S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

02/13/2017 - 22:24

గతవారం మెరుపులో ప్రచురించిన సత్యానే్వషణ కథ చాలా బాగుంది. కథ ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉన్నాను. కథలోని సంభాషణలు చాలా బాగున్నాయి. ఉదయం పేపర్లు చదవడం దగ్గర నుంచి టీవీ కార్యక్రమాల విశే్లషణ, సెటైర్లు అన్నీ కడుపుబ్బ నవ్వించాయి. చిదానందం, సదానందం పాత్రల చిత్రీకరణ ఎక్కడా బోరింగ్ లేకుండా ఉంది. ప్రస్తుతం సమాజంలో టీవీల ప్రభావం ఎలా ఉందో హాస్యభరితంగా వివరించారు.

02/05/2017 - 04:57

చాలా రోజులకి సదానందకి తన చిరకాల మిత్రుడు, చిదానందం యింటికి వెళ్లాలనిపించింది.
అంతే ఆదివారం ఉదయం చిదానందం యింట్లో ప్రత్యక్షమయ్యాడు.
ఎదురుగా...చిదానందం పద్మాసనంలో కూర్చుని.. చుట్టూ అయిదారు పత్రికలు వేసుకుని తపోదీక్షతో మునిగి ఉండడం చూశాడు.
కూర్చీ లాక్కుని అతన్ని ఎందుకు డిస్ట్రబ్ చేయడం అనుకుంటూ.. ఎదురుగా కూర్చున్నాడు.

02/05/2017 - 04:53

అక్కడొక క్రియ
అసామాన్యంగా
అద్భుతంగా జరిగింది
భూమి పూజ చేసిన బుడతడు
బీజావాపనం చేశాడు
వరుణుడు వరమిచ్చాడు
భానుడు భాసించాడు
మట్టిపొరలను చీల్చి
అంకురం చిగురుటాకై
పత్రాల వలువలు తొడిగి
శుక్లపక్ష చంద్రుడై
మొక్క మానై పల్లవించి
కర్భన కోరలు ఛేదించి
కొత్త నీచుల
మాయాజాలంలో
వాదరకు గురికాక

02/05/2017 - 04:49

మా ఊరి పెన్నమ్మ తల్లి కవిత సూపర్

01/29/2017 - 04:37

అలారం 4 గంటలకు మ్రోగగానే ప్రసాద్ ఆ సౌండ్‌ని వెంటనే ఆపి పుస్తకాలు తీసి చదవడం ప్రారంభించాడు.
ఒకప్రక్క చదువుతూనే నేలమీద దీనంగా పడుకున్న తల్లిదండ్రుల వైపు చూశాడు.
అరిగిపోయిన కాళ్లు, వాచిపోయిన చేతులు చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ‘నేను బాగా చదవాలి.. నేను బాగా చదవాలి’ అని పాజిటివ్‌గా అనుకుంటూ బ్యాంకు ఉద్యోగం సంపాదించి మా వాళ్లకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి అని అనుకున్నాడు.

01/24/2017 - 23:45

పగలు వేడి, రాత్రిపూట చలి. పొద్దునే్న తొందరగా లేవాలంటే ఎవరికైనా బద్దకమే. చలికి తట్టుకోలేక వెచ్చగా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్న సంధ్యకి అత్త గట్టిగా పిలుస్తున్నా మెలకువ రాలేదు. నేరుగా సంధ్య ఉన్న గది వద్దకు వచ్చిన అత్త సుజాత తలుపు మీద తడుతూ ‘‘సంధ్య, సంధ్య..

01/24/2017 - 23:43

స్వాతంత్య్ర సమరయోధుల పోరాట ఫలితంతో
అతిరథ మహారథుల ఆశయాల
ప్రజాస్వామ్యంలో
భిన్న సంస్కృతుల భారతావనిలో
సవరణల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలలో
నియమ నిబంధనలు కల్గిన
భారత రాజ్యాంగంలో
సమానత్వ భావనలతో నిండిన
ఈ మానవ సామ్రాజ్యంలో
తొలి స్వేచ్ఛా వాయువుల గణతంత్ర
భారతదేశంలో
బహుభాషల లౌకికతత్వం భారతీయుల
ఐకమత్యం

01/24/2017 - 23:37

మెరుపులో అబ్బో.. ఎంత జ్ఞానో! కథ చాలా బాగుంది. కోలపల్లి ఈశ్వర్ గారి నుంచి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది. ఆయన కథల్లో హాస్యం ఆనందభైరవి నాట్యం చేస్తుంది. ఈ కథలోనూ అంతే. స్వామిజీ తెలివితేటలు ఎంత గొప్పవో అద్భుతంగా వర్ణించి అందరిని కడుపుబ్బ నవ్వించారు. అందరికి తెలిసిన విషయాన్ని చక్కటి సంభాషణలతో, హాస్యభరితంగా కథను మలిచిన తీరు బాగుంది. ప్రస్తుత సమాజంలో స్వామిజీల పాత్ర కూడా ఇలానే వుందనే చెప్పాలి.

01/08/2017 - 00:16

‘‘ఆయన చాలా శక్తివంతమైన స్వామీజీ!’’ చెప్పాడు అరవింద్. సుతారంగా చెంపల మీద చేతులతో తట్టుకుంటూ.
‘‘ ఏ రకంగా?’’ అడిగాడు నవకాంత్.
‘‘ఆయన తన వద్దకు వచ్చే భక్తుల నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారి కోరికలు తీరుస్తాడు.. అంటే... డైరెక్టుగా తీరుస్తాడని కాదు. ఆయా కోర్కెలు నెరవేరాలని మన తరపున ఆయన దైవ ప్రార్థన చేస్తాడు..

01/08/2017 - 00:14

ప్రశంసతో పెరుగుతుంది
మనలో మనోనిబ్బరం
అందుకోగలుగుతాం ఎంతో సుదూరం
అలవడుతుంది ధరిత్రి సహనం
ఏర్పడుతుంది మనలో
నిష్కల్మష మస్తిష్కం
మన పయనం కలిగిస్తుంది
నిశీధికి కలకలం
ప్రేరణ కలుగుతుంది
నూతన ఆవిష్కారమునకు
మానసిక ఊగిసలాట మాయం స్థిరత్వం ఖాయం
ఒక ప్రశంస చేస్తుంది
చిద్విలాసం మన చిరునామ
పెరుగుతుంది మనపై
మనకు నమ్మకం

Pages