్ వద్ద గురువారం మధ్యాహ్నం ట్రాక్టర్, ఆటో ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా తయారైంది. గరిమెనపెంట నుంచి తొమ్మిది మందితో వింజమూరుకు వస్తున్న ఆటోను వింజమూరు నుంచి సేంద్రియ ఎరువుల లోడుతో ట్రాక్టర్ చాకలికొండ వైపు వెళ్తోంది.

03/13/2016 - 22:28

చలికాలం... ఓ మోస్తరు గ్రామంలోని పాత రైల్వే స్టేషన్ అది.... వూరికి కాస్త దూరంగా విసిరేసినట్టుటుంది. అది జంక్షన్ కాకున్నా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు కూడా ఆగుతాయక్కడ. అయినా జన సంచారం ఎక్కువగా వుండదు. సూర్యుడు అలసి సొలసి పడమటి కొండల్లోకి జారిపోతున్నాడు. సంజె వెలుగుల్లో ఆకాశమంతా మోదుగపూలు తివాచి పరిచినట్లుగా వుంది. కాసేపటికి సూర్యుడు పూర్తిగా కనుమరుగై పోయాడు.

03/05/2016 - 23:05

రేపటి మనుషులు

కథ

02/28/2016 - 23:39

తూర్పు తెలవారడానికి తొందర పడుతూ ఆకాశం కెంజాయ రంగు పులుము కొంటూ తెల్లబారుతోంది. అప్పటికే వాకిట్లో నీళ్ళు జల్లి ముగ్గు వేయడానికి వంగింది ఉష.
కళాత్మకమైన చేతుల్లోంచి ముగ్గుపిండి రంగులు జాలువారుతు ముగ్గుల్లో రంగులు పూలై విరబూసాయి. ముగ్గు ముగించి తదేకంగా చూసింది. నాలుగు ప్రక్కలనుండి చూశాక, తృప్తిగా పారిజాతం చెట్టు విదిల్చిన పూలు తీసుకొని లోపలికి నడిచింది ఉష.

02/23/2016 - 20:58

వంటింట్లోంచి ‘‘కెవ్వు’’మని అరిచింది విశాలక్షి. అదొక పెద్దకేక.
హల్లో కూర్చుని టి.వి. చూస్తున్న మేజర్ ప్రతాపరావ్ ఉలిక్కిపడ్డాడు. అంతలోనే కెవ్వు, కెవ్వుమని మరో రెండు అరుపులు అరిచింది విశాలక్షి.
దాంతో ఏమైందో ఏమోనని యమ కంగారు పడిపోతూ, సోఫాలోంచి దిగ్గున లేచి వంటింట్లోకి పరుగుతీశాడు మేజర్ ప్రతాప్‌రావ్.
అతను వెళ్లేసరికి-

02/16/2016 - 21:14

అమా... ఓమో.. ఇట్రామో అన్నాడు. యాందిరా నీది పొద్దునే్న నసై పొయ్యిండాది. నాగ్గాని పనిబాట గాని లేదనుకున్నావా యాందని అట్టగాదు లేమా.. నేను జెప్పేమాట ఓ పాలి ఇని పోదువు గాని ఇట్రా ఇట్టొచ్చి కూకోమో అని వాళ్లమ్మని నులక మంచం మీద కూకోబెట్టి నేల మీద కూలబడ్డాడు వీరాసామి. అందరూ వాణ్ణి ఈరిగా అని బిలస్తార్లే..

02/08/2016 - 23:54

మస్తాన్ సాయిబుకు వంద మేకలున్నాయి. వాటికి నలభై మేకపిల్లలున్నాయి. ఉదయగిరి దుర్గం చుట్టూ విశాలమైన అడవి ఆకుపచ్చని చెట్లతో పచ్చదుప్పటి పరచినట్లుగా ఉంటుంది. మేకలకు తిన్నంత మేత. ఏటా కనీసం పది మేకపోతుల్ని అమ్ముతాడు మస్తాన్. తెగతిని బాగా బలసిన ఈ కొండ మేకపోతుల మాంసం చాలా రుచిగా ఉంటుందని నెల్లూరు, కడప మొదలైన దూర ప్రాంతాల నుంచి వచ్చి మంచి ధర ఇచ్చి మేకపోతుల్ని కొనుక్కుపోతుంటారు.

01/31/2016 - 00:10

‘‘పెద్ద పెద్ద ఉపదేశాలివ్వడం, పిల్లలకు ఉచిత సలహాలివ్వడం మాలాంటి పెద్దలకు అలవాటు. పెద్దవాళ్లు తామెంతో తెలివిగల వాళ్లలా ప్రవర్తిస్తుంటారు. కాని వాళ్లలో కొద్దిమంది మాత్రమే విజ్ఞానవంతులు. ఈ పెద్దలంతా ఎంతో చిత్రంగా, తమకు తాముగా పరిమిత పరిధులను, సమూహాలను నిర్మించుకుంటారు’’.

Pages